Pariksha Pe Charcha 2021: మార్చిలో ప్రధాని మోదీ ‘పరీక్షా పే చర్చ’.. ఈ సారి ఆన్‌లైన్‌లో.. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం
PM Narendra Modi - Pariksha Pe Charcha 2021: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏటా నిర్వహించే ‘పరీక్షా పే చర్చ’ నాలుగో ఎడిషన్ కార్యక్రమం మార్చి నెలలో జరుగనుంది. అదికూడా ఆన్‌లైన్ పద్దతిలో నిర్వహించనున్నట్లు విద్యాశాఖ..
PM Narendra Modi – Pariksha Pe Charcha 2021: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏటా నిర్వహించే ‘పరీక్షా పే చర్చ’ నాలుగో ఎడిషన్ కార్యక్రమం మార్చి నెలలో జరుగనుంది. అదికూడా ఆన్‌లైన్ పద్దతిలో నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. త్వరలో పరీక్షలు రాయనున్న తొమ్మిది నుంచి 12వ తరగతి విద్యార్థులల్లో భయాందోళనలను తొలగించడానికి 2018 నుంచి ప్రధాని మోదీ పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఏటా జనవరిలో జరిగే ఈ కార్యక్రమం కరోనా వల్ల నిర్వహించేందుకు వీలు కుదరలేదు. అయితే ఈసారి ప్రత్యక్షంగా కాకుండా వర్చువల్ పద్ధతిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. విద్యార్థులతో మాట్లాడి వారి భయాందోళనలను తొలగిస్తారని విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ వెల్లడించారు. ఈ సమావేశం మార్చి నెలలో జరుగుతుందని, తేదీలను త్వరలో వెల్లడిస్తామని ట్వీట్ చేశారు. అయితే ఈ ఏడాది విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను కూడా పరీక్షా పే చర్చ కార్యక్రమానికి అనుమతించనున్నారు.
దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమవుతుందని, మార్చి 14 వరకు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని పోఖ్రియాల్ వెల్లడించారు. ప్రధానితో ఇంటరాక్ట్ అవ్వాలనుకున్న విద్యార్థులు innovateindia.mygov.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఎంపిక చేసిన థీమ్‌లలో 500 పదాలకు మించకుండా తమ ప్రశ్నలను పంపించాలని సూచించారు. ఈ థీమ్స్ ఆధారంగా విధార్థులు వేసే ప్రశ్నలకు మోదీ సమాధానాలు చెబుతారు. పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల్లో ఉండే భయాలను పొగొట్టేందుకు మూడేళ్లుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనిని ప్రభుత్వం దూరదర్శన్, ఆకాశవాణిలో ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
ఈ మేరకు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ కూడా కూ యాప్‌లో పోస్ట్ చేశారు. ఈ సారి పరీక్షా పే చర్చ కార్యక్రామానికి మోదీ జీ తిరిగొచ్చారని.. ఆయన దగ్గర సలహాలు, సూచనలు తీసుకోండంటూ ఆయన విద్యార్థులకు సూచించారు.
Also Read: