కరోనా నివారణకు బీఎంసీ ప్లాన్.. రైళ్లల్లో మార్షల్స్.. నిబంధనలు పాటించపోతే అంతే..
BMC - Coronavirus: మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న విదర్భ ప్రాంతంలోని యవత్మల్, అమరావతి..
BMC – Coronavirus: మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న విదర్భ ప్రాంతంలోని యవత్మల్, అమరావతి జిల్లాల్లో లాక్‌డౌన్ విధించింది. కొవిడ్-19 నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని లేకపోతే.. కఠిన చర్యలు ఉంటాయని ప్రజలకు ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో గతంలో కరోనా హాట్‌స్పాట్‌గా మారిన ముంబైలోనూ కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో బీఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. లోకల్ రైళ్లలో మాస్క్‌లు లేకుండా ప్రయాణించేవారిపై నిఘా పెంచేందుకు బృహన్ ముంబై కార్పొరేషన్ 300 మంది మార్షల్స్‌ను నియమించనుందని కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్ తెలిపారు.
వీరికి అదనంగా మరికొంత మంది మార్షల్స్‌ను సైతం ముంబై నగరంలో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మార్షల్స్‌కు ప్రతిరోజూ టార్గెట్ కూడా ఉంటుందని.. వారంతా నిబంధనలు ఉల్లంఘించే వారిపై నిఘా వేసి ఉంచుతారని పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించకపోతే రూ.200 ఫైన్ వేయనున్నట్లు ఇక్బాల్ సింగ్ వెల్లడించారు. ప్రజలు మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటించాలని.. లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాకుండా శుభకార్యాలకు, జనం గుమిగూడే సభలకు పర్మిషన్ తీసుకోవాలని సూచించారు.
Also Read: