Road Terror: ఆ ఆత్మే వారి ప్రాణాలను బలి తీసుకుంటుందా? అక్కడ జరిగే ప్రమాదాలకు కారణమేంటి?

Road Terror: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా తిరుపతిలోని మేర్లపాక రోడ్డు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఈ రోడ్డు ప్రమాదాలకు అడ్డగా

Road Terror: ఆ ఆత్మే వారి ప్రాణాలను బలి తీసుకుంటుందా? అక్కడ జరిగే ప్రమాదాలకు కారణమేంటి?
Follow us
Shiva Prajapati

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 06, 2021 | 3:19 PM

Road Terror: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా తిరుపతిలోని మేర్లపాక రోడ్డు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఈ రోడ్డు ప్రమాదాలకు అడ్డగా మారడంతో దీనిపై విపరీతమైన చర్చ నడుస్తోంది. తాజాగా మేర్లపాక దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదం ఇలా ఉంటే.. నెల రోజుల వ్యవధిలోనే ఈ ప్రాంతంలో తొమ్మిది బస్సులు బోల్తా పడ్డాయి. దాంతో మేర్లపాక రోడ్డు మరోసారి చర్చనీయాంశమైంది. ఈ ప్రమాదాలకు కారణం ఏంటా అంటే.. స్థానికులు బల్లగుద్ది మరీ దెయ్యమే అని చెబుతున్నారు. మేర్లపాక రోడ్డు ప్రమాదాలకు మూలకారణం చిన్న పాప రూపంలో ఉన్న ఆత్మే అని స్థానిక ప్రజలు అంటున్నారు.

అసలు ఈ దెయ్యం కథ ఏంటి..? ప్రమాదాలకు కారణమేంటి..? అనే దానిపై టీవీ9 ఆరా తీయగా.. అక్కడి ప్రజలు వింత సమాధానాలు చెప్పారు. రాత్రిపూట వెళ్లే వాహనాలకు చిన్న పాప రూపంలో ఉన్న ఆత్మ అడ్డువస్తుందని, ఆ కారణంగానే అక్కడ ప్రమాదాలు సంభవిస్తున్నాయని వివరిస్తున్నారు. ఆ ఆత్మే అందరినీ చంపేస్తోందంటున్నారు. అంతేకాదు.. చిన్న పాప ఆత్మను తాము చూశామని కూడా గ్రామస్తులు చెబుతున్నారు. ఆ ఆత్మ కారణంగా తమ గ్రామానికి చెందిన ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారంటున్నారు. మరి ఇంతకీ ఎవరిదా ఆత్మ? అసలు ప్రమాదాలకు కారణాలేంటి? పూర్తి వివరాలు కింది వీడియోలో చూద్దాం..

Also read:

శరవేగంగా పోలవరం ప్రాజెక్ట్ స్పిల్ ఛానెల్ కాంక్రీట్ పనులు, సరికొత్త అంకానికి శ్రీకారం చుట్టిన మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ

బర్డ్ ఫ్లూ కలకలం: రాష్ట్రాలకు కేంద్రం హై-అలెర్ట్.. ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు..