SBI: ఖాతాదారుల కోసం మరో వెసులుబాటు కల్పించిన బ్యాంకింగ్ దిగ్గజం.. ఇకపై ఆ పనికోసం బ్యాంక్ వెళ్లాల్సిన అవసరం లేదు..
Make SBI Nominee Registration Online: మారుతోన్న టెక్నాలజీని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటున్నాయి బ్యాంకింగ్ సంస్థలు. ఇందులో ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ రంగ దిగ్గజం ఎస్‌బీఐ ముందు వరుసలో ఉంటుంది...
Make SBI Nominee Registration Online: మారుతోన్న టెక్నాలజీని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటున్నాయి బ్యాంకింగ్ సంస్థలు. ఇందులో ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ రంగ దిగ్గజం ఎస్‌బీఐ ముందు వరుసలో ఉంటుంది. ఖాతాదారుల సౌకర్యానికి పెద్ద పీఠ వేస్తూ వినూత్న సేవలను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఈ క్రమంలో మరో కొత్త అవకాశాన్ని కల్పించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సాధారణంగా బ్యాంకులో ఖాతా ఉన్న ప్రతీ వ్యక్తి.. తమ నామినీని పేర్కొనాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ కోసం కచ్చితంగా బ్యాంకుకు వెళ్లాలి. అయితే ఇకపై ఆ పనిలేకుండా ఇంట్లో నుంచి ఆన్‌లైన్ ద్వారా సింపుల్‌గా ఈ పనిచేసేయొచ్చని చెబుతోంది ప్రభుత్వ రంగ బ్యాంకింగ్. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ఖాతా దారులతో పంచుకుంది. ఇకపై ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్ లేదా ఎస్‌బీఐ మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ఈ ఆప్షన్ ఇంట్లో నుంచే చేసుకోవచ్చు. అంతేకాకుండా యోనో యాప్ ద్వారా కూడా అకౌంట్‌కు నామినీ వివరాలను జత చేసుకోవచ్చు. ఖాతాదారుడు అనుకోకుండా మరణిస్తే.. అప్పుడు ఆ బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బులపై నామినీ పూర్తి అధికారం ఉండేందుకు గాను ఈ ఆప్షన్‌ను తీసుకొచ్చారు.
We have a good news! Now SBI customers can register their nominee by visiting our branch or logging into https://t.co/YMhpMw26SR.#SBI #StateBankOfIndia #OnlineSBI #InternetBanking pic.twitter.com/AMvWhExDre
— State Bank of India (@TheOfficialSBI) February 3, 2021
ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా ఇలా చేసుకోవాలి..
* మొదట onlinesbi.com ఓపెన్ చేసి లాగిన్ వివరాలతో లాగిన్ కావాలి.
* అనంతరం మెనులోని ‘రిక్వెస్ట్ & ఎంక్వైరీస్’ టాబ్ పై క్లిక్ చేయాలి.
* తర్వాత ఆన్‌లైన్ నామినేషన్ ఆప్షన్‌ను ఎంచుకొని.. నామినీని యాడ్ చేయాలనుకుంటున్న ఖాతాను ఎంచుకొని ప్రొసిడ్‌పై క్లిక్ చేయాలి.
* అనంతరం నామినీ పూర్తి విరవాలను నమోదు చేసి ‘సబ్మిట్’ బటన్‌పై క్లిక్ చేయాలి.
* వెంటనే మీ మొబైల్‌కు వచ్చిన పాస్ట్‌వర్డ్‌ను ఎంటార్ చేసి. ‘కన్ఫామ్’ బటన్‌పై క్లిక్ చేస్తే సరిపోద్ది.
Also Read: Computer Keyboard: కీ బోర్డుపై అక్షరాలు వరుస క్రమంలో ఎందుకు ఉండవు..?.. అలా ఎందుకు తయారు చేశారు..?