Diabetes: చపాతీలు తిన్నాడు.. కళ్లు పోగొట్టుకున్నాడు.. 12 ఏళ్ల బాలుడి అవస్థ ఇది..

ఆ చిన్నారి వయసు 12. అతడు కంటి చూపు కోల్పోయాడు. శరీరంలోని అవయవాలు దాదాపు పనిచేయడం మానేశాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Diabetes: చపాతీలు తిన్నాడు.. కళ్లు పోగొట్టుకున్నాడు.. 12 ఏళ్ల బాలుడి అవస్థ ఇది..
12 Year Old Boy With Blood Sugar Level Eats Chapatis A Day
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 03, 2021 | 8:18 AM

Blood Sugar Level eats Chapatis: ఆ పిల్లోడి వయసు 12 ఏళ్లు. రోజుకు 40 చపాతీలు తీసుకోవడం మొదలుపెట్టాడు. పిల్లవాడు ఇష్టంగా తింటుడంతో అతని తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పలేదు. ఉన్నట్టుండి ఒక్కరోజు ఆ బాలుడు మూర్చపోయాడు. దీంతో కంగారుపడ్డ తల్లిదండ్రులు హుటాహుటీన సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బాలుడిని పరిశీలించిన వైద్యులతో సహా తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు.

ఆ చిన్నారి వయసు 12. అతడు కంటి చూపు కోల్పోయాడు. శరీరంలోని అవయవాలు దాదాపు పనిచేయడం మానేశాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే, అది ఒక్కరోజులో వచ్చింది. అది కూడా చపాతీలు తిని అనారోగ్యం పాలయ్యాడు. ఆశ్చర్యంగా ఉందా.. కానీ, ఇది నిజం. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లా ఖోడ్ గ్రామానికి చెందిన బన్వారీ కుమారుడు సందీప్ అనే చిన్నారికి ఓ వింత పరిస్థితి ఏర్పడింది. రోజు రోజుకూ కంటి చూపు కోల్పోవడం మొదలు పెట్టాడు. ఇక, ఓ రోజు ఏకంగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అతడి తండ్రి బన్వారి ఆదివాసి వెంటనే చిన్నారిని దగ్గరలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ డాక్టర్ దీపక్ గౌతం అనే డాక్టర్ చిన్నారిని పరిశీలించి షాకయ్యాడు. సందీప్ శరీరంలోని మధుమేహం. అది కూడా ఏకంగా 1,200కు పైగా ఉంది. అతడు శ్వాస తీసుకోవడటంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అంతేకాదు, శరీరంలో ఎలాంటి కదలికలు లేవు. గుండెతో సహా అతని శరీర భాగాలన్నీ దాదాపుగా పనిచేయడం మానేశాయి.

సాధారణంగా 140 లోపు ఉండాల్సిన షుగర్ కౌంట్ 1206కు చేరుకుంది. ఇది సామాన్య విషయం కాదు. చిన్నారి ప్రాణాలకే ప్రమాదం. ఈ విషయంపై డాక్టర్లు బన్వారీని ప్రశ్నించగా.. అసలు విషయం బయటపడింది. డాక్టర్ గౌతమ్ చెప్పిన వివరాల ప్రకారం.. సందీప్ రోజూ 40 చపాతీలు తినేవాడు. దీనివల్ల అతడి తలలో చీము చేరుకుంది. చిన్నారికి డాక్టర్ అనంత్ రాఖోరే శస్త్ర చికిత్స చేశారు. అతడి తల నుంచి 720 ఎంఎల్ చీమును వెలికితీశారు.

డాక్టర్ గౌతమ్ తన బ్లడ్ షుగర్ లెవల్ అసాధారణంగా ఎక్కువగా ఉందని 1206 మి.గ్రా. అతని తలలో చీము పెరగడంతో పాటు, అతను రోజుకు 40 చపాతీలు తినడానికి ఇదే కారణం. వైద్యుడు డాక్టర్ అనంత్ రాఖోర్ సర్జన్ అతని తల నుండి 720 మి.లీ చీమును బయటకు తీసాడు. చీము కారణంగా బాలుడు మూర్ఛపోయాడని, అది అతని అంధత్వానికి కూడా కారణమైందని డాక్టర్ రాఖోర్ చెప్పారు. అతని రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి, వైద్యులు సందీప్‌కు రోజూ ఆరు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చారు. ఒకసారి అతని చక్కెర స్థాయి సాధారణమైన తర్వాత, జిల్లా ఆసుపత్రిలో కంటి వైద్యుడు డాక్టర్ గిరీష్ చతుర్వేది అతని కళ్లను పరీక్షించారు. బాలుడు డయాబెటిక్ రెటినోపతితో బాధపడుతున్నాడని డాక్టర్ చతుర్వేది చెప్పారు. అతను బాలుడి తల్లిదండ్రులకు వీలైనంత త్వరగా కళ్లకు ఆపరేషన్ చేయించుకోవాలని సూచించాడు.

అతని తల్లిదండ్రులు అంగీకరించిన తరువాత, డాక్టర్ చతుర్వేది మొదట బాలుడి ఎడమ కంటికి ఆపరేషన్ చేశారు. ఐదు రోజుల తర్వాత కుడి కంటికి ఆపరేషన్ చేశాడు. దీంతో బాలుడికి చూపు తిరిగి వచ్చింది. మెడికల్ కాలేజీలో చైల్డ్ స్పెషలిస్ట్ డాక్టర్ కృతి, డాక్టర్ షమీ జైన్ కూడా బాలుడికి కొత్త జీవితాన్ని అందించడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. బాలుడు ప్రస్తుతం ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కానీ, ప్రమాదం నుండి బయటపడ్డాడు. వైద్య శాస్త్రానికి అంతి చిక్కన్నంతగా ఉన్న ఈ కేసును వైద్యులు చేసిన కృషి మరువలేనిదని సందీప్ తల్లిదండ్రులు తెలిపారు. తమ కొడుకును మామూలు స్థితికి తీసుకువస్తున్నందుకు వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు.

Read Also… 

Viral Video: మనవడితో కలిసి డ్యాన్స్ ఇరగదీసిన బామ్మ.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో