Lemongrass Farming: రైతులకు సిరులు కురిపిస్తున్న నిమ్మ గడ్డి.. ఎకరానికి రూ. లక్ష వరకు. దీనికి ఎందుకంత డిమాండ్‌ అనేగా?

| Edited By: Narender Vaitla

Jul 10, 2021 | 5:47 PM

Lemongrass Farming: ప్రస్తుతం మారుతోన్న కాలానికి అనుగుణంగా వ్యవసాయంలోనూ మార్పులు వస్తున్నాయి. రైతులు ఆధునిక టెక్నాలజీని అందిపుంచుకుంటూ సిరులు పండిస్తున్నారు. మారుతోన్న మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా..

Lemongrass Farming: రైతులకు సిరులు కురిపిస్తున్న నిమ్మ గడ్డి.. ఎకరానికి రూ. లక్ష వరకు. దీనికి ఎందుకంత డిమాండ్‌ అనేగా?
Lemongrass
Follow us on

Lemongrass Farming: ప్రస్తుతం మారుతోన్న కాలానికి అనుగుణంగా వ్యవసాయంలోనూ మార్పులు వస్తున్నాయి. రైతులు ఆధునిక టెక్నాలజీని అందిపుంచుకుంటూ సిరులు పండిస్తున్నారు. మారుతోన్న మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా పంటల్లో మార్పులు తీసుకొస్తూ ఆర్థికంగా లాభ పడుతున్నారు. ఈ క్రమంలోనే తెరపైకి వచ్చింది నిమ్మ గడ్డి. ఈ గడ్డిని పెంచడం ద్వారా రైతులు ఎకరానికి ఏకంగా రూ. లక్ష వరకు సంపాదించుకునే అవకాశం ఉందన్న విషయం మీకు తెలుసా? ఇంతకీ ఏంటీ నిమ్మ పంట.? దీనికి అంత డిమాండ్‌ ఎందుకన్న విషయాలు ఓ సారి తెలుసుకుందాం.

పండించడం చాలా సులభం..

నిమ్మ గడ్డిని చాలా సులభమైన పద్ధతుల్లో పండించవచ్చు. దీనికి ప్రత్యేకంగా ఎలాంటి ఎరువులు ఉపయోగించాల్సిన అవసరం లేదు. అలాగే వీటికి కీటకాల బెడద కూడా చాలా తక్కువ. ఇక దీనికి అయ్యే ఖర్చు కూడా తక్కువగానే ఉండడం విశేషం. సాధారణంగా ఈ లెమన్‌ గ్రాస్‌ పంటను ఫిబ్రవరి నుంచి జులై మధ్యలో పండిస్తే మంచి ఫలితం వస్తుంది. ఒకసారి పంటను వేస్తే కేవలం మూడు నుంచి ఐదు నెలల్లోనే చేతికొస్తుంది.

నిమ్మ గడ్డితో ఉపయోగం ఏంటీ.?

ఇంతకీ నిమ్మ గడ్డితో ఉపయోగమేంటనేగా మీ సందేహం. ఈ గడ్డి నుంచి తీసిన నూనెకు ప్రస్తుతం మార్కెట్లో ఫుల్‌ డిమాండ్‌ ఉంది. ఈ నూనెను కాస్మెటిక్, డిటర్జెంట్లు, మందుల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. అందుకే బాగా డిమాండ్‌ ఏర్పడింది. ఇక ఒక ఎకరంలో దీన్ని పండిస్తే దాని నుంచి యాభై నుంచి అరవై ఐదు లీటర్ల నూనెను పొందే వీలుంటుంది. ఒక లీటర్ నూనె కనీసం వెయ్యి రూపాయల నుంచి 1500 రూపాయల వరకు ఉంటుంది. ఈ లెక్కన చూసుకుంటే ఒక ఎకరం ద్వారా దాదాపు రూ. లక్ష రూపాయలు సంపాదించొన్నమాట.

ఎన్నో లాభాలు..

ఇక నిమ్మ గడ్డి కేవలం కాస్మెటిక్, డిటర్జెంట్లు, మందుల తయారీకే కాకుండా మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఈ గడ్డితో చేసిన టీ తాగడం వల్ల శ్వాస సంబంధమైన ఇబ్బందులు దూరం కావడంతో పాటు జీర్ణ సంబంధిత సమస్యలు తొలిగిపోతాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. జ్వరం, రొంప, దగ్గు, జలుబు వంటి సాధారణమైన వాటిని కూడా ఈ లెమన్‌ గ్రాస్‌ టీతో చెక్‌ పెట్టవచ్చు.

Also Read: అమ్మో .. బైక్ పై భారీ సర్పం.. జనాలపై ఎగిసిపడుతున్న వైనం.. చూస్తే మీరూ షాక్ అవ్వాల్సిందే..

Shocking Video: భారీ సైజ్ గుడ్లను మింగిన పాము.. ఆ తరువాత గిలగిల కొట్టుకుంది.. అసలేం జరిగిందంటే..

Zodiac Signs: ఈ రాశుల వారు మీ భాగస్వామ్యులైతే మీకు ఢోకా ఉండదు. లైఫంతా బిందాస్‌.. ఆ రాశులేంటంటే.