Shocking Video: భారీ సైజ్ గుడ్లను మింగిన పాము.. ఆ తరువాత గిలగిల కొట్టుకుంది.. అసలేం జరిగిందంటే..
Snake: పాము ఎంత ప్రమాదకరమైనదో మనందరికీ తెలుసిందే. సాధారణంగా పామును చూస్తే కొందరు మినహా చాలా మంది హడలిపోతారు. ఒకవేళ పాము..
Snake: పాము ఎంత ప్రమాదకరమైనదో మనందరికీ తెలుసిందే. సాధారణంగా పామును చూస్తే కొందరు మినహా చాలా మంది హడలిపోతారు. ఒకవేళ పాము గనుక ఎదురుపడితే అంతే సంగతలు.. గుండె ఆగినంత పని అయిపోతుంది. అయితే, ఇక్కడ ఓ పామును చూసి జనాలు ఏమాత్రం భయపడలేదు. పైగా దాని అవస్థను చూసి అయ్యో పాపం అనుకున్నారు. పాము మింగిన ఆహారం అధికమవటంతో.. దాన్ని బయటకు తీసేందుకు పాము పడిన తంటాలు అన్నీ ఇన్నీ కావు. గిలగిల కొట్టుకుంది. ఈ పాముకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సాధారణంగా పాములు ఆహారంగా చిన్న జీవులను, కప్పలు, గుడ్లు, కీటకాలను తినంటాయి. అయితే, పాములు ఏ ఆహారాన్నైనా మింగుతాయనే విషయం తెలిసిందే. అలా మింగడమే ఇక్కడ పాముకు పెద్ద తలనొప్పిగా మారింది. మింగిన వస్తువులు భారీగా ఉండటంతో తట్టుకోలేక వాటిని మళ్లీ బయటకు విసర్జించింది. అయితే విసర్జించే క్రమంలో పాము.. గిలగిట కొట్టుకుంది. దాని అవస్థలు వర్ణనాతీతం అని చెప్పాల్సిందే.
ఇంతకీ పాము ఏం మింగిందంటే.. ఈ వీడియోలో ఓ పాము రెండు భారీ సైజ్‌లో ఉన్న గుడ్లను మింగేసింది. వాటి భారీ పరిణామం కారణంగా పాము శరీరంలో ఇబ్బందిని కలిగించింది. పాము ఆ గుడ్లను పూర్తిగా మింగలేకపోయింది. దాంతో అవి మధ్యలోనే ఇరుక్కపోయాయి. ఫలితంగా ఆ పాము ఎటూ కదలలేకపోయింది. ఇక చేసేదేమీ లేక సగం వరకు మింగిన ఆ గుడ్లను పాము బయటకు తీసేందుకు ప్రయత్నించింది. ఆ ప్రయత్నంలో పాము పడిన కష్టం అంతా ఇంతా కాదు. భారీ పరిణామంలో ఉన్న ఈ గుడ్లను తొలుత ఈజీగానే మింగేసిన పాము.. వాటిని విసర్జించేందుకు ఆపసోపాలు పడింది. నేలపై గిర గిరా తిరుగుతూ.. గిలగిల కొట్టుకుంటూ ఎట్టకేలకు ఆ గుడ్లను విసర్జించింది. పాము విసర్జించిన ఆ గుడ్లు చాలా పెద్దగా ఉన్నాయి. ఆ కారణంగానే పాము ఇబ్బంది పడినట్లు వీడియో చూస్తే స్పష్టమవుతోంది. కాగా, ఈ పాము అవస్థను కొందరు వీడియో తీశారు. ఈ వీడియోను ‘అడ్లే’ అనే మహిళ తన ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేసింది. దాంతో ఈ వీడియో కాస్తా తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు సైతం దీనిని చూసి షాక్ అవుతున్నారు.
Viral Video:
Also read:
Zodiac Signs: ఈ రాశుల వారు మీ భాగస్వామ్యులైతే మీకు ఢోకా ఉండదు. లైఫంతా బిందాస్.. ఆ రాశులేంటంటే.
ఢిల్లీలో 350 కేజీల హెరాయిన్ పట్టివేత..నలుగురి అరెస్ట్..అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ ఎంతంటే ..?