Onion Cutting Tips: ఉల్లి మిమ్మల్ని ఏడ్పిస్తోందా.. ఈ చిట్కాలు పాటిస్తే శాశ్వతంగా చెక్ పెట్టొచ్చు..

Onions Cutting without Tears: కూరకు ఉల్లిపాయలు ఎంత రుచిగా ఉంటాయో... వాటిని కట్ చేస్తున్నప్పుడు వచ్చే మంట అంతే సినిమా కనిపిస్తుంది. కళ్ల నుంచి నీళ్లు ధారలు కడుతాయి. ఉల్లికి ఉండే ఘాటు కారణంగా కళ్లు మంటలు పుడుతాయి. ఉల్లిపాయల్లో..

Onion Cutting Tips: ఉల్లి మిమ్మల్ని ఏడ్పిస్తోందా.. ఈ చిట్కాలు పాటిస్తే శాశ్వతంగా చెక్ పెట్టొచ్చు..
Know How To Avoid Tears Whi
Follow us
Sanjay Kasula

|

Updated on: Mar 23, 2022 | 5:53 PM

కూరకు ఉల్లిపాయలు(Onion) ఎంత రుచిగా ఉంటాయో.. వాటిని కట్ చేస్తున్నప్పుడు వచ్చే మంట అంతే సినిమా కనిపిస్తుంది. కళ్ల నుంచి నీళ్లు ధారలు కడుతాయి. ఉల్లికి ఉండే ఘాటు కారణంగా కళ్లు మంటలు పుడుతాయి. ఉల్లిపాయల్లో అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. సల్ఫర్ ప్రాథమిక మూలం ఉల్లిపాయ. అందుకే ఉల్లిపాయలు లేకుండా వంట చేయడాన్ని ఊహించలేము. అయితే ఇతర కూరగాయలేవీ లేకుండా ఉల్లిపాయను తరిగితేనే కళ్లు ఎందుకు మంటలు వస్తాయని ఎప్పుడైనా ఆలోచించారా..? ఉల్లిపాయల్లో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. ఇది కొన్ని ఇతర ఎంజైమ్‌లతో కలిసిపోతుంది.. తరిగినప్పుడు గాలిలో కలుస్తుంది. అదే కంటి దురదకు కారణం. అయితే కళ్ల నుంచి నీళ్లు రాకుండా ఉల్లిపాయలు ఎలా కట్ చేయవచ్చో తెలుసుకోండి..

అద్భుతమైన పరిష్కారం..

ఉల్లి కట్ చేస్తున్నప్పుడు కళ్ల నుంచి నీళ్లు రాకుండా.. ఎలా తరగాలో తెలియక చాలా మంది ఇబ్బందులు పడుతుంటాం. దీని కోసం చిన్న చిన్న చిట్కాలు ఉన్నాయి. ఉల్లిపాయలు కోసేటప్పుడు వీటిని పాటిస్తే చాలు కళ్లలో ఒళ్లు, చికాకులు రాకుండా ఉంటాయి. చాలా మందికి ఈ ట్రిక్ గురించి తెలుసు. కానీ చాలా సులభమైన.. ఉపయోగకరమైన చిట్కాలు ఫాలో అయితే సరి. బబుల్‌గమ్‌ను నోటిలో పెట్టుకుని ఉల్లిపాయను నమిలితే కంటి మంట ఉండదు.

నీటిలోకి..

ఉల్లిపాయలను తరుగుతున్నప్పుడు ముందుగా ఓ గిన్నెలో సరిపడేన్ని నీటిని తీసుకోండి.

ఉల్లిపాయను పొట్టు తీయకుండానే తరగండి.. తరిగిన ఉల్లిపాయలను ఒక గిన్నెలో వేసి తగినంత నీరు పోయాలి.. ఇలా చేస్తే కంటి చికాకు కలిగించకుండా ఉంటుంది. ఆ నీళ్లలో కొంచెం రాతి ఉప్పు వేసినా కన్నీళ్లు రావు.

పదునైన కత్తితో..

ఉల్లిపాయలను తరిగేందుకు చాలా పదునైన కత్తిని ఉపయోగించడం.. ఆ పదునైన కత్తితో వేగంగా తరగడం వల్ల కన్నీళ్లు రాకుండా ఉంటాయి. ఎందుకంటే ఉల్లిపాయలను నెమ్మదిగా తరిగితే అందులోని సల్ఫర్ బయటకు వచ్చి గాలితో కలిసి కళ్లకు మంట వచ్చే ఛాన్స్ ఉంది. వేగంగా కత్తిరించగల పదునైన కత్తి. గాలిలో సల్ఫర్ తక్కువగా కలుస్తుంది. తద్వారా కంటి ఇరిటేషన్ తగ్గుతుంది. ఇలా ఎప్పుడూ పదునైన కత్తిని ఉపయోగించి ఉల్లిపాయను కోయడం మంచిది.

ఫ్రిజ్‌లో..

ఉల్లిపాయను కత్తిరించడానికి 15 నిమిషాల ముందు ఉల్లిపాయలను ఫ్రిజ్‌లోని ఫ్రీజర్‌లో ఉంచండి. తర్వాత దాన్ని తీసుకుని తరిగితే కళ్ల మంట సమస్య ఉండదు.

వెనిగర్ ఉపయోగించి..

ఉల్లిపాయను తరిగే ముందు కొద్దిగా వెనిగర్ తీసుకుని వెజిటబుల్ కోపింగ్ బోర్డ్ మీద రుద్ది ఆపై ఉల్లిపాయను అందులో వేసి తరిగితే.. కళ్ల మంటలు రాకుండా ఉంటుంది. వెనిగర్ కంటి చికాకు కలిగించే ఎంజైమ్‌లను అడ్డుకుంటుంది.

కొవ్వొత్తి, దీపం..

ఉల్లిపాయలు కోసేటప్పుడు పక్కన కొవ్వొత్తి లేదా దీపం వెలిగించి ఉల్లిపాయలను తరుగుతుంటే కళ్ల నుంచి నీళ్లు రావు. కంటిలో కలిగించే ఎంజైమ్‌లు దీపం నుంచి వచ్చే వేడి గాలి ద్వారా గ్రహించబడతాయి.

ఇవి కూడా చదవండి: Egg Storing Hacks: వేసవిలో గుడ్లు తొందరగా పాడవుతున్నాయా..? ఎక్కువ రోజులు ఎలా నిల్వ చేయాలో తెలుసా..

Coconut Water: వేసవికాలంలో కొబ్బరి నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎంటో తెలుసా..