
మన కారణంగా ఎవరికైనా హాని జరిగినా, చనిపోయిన.. విపరీతమైన పెయిన్, గిల్ట్ ఉంటుంది. ఎంతో పెద్ద తప్పు చేశామన్న ఆలోచన మనసులో నుంచి పోదు. ఇబ్బంది పడిన వ్యక్తికి లేదా చనిపోయిన ఆ వ్యక్తి కుటుంబాన్ని కలిసి మనం ఇది కావాలని చేయలేదని.. తెలియక జరిగిన పొరపాటు అని కౌగిలించుకుని ఏడ్చాలి అనిపిస్తుంది. అలానే ఓ వీధికుక్క కూడా ప్రవర్తించింది అంటే మీరు నమ్ముతారా..? ఇది నిజం. కర్నాటకలో ఈ ఘటన వెలుగుచూసింది. తిప్పేశ్ అనే 21 ఏళ్లు యువకుడు.. తన వల్ల చనిపోయిన కారణంగా.. ఆ శునకం ఆ వ్యక్తి ఇంటికి వెళ్లి.. తన ఆవేదనను బయటపెట్టే ప్రయత్నం చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. హొన్నాళి తాలూకా క్యానికెరె గ్రామానికి చెందిన తిప్పేశ్.. తమ ఊరి నుంచి అనవేరి గ్రామానికి వెళుతున్న సమయంలో అతని బైక్‌కు అడ్డుగా వీధి కుక్క వచ్చింది. దాన్ని తప్పించే క్రమంలో.. తిప్పేశ్ కింద పడి గాయపడ్డాడు. ట్రీట్మెంట్ కోసం ఆస్పత్రికి తీసుకెళ్తుండగా.. చనిపోయాడు. అయితే ఊహించని విధంగా తిప్పేశ్ మరణించిన.. 3వ రోజు ఆ జాగిలం అతని ఇంటిని వెతుక్కుంటూ వచ్చింది.
తొలుత వీధి కుక్క అని భావించి దాన్ని తరిమేశారు. ఆ తర్వాత మళ్లీ వచ్చిన ఆ శునకం తిప్పేశ్ తల్లి పక్కన కూర్చుని తీవ్రంగా దుఃఖించిందట. ఆ సమయంలో శునకం విపరీతమైన మూగ బాధను వ్యక్తం చేసిందని మృతుని మేనమామ సందీప్ తెలిపారు. చాలాసేపు అక్కడే ఉండి.. ఇంట్లోని గదులన్నీ కలియతిరిగి వెళ్లిపోయిందట ఆ శునకం. ఈ ఘటన గ్రామంలో ఆసక్తికర చర్చకు తావిచ్చింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..