Marigold Farming: పూల పెంపకంతో లక్షలు సంపాదిస్తున్నాడు.. సాగులో మెళకువలు నేర్పుతున్న ఆదర్శ రైతు..

భారత్‌లో కొన్నేళ్లుగా రైతులు సంప్రదాయ పంటలను పక్కన పెట్టి.. కొత్త పంటల వైపు దృష్టి పెట్టారు. అలాంటి వాటిలో బంతిపూల సాగు ప్రత్యేకమైనది. ఇప్పుడు ఈ పూలకు మంచి డిమాండ్ ఉంది.

Marigold Farming: పూల పెంపకంతో లక్షలు సంపాదిస్తున్నాడు.. సాగులో మెళకువలు నేర్పుతున్న ఆదర్శ రైతు..
Jharkhand Farmer Marigold F

Updated on: Aug 29, 2021 | 2:52 PM

భారత్‌లో కొన్నేళ్లుగా రైతులు సంప్రదాయ పంటలను పక్కన పెట్టి.. కొత్త పంటల వైపు దృష్టి పెట్టారు. అలాంటి వాటిలో బంతిపూల సాగు ప్రత్యేకమైనది. ఇప్పుడు ఈ పూలకు మంచి డిమాండ్ ఉంది. బంతిపూల సాగుకు పెద్దగా కష్టపడాల్సిన పని ఉండదు… పూల దిగుబడి చాలా ఎక్కువ ఉంటుంది. పూల బరువు కూడా ఎక్కువే ఉంటుంది. ఈ పూల సాగుతో ఓ సామన్య రైతు.. ఆదర్శ రైతుగా మారాడు. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లాలోని గోలా బ్లాక్ మొత్తం జార్ఖండ్‌లో వ్యవసాయానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడి నుంచి దేశంలోని అనేక ప్రాంతాలకు కూరగాయలు ఎగుమతి అవుతాయి. సుబోధ్ కుమార్ గోలా  ఆ గ్రామంలో అంతా కూరగాయ సాగు చేస్తుంటారు.. భిన్నంగా పూల సాగుపై ఫోకస్ పెట్టాడు. అదే అతని విజయానికి కారణంగా మారింది.

వ్యవసాయం చేయాలంటే ఓ పద్దతి ప్రకారం చేయాలంటాడు ఈ ఆదర్శ రైతు.  మీరు వ్యవసాయం నుండి బాగా సంపాదించాలనుకుంటే.. మీరు వ్యవసాయాన్నే నమ్ముకోవాలని సలహా కూడా ఇస్తుంటాడు. అప్పుడే మీరు భారీగా లాభాలను.. పెద్ద ఎత్తున డబ్బు సంపాదించగలరు అని అంటాడు ఈ రైతు.  అనేక సంవత్సరాలుగా తన మొత్తం భూమిలో బంతి పువ్వుల సాగు చేస్తున్నాడు.

2012 నుంచి వ్యవసాయం..

సుబోధ్ 2012 నుండి తాను వ్యవసాయం చేస్తున్నానని.. మొదట  తాను కూరగాయలు పండించానని.. ఆ తర్వాత నాలుగు సంవత్సరాల క్రితం బంతి సాగును మొదలు పెట్టినట్లుగా చెప్పాడు. ఇప్పుడు అతను దాదాపు ఐదు ఎకరాల భూమిలో బంతి పువ్వును సాగు చేశాడు. సంవత్సరానికి 365 రోజులు తాను ఇదే బంతి తోటలోనే ఉంటానని అన్నాడు. గ్రామంలోని ఏ రైతు కూడా బంతి పువ్వును సాగు చేయనంత వరకు మాత్రమే తాను బంతి పువ్వును పండిస్తానని చెప్పాడు. గ్రామంలో మరో రైతు బంతి పూల సాగు మొదలు పెడితే తాను పూల సాగును నిలిపివేస్తాని తెలిపాడు. అయితే ఈ హరుబేడ గ్రామంలోని 100 శాతం ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. గ్రామంలోని పొలాల్లో ఏడాది పొడవునా పచ్చదనం ఉంటుంది.

రామ్‌గఢ్, రాంచీ, బొకారో సరఫరా

తన తోటలో నుంచి వచ్చే బంతి పూలను రామ్‌గఢ్, రాంచీ, బొకారో వంటి పెద్ద పట్టణాల సరఫరా చేస్తుంటాడు. ఉత్పత్తి గురించి మాట్లాడుతూ.. బంతి పువ్వులో రెండు రకాలు ఉన్నాయని చెప్పాడు. ఒక హజారా మేరిగోల్డ్..  ఈ  మొక్క 1000 పువ్వులను ఉత్పత్తి చేస్తుందని.. కోల్‌కతా నుండి ఈ మొక్కను తెచ్చి నాటడానికి ఒక్కో మొక్కకు రూ .15 ఖర్చు అయ్యిందన్నాడు. ఈ పూల సాగులో ఆవు పేడను ఉపయోగిస్తానని.. దీంతో ఎరువుల ఖర్చు తగ్గిందన్నాడు.

ఇలా వ్యవసాయం చేయండి..

బంతి పువ్వుల సాగు చేయాలంటే ముందుగా.. మూడు నుండి నాలుగు సార్లు దున్నాలి.. వర్షం పడినప్పుడు ఆ వర్షం నీరు నేరుగా నేల మొదల్లోకి చేరుతుంది. దీని వల్ల అదనంగా DAP, పొటాష్ మొక్కలలోకి వస్తాయి. ఆవు పేడ ఎంత ఎక్కువ పరిమాణంలో ఉపయోగిస్తే పువ్వు అంత మెరిసిపోతుందని అంటున్నాడు ఈ అదర్శ రైతు.

మార్కెట్ లేకపోవడం వల్ల సమస్యలు

కూరగాయల సాగుతో పోలిస్తే.. బంతి పువ్వు పెంపకం చాలా తక్కువ శ్రమతో కూడుకున్నదని తెలిపాడు. ఈ సాగులో నీటి వినియోగం కూడా చాలా తక్కువ అని అన్నాడు. కానీ రైతులందరూ దీన్ని చేయలేరు ఎందుకంటే స్థానిక స్థాయిలో దీనికి మార్కెట్ లేదు. ఈ కారణంగా వారు దానిని విక్రయించడం కష్టంగా ఉంటుంది. అయినప్పటికీ తాను ఏటా లక్ష రూపాయలకు పైగా సంపాదిస్తున్నట్లుగా ఆదర్శ రైతు తెలిపాడు.

ఇవి కూడా చదవండి: Uttarakhand landslide: ఉత్తరాఖండ్‌‌ను ముంచెత్తుతున్న వరదలు.. కొనసాగుతున్న ప్రకృతి బీభత్సం..రంగంలోకి NDRF బృందాలు..

TV9 Exclusive: ఆఫ్గన్‌ రణక్షేత్రంలో టీవీ9 మరో సాహసం.. తాలిబన్‌ అధికార ప్రతినిధి సుహైల్‌ షాహీన్‌ ఎక్స్‌క్లూజీవ్‌ ఇంటర్వ్యూ..