JEE Main 2021 : జేఈఈ మెయిన్ 2021 కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు ఇవి తప్పని సరిగా తీసుకెళ్ళాలిసి ఉంటుంది..

జాతీయస్థాయిలో ఇంజినీరింగ్, వైద్య విద్య ప్రవేశాల కోసం ఉద్దేశించిన JEE (మెయిన్), నీట్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని కేంద్ర వర్గాలు వెల్లడించాయి...

JEE Main 2021 : జేఈఈ మెయిన్ 2021 కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు ఇవి తప్పని సరిగా తీసుకెళ్ళాలిసి ఉంటుంది..
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Feb 11, 2021 | 6:19 AM

జాతీయస్థాయిలో ఇంజినీరింగ్, వైద్య విద్య ప్రవేశాల కోసం ఉద్దేశించిన JEE (మెయిన్), నీట్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని కేంద్ర వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రవేశ పరీక్షలను వాయిదా వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో జేఈఈ, నీట్ లను వాయిదా వేయాలని కోరుతూ విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలో కేంద్రం తన వైఖరి వెల్లడించింది.   జేఈఈ మెయిన్-2021‌ పరీక్షల షెడ్యూల్‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసింది. ఈద‌ఫా నాలుగు సార్లు ఈ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. గతంలో రెండు సార్లు మాత్రమే నిర్వహించే ఈ పరీక్షను ఈసారి నాలుగు విడతల్లో నిర్వహించాలని నిర్ణయించారు. కాగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సమాచార ప్రకారం జేఈఈ మెయిన్ 2021 అడ్మిట్ కార్డును ఫిబ్రవరి రెండవ వారంలో కేంద్రం జారీ చేయనుంది. ఎన్‌టిఎ అడ్మిట్ కార్డును ఆన్‌లైన్‌( jeemain.nta.nic.in) లో మాత్రమే విడుదల చేస్తారు.

అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవడానికి అభ్యర్థులకు అప్లికేషన్ నెంబర్  పాస్‌వర్డ్ లేదా డేట్ ఆఫ్ బర్త్ తప్పనిసరిగా ఉండాలి. పరీక్ష సమయంలో అభ్యర్థులు తీసుకెళ్లవలసిన అతి ముఖ్యమైన డాక్యుమెంట్ లో అడ్మిట్ కార్డు ఒకటి. జేఈఈ మెయిన్ 2021 యొక్క పరీక్షా కేంద్రంలో ప్రవేశం పొందడానికి అడ్మిట్ కార్డు తప్పనిసరి. అడ్మిట్ కార్డు ద్వారా, ఎన్‌టిఎ అభ్యర్థులకు ఎక్సామ్ డేట్, టైం అలానే ఎక్సామ్ సెంటర్ కేటాయిస్తారు. అడ్మిట్ కార్డు ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే పరీక్షలకు విడిగా విడుదల చేస్తారు. ఒక సెషన్ కు వదిన అడ్మిట్ కార్డు ఇతర సెషన్లకు చెల్లదు. ఇక జెఈఈ మెయిన్ 2021  ఫిబ్రవరి 23 నుండి 26 వరకు రోజుకు 2 షిఫ్టులలో జరుగుతుంది.మొదటి షిఫ్ట్  ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 వరకు మరియు సెకండ్ షిఫ్ట్ మధ్యాహ్నం 3 నుండి 6 వరకు జరుగుతుంది.

అదే విధంగా ఎక్సామ్ సమయంలో అభ్యర్థులు అడ్మిట్ కార్డును ప్రింటెడ్ ఫార్మాట్‌లో తీసుకెళ్లాలి అలాగే  ఒక పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, ఒక ఐడి ప్రూఫ్, పిడబ్ల్యుడి సర్టిఫికేట్ ( అవసరం అయితే ),నార్మల్ బాల్ పెన్, శానిటైజర్ బాటిల్, ఒక వాటర్ బాటిల్ తీసుకువెళ్లాలి. ఇక మే తర్వాత లేదా జూన్‌ చివరి వారంలో జేఈఈ అడ్వాన్స్‌ పరీక్ష నిర్వహించాలని అధికారులు యోచిస్తున్నారు.

3.2 ఓవర్లలో 7 వికెట్లు, 3 మెయిడీన్లు.. టీ20 చరిత్రలోనే బెస్ట్
3.2 ఓవర్లలో 7 వికెట్లు, 3 మెయిడీన్లు.. టీ20 చరిత్రలోనే బెస్ట్
ఎన్నికల వేళ సరికొత్త ప్రచారం.. మాటలు కాదు.. చేతలే వీరి ఆస్త్రాలు
ఎన్నికల వేళ సరికొత్త ప్రచారం.. మాటలు కాదు.. చేతలే వీరి ఆస్త్రాలు
నూడుల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్.. మహిళ లోదుస్తుల్లో బంగారం !!
నూడుల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్.. మహిళ లోదుస్తుల్లో బంగారం !!
ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు ??
ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు ??
రైల్వే స్టేషన్‌లో రూ.20లకే నాణ్యమైన భోజనం !!
రైల్వే స్టేషన్‌లో రూ.20లకే నాణ్యమైన భోజనం !!
హాట్‌ కేకుల్లా అమ్ముడైన శ్రీవారి దర్శనం టికెట్లు
హాట్‌ కేకుల్లా అమ్ముడైన శ్రీవారి దర్శనం టికెట్లు
వేసవిలో పగిలిన పెదవులతో ఇబ్బందా..? ఎఫెక్టివ్ హోం రెమెడీస్..
వేసవిలో పగిలిన పెదవులతో ఇబ్బందా..? ఎఫెక్టివ్ హోం రెమెడీస్..
అప్పుడు సచిన్ కాంగ్రెస్ ఆఫర్‌కి ఓకే చెప్పి ఉంటే ఏం జరిగి ఉండేది ?
అప్పుడు సచిన్ కాంగ్రెస్ ఆఫర్‌కి ఓకే చెప్పి ఉంటే ఏం జరిగి ఉండేది ?
జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి
జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి
ఎన్నికల వేళ సామాజివర్గం అంశాన్ని తెరపైకి తెచ్చిన రేణుకా చౌదరి..
ఎన్నికల వేళ సామాజివర్గం అంశాన్ని తెరపైకి తెచ్చిన రేణుకా చౌదరి..