Penguin Ducks: ఈ బాతు పెంగ్విన్‌లా కదులుతుంది.. ఏడాదికి 350 గుడ్లు.. భారతీయ రన్నర్ బాతు విశేషాలు తెలుసుకోండి

|

May 24, 2022 | 12:23 PM

Indian Runner Duck: ఈ భారతీయ రన్నర్ బాతుల్లో అనేక ఉపజాతులున్నాయి. సంవత్సరానికి 150 నుండి 360 గుడ్లను పెడుతుంది. గుడ్లు ఎక్కువగా తెల్లగా ఉంటాయి. కొన్ని సార్లు నీలం, ఆకుపచ్చ రంగుల్లో ఉండే గుడ్లు అందంగా అలరిస్తాయి.

Penguin Ducks: ఈ బాతు పెంగ్విన్‌లా కదులుతుంది.. ఏడాదికి 350 గుడ్లు.. భారతీయ రన్నర్ బాతు విశేషాలు తెలుసుకోండి
Indian Runner Duck
Follow us on

Indian Runner Duck: ఈ ప్రపంచంలో అనేక రకాల జంతువులు, పక్షులు జీవిస్తున్నాయి. కొన్ని సాధారణంగా కనిపిస్తే.. మరికొన్ని చాలా ‘ విచిత్రంగా ‘ ఉంటాయి. అనేక రకాల పక్షుల్లో ఒకటి బాతు. ఇది మనిషి పెంపుడు పక్షి. పంచమంతటా కనిపించే ఈ అందమైన పక్షి తన జీవితంలో ఎక్కువ భాగం నీటిలోనే గడుపుతుంది. అయితే ఈరోజు మనం రెగ్యులర్ బాతులకు భిన్నంగా ఉండే భారతీయ రన్నర్ బాతు గురించి తెలుసుకుందాం.. ఇది పెంగ్విన్ లాగా నడుస్తాది కనుక దీన్ని పెంగ్విన్‌ బాతు అని కూడా అంటారు. ఈ ‘ పెంగ్విన్ డక్స్ ‘  సాధారణ బాతు శరీరం ముందుకు వంగి ఉన్నట్లు కాకుండా పెంగ్విన్ లాగా వీపును నిటారుగా ఉంచుతాయి. అంతేకాదు సాధారణ బాతుల కంటే ఈ బాతు వేగంగా పరుగెడుతుంది కనుక దీనిని ‘ఇండియన్ రన్నర్ డక్’ అని కూడా అంటారు. ఈ బాతులను ఇండోనేషియా, థాయ్‌లాండ్ వంటి దేశాలలోని ప్రజలు తమ వరి పొలాల్లో పెంచుతారు. పొలాల్లో ఉండే కీటకాలను ఈ బాతులు తింటాయి.

ఈ ప్రత్యేకమైన బాతు మొదటిసారి 1800 లలో కనిపించింది. యూరోపియన్లు ఇండోనేషియాలో చూశారు. అప్పుడు నిటారుగా నిలబడి పెంగ్విన్ మాదిరి నడుస్తున్న ఈ బాతు ‘నడక’ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఈ ప్రత్యేకమైన బాతు ప్రతి ఖండంలో కనిపిస్తుంది.

పూర్వీకులు పెంగ్విన్ బాతుల మాంసం రుచికరమైనదని ఇష్టంగా తినేవారని తెలుస్తోంది. ఇక బాతు గురించి ప్రస్తావన చార్లెస్ డార్విన్   రచనలలో కనిపిస్తాయి. పక్షి గుడ్లు చాలా అందంగా ఉంటాయి. అంతేకాదు మంచి రుచికరంగా కూడా ఉంటాయి. అంతరించిపోయాయి అనుకున్న ఈ బాతులు మళ్ళీ 20 వ శతాబ్దం ప్రారంభంలో, 1926 లో యూరోపియన్ దేశాల భూభాగంలో కనిపించాయి. అయితే, ఆ సమయంలో ఈ బాతులను జంతుప్రదర్శనశాలలలో ఉంచారు. ఇవి ఇతర జాతుల పక్షులతో కలవవు.

ఇవి కూడా చదవండి

ఈ భారతీయ రన్నర్ బాతుల్లో అనేక ఉపజాతులున్నాయి. సంవత్సరానికి 150 నుండి 360 గుడ్లను పెడుతుంది. గుడ్లు ఎక్కువగా తెల్లగా ఉంటాయి. కొన్ని సార్లు నీలం, ఆకుపచ్చ రంగుల్లో ఉండే గుడ్లు అందంగా అలరిస్తాయి.

మరిన్నిహ్యుమన్‌ ఇంట్రెస్ట్‌   వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..