దుస్తులపై మరకలు పడితే టన్షన్ పడకండి.. ఇలా నిమిషాల్లో క్లీన్ చేయండి..!
టీ, కాఫీ మరకలతో బాధపడుతున్నారా..? దుస్తులపై మరకలు పడితే తొలగించడం కష్టంగా అనిపించవచ్చు. కానీ ఇంట్లో ఉండే ఉప్పు, వాషింగ్ లిక్విడ్ వంటి సాధారణ పదార్థాలతో ఈ సమస్యను సులభంగా పరిష్కరించవచ్చు. ఇప్పుడు చెప్పబోయే చిట్కాతో మీ బట్టలు మళ్లీ కొత్తవాటిలా మెరుస్తాయి.

ప్రతి రోజూ ఉదయం ఒక కప్పు టీ లేదా కాఫీ తాగడం చాలా మందికి అలవాటు. అయితే కొన్నిసార్లు ఆ డ్రింక్ పొరపాటున దుస్తులపై పడితే ఆ మరక చాలా చిరాకు తెప్పిస్తుంది. ముఖ్యంగా తెల్ల దుస్తులపై అయితే మరక మరింత స్పష్టంగా కనిపించి దాన్ని తొలగించేందుకు చాలా మంది కష్టపడతారు. ఈ సమస్యను సులభంగా పరిష్కరించేందుకు ఇంట్లోనే చేయదగిన ఒక చిన్న చిట్కా ఉంది.
మామూలుగా శుభ్రపరచడం
ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే.. టీ లేదా కాఫీ మరక పడ్డ దుస్తుల భాగాన్ని తీసుకుని దానిపై నేరుగా కొద్దిగా వాషింగ్ లిక్విడ్ వేసుకోవాలి. ఇది మరకపైకి బాగా పరచినట్లుగా ఉండాలి. వాషింగ్ లిక్విడ్ ను రుద్దకండి.. అది కాస్త తడిగా ఉండేలా వదిలేయండి. దాదాపు 10 నిమిషాలు అలాగే ఉంచండి. అప్పుడు ద్రావణం మరకను బాగా మెత్తగా చేస్తుంది.
ఉప్పునీటిలో నానబెట్టడం
ఆ తర్వాత ఒక బకెట్ తీసుకొని అందులో ఒక లీటరు నీటికి సుమారు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కలపండి. ఈ ఉప్పునీటిలో ఆ దుస్తులను పెట్టి కనీసం 20 నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఉప్పు మంచి సహజ క్రిమిసంహారకంగా పని చేయడంతో పాటు.. మరకను కరిగించి బయటకు తెస్తుంది.
మామూలు వాషింగ్
ఉప్పునీటిలో నానబెట్టిన తర్వాత మీ బట్టలను మామూలుగా మిగతా బట్టల మాదిరిగా డిటర్జెంట్ తో శుభ్రం చేయాలి. అవసరమైతే మరకలున్న చోట కాస్త ఎక్కువ శుభ్రపరిచే ద్రావణం రాసి చేతితో రుద్దవచ్చు. తర్వాత కడిగి ఆరబెట్టండి.
మెరుస్తున్న దుస్తులు
ఈ మొత్తం ప్రక్రియను పాటించిన తర్వాత మీరు మరక మాయమైపోవడం గమనిస్తారు. అంతేకాదు దుస్తులు అసలు మరక పడలేదన్నట్లుగా కనిపిస్తాయి. ఇది ముఖ్యంగా టీ, కాఫీ వంటి డ్రింక్ వల్ల ఏర్పడే జిడ్డు మరకలకు చాలా బాగా పని చేస్తుంది.
అదనపు చిట్కాలు
- మీరు మరక పడిన వెంటనే ఇది చేయగలిగితే ఫలితం ఇంకా మెరుగ్గా ఉంటుంది.
- తెల్ల దుస్తులకైతే కాస్త నిమ్మరసం కూడా కలిపితే మరింత శుభ్రత పొందవచ్చు.
- ప్రతి వారం ఈ విధానాన్ని ప్రయత్నించడం వల్ల మీ బట్టలు కొత్తగానే ఉంటాయి.
ఈ ఇంటి చిట్కాతో మీరు చిన్న చిన్న మరకలను సులభంగా తొలగించవచ్చు. ఖరీదైన కెమికల్స్ లేకుండా సహజమైన సురక్షితమైన విధంగా బట్టలను కాపాడుకోండి. ఇకపై టీ కాఫీ పడిందంటే భయపడాల్సిన అవసరం లేదు.




