Christmas: క్రిస్మస్ వేళ రుచికరమైన కేక్.. సులభంగా మీ వంటింట్లోనే తయారుచేసుకోండిలా..
క్రిస్మస్ అంటే వేడుకలకే కాదు రుచికరమైన కేక్స్ కూడా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. కరోనా వేళ బయటకు వెళ్ళి కేక్ తెచ్చుకోవడం కంటే మీ
క్రిస్మస్ అంటే వేడుకలకే కాదు రుచికరమైన కేక్స్ కూడా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. కరోనా వేళ బయటకు వెళ్ళి కేక్ తెచ్చుకోవడం కంటే మీ ఇంట్లో ఉండే పదార్థాలతో సులభంగా ప్లమ్ కేక్‌ను రెడి చేసుకోండి ఇలా..
కేక్ తయారు కోసం కావల్సిన పదార్థాలు.. 1.5 కప్పు మైదా 1 కప్పు యోగర్ట్ 1 టీ స్పూన్ వనిల్లా ఎక్స్ట్రాక్ట్ 1/2 టీ స్పూన్ డాల్చిన చెక్క పొడి 1/8 టీ స్పూన్ లవంగాల పొడి 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ 3/4 కప్ బ్రౌన్ షుగర్ 1/2 కప్ వెజిటబుల్ ఆయిల్ 1 టీ స్పూన్ ఆరెంజ్ జెస్ట్ 1/2 టీ స్పూన్ అల్లం
ఫోల్డింగ్ కోసం.. 1/4 కప్పు వాల్నట్స్, బాదం పప్పు, జీడి పప్పు
సోకింగ్ కోసం 1/3 కప్ నీరు 1/3 కప్ ఆరెంజ్ జ్యూస్ 1/4 కప్ డ్రైడ్ యాప్రికాట్స్ 1 టేబుల్ స్పూన్ నిమ్మ రసం 1 కప్ టూటీ ఫ్రూటీ 1/4 కప్ రైజిన్స్ 1/8 కప్ ప్రూన్స్ 1/8 కప్ డ్రైడ్ క్రాంబెర్రీస్
తయారు చేసుకునే విధానం.. ముందుగా అడుగు మందంగా ఉన్న సాస్ పాన్ని మీడియం హీట్ మీద ఉంచి అందులో కొంచెం ఆరెంజ్ జ్యూస్, నిమ్మరసం, నీరు పోయాలి. ఆ తర్వాత అందులోనే టూటీ ఫ్రూటీ, రైజిన్స్, డ్రైడ్ యాప్రికాట్స్, ఫ్రూన్స్, క్రాంబెర్రీస్ కలపాలి. తర్వాత డ్రైఫ్రూట్స్ ఈ జ్యూసులని తీసుకొని సిరప్ కాస్తా చిక్కబడే వరకు మంట మీద ఉంచాలి. తర్వాత దానిని మెల్లగా తీసి పక్కన పెట్టి చల్లారనివ్వండి. ఇందులో నుంచే కాసిన్ని డ్రైఫ్రూట్స్ తీసి పక్కన పెట్టండి. అటు ఓవెన్ 160 డిగ్రీ సెల్సియస్ వద్ద ప్రీ హీట్ చేయాలి. గుండ్రంగా ఉండే కేక్ పాన్ తీసుకొని దాని లోపల కొంచెం బటర్ పూయాలి లేదా పార్చ్మెంట్ పేపర్ ఉంచాలి. ఒక గ్లాస్ బౌల్లో డ్రై ఇన్‌గ్రీడియెంట్స్ వేసి కొంత ఆరెంజ్ జెస్ట్ కూడా కలిపి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకొవాలి. తర్వాత అటు వేరే బౌల్లో బ్రౌన్ షుగర్, నూనే వేసి మిశ్రమం చిక్కబడేవరకూ మిక్స్ చేస్తూ ఉండాలి. అందులోనే యోగర్ట్ కూడా కలిపి మళ్ళీ బాగా మిక్స్ చేసి పక్కన పెట్టాలి. చివరికి వెనిలా ఎక్స్ట్రాక్ట్ కూడా వేసి అన్నింటీని డ్రై ఇన్గ్రీడియెంట్స్తోపాటు కలపాలి. అన్ని పూర్తిగా కలిసేంతవరకు ఫోల్డ్ చేసి పెట్టాలి. ఆ తర్వాత సోక్ట్ డ్రై ఫ్రూట్స్, సన్నగా తరిగిన వాల్నట్స్, బాదం పప్పు, జీడిపప్పు కలిపి మళ్ళీ ఒకసారి ఫోల్డ్ చేయాలి. చివరిగా ఈ మొత్తం మిశ్రమాన్ని కేక్ పాన్‌లోకి తీసుకోని 160 డిగ్రీ సెల్సియస్ వద్ద దాదాపు 50 నుంచి 55 నిమిషాల పాటు బేక్ చేయాలి. తర్వాత పక్కన పెట్టుకున్న డ్రైఫ్రూట్స్‌తో కేక్‌ను అందంగా అలంకరించి సర్వ్ చేయండి. అంతే ఎంతో రుచికరమైన ప్లమ్ కేక్ సులభంగా మీ ఇంట్లోనే రెడి అయిపోతుంది.