టెలిగ్రామ్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్.. ఇకనుంచి ఆ ఫీచర్స్ కావాలంటే మనీ కట్టాల్సిందే..

ప్రముఖ మేసెజింగ్ సంస్థ టెలిగ్రామ్ వినియోగం భారత్‏లో క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఇప్పటివరకు టెలిగ్రామ్ సేవలను ఫ్రీగానే పొందుతున్నారు యూజర్లు.

  • Rajitha Chanti
  • Publish Date - 8:15 pm, Thu, 24 December 20
టెలిగ్రామ్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్.. ఇకనుంచి ఆ ఫీచర్స్ కావాలంటే మనీ కట్టాల్సిందే..

ప్రముఖ మేసెజింగ్ సంస్థ టెలిగ్రామ్ వినియోగం భారత్‏లో క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఇప్పటివరకు టెలిగ్రామ్ సేవలను ఫ్రీగానే పొందుతున్నారు యూజర్లు. అయితే టెలిగ్రామ్ సంస్థ సీఈవో పావెల్ దురోవ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. వచ్చే ఏడాది నుంచి టెలిగ్రామ్‏లో రాబోయే కొన్ని ఫీచర్స్ వాడుకోవాలంటే డబ్బులు కట్టాల్సిందేనని తెలిపారు.

ఈ సందర్బంగా పావెల్ దురోవ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం మార్కెట్లో ఎదుర్కోంటున్న పరిస్థితుల కారణంగా సంస్థ పనులను నిర్వహించడానికి కాస్తా నగదు అవసరమని తెలిపారు. 2013లో టెలిగ్రామ్‏ను ప్రారంభించగా ఇప్పటివరకు 500 మిలియన్ల యాక్టీవ్ యూజర్లను కలిగి ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో కంపెనీని అమ్మే ఆలోచన లేదని, దానికి కావాల్సిన డబ్బుల కోసం ఇతర మార్గాలను కనుగొనాల్సిన అవసరం ఉందని తెలిపారు. కాగా టెలిగ్రామ్ ప్రైవేట్ కమ్యూనికేషన్స్, సమాచారం, వార్తలను పంపించుకోవడాని ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు కంపెనీని నిర్వహించడానికి నా సొంత నగదును చెల్లించాను. ప్రస్తుతం అందిస్తున్న సేవలను అలాగే కొనసాగించనున్నట్లు దురోవ్ తెలిపారు. కానీ కొత్తగా వచ్చే ఫీచర్లను వాడుకోవాలంటే ప్రీమియం యూజర్లు డబ్బు చెల్లించాలని దురోవ్ తెలిపారు.