Chandrayaan-2 : చంద్రయాన్‌ 2పై ఆసక్తికర సంగతులు..భవిష్యత్‌ ప్రణాళికను రిలీజ్‌ చేసిన ఇస్రో..

చంద్రయాన్‌ 2 సేకరించిన డేటాను తాజాగా రిలీజ్‌ చేసింది ఇస్రో. ఆర్బిటార్‌ సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతుందన్న ఇస్రో.. అది పంపిన వివరాల్ని వెల్లడించింది. ఆర్బిటార్‌ అద్భుతమైన సామర్థంతో పనిచేస్తోందని స్పష్టం చేసింది ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌..

Chandrayaan-2 : చంద్రయాన్‌ 2పై ఆసక్తికర సంగతులు..భవిష్యత్‌ ప్రణాళికను రిలీజ్‌ చేసిన ఇస్రో..
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 24, 2020 | 9:16 PM

Chandrayaan-2 Good Performance : చంద్రయాన్‌ 2 ప్రయోగం చేపట్టి ఏడాది దాటుతోంది. చంద్రుడిపై పరిశోధనల కోసం ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన ప్రయోగమిది. శాస్త్రవేత్తల కృషి.. ప్రభుత్వ సంకల్పం వెరసి చంద్రయాన్‌ 2 ప్రయోగం పట్టాలెక్కింది.

కానీ చివరి మెట్టుపై ప్రయోగం బోల్తా కొట్టడం ఇస్రోను నిరాశానిస్పృహల్లోకి నెట్టింది. చంద్రుడిపై దిగడానికి కొద్ది సెకన్ల ముందు చంద్రయాన్‌ 2లోని ల్యాండర్‌ క్రాష్‌ కావడంతో ఆశలు ఆవిరయ్యాయి. ల్యాండర్‌ క్రాష్‌ అయింది కానీ.. చంద్రయాన్‌ 2లోని ఆర్బిటార్‌ మాత్రం బాగా పనిచేస్తుంది. చంద్రుడి కక్షలో ఇప్పటికీ ఆర్బిటార్‌ పరిభ్రమిస్తోంది.

తాజాగా ఆ ఆర్బిటార్‌ అంతరిక్ష సమాచారాన్ని ఇస్రోకు పంపింది. 2019 సెప్టెంబర్‌ నుంచి 2020 ఫిబ్రవరి వరకు సేకరించిన సమాచారం ఇస్రో చేతికందింది. ఈ సమాచారాన్ని పూర్తిస్థాయిలో విశ్లేషించిన ఇస్రో.. గ్లోబలీ ఫాలోడ్‌ ప్లానెటరీ డాటా సిస్టమ్‌ PDS4 ఫార్మాట్‌లో ప్రజానీకానికి అందుబాటులో ఉంచింది. గ్లోబల్‌ సైంటిఫిక్‌ కమ్యూనిటీతో ఈ సమాచారాన్ని పంచుకొనేందుకు సిద్ధమని ప్రకటించింది ఇస్రో.

చంద్రయాన్‌ 2లోని ల్యాండర్‌ క్రాష్‌ అయినప్పటికీ ఆర్బిటార్‌తో మాత్రం ఇస్రోకు సంబంధాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడా ఆర్బిటారే చంద్రుడికి సంబంధించిన కీలక సమాచారాన్ని పంపుతోంది. గతంలోనూ చంద్రుడి ఉపరితలాన్ని ఫొటోలు తీసి పంపింది ఈ ఆర్బిటార్‌.

సదరు మ్యాప్‌ల ఆధారంగా చంద్రుడిపై ముఖ్యమైన ప్రాంతాలను గుర్తించారు. భవిష్యత్‌లో అక్కడికి రోబోట్లు లేదా మనుషులను పంపేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందించేందుకు ఆర్బిటార్‌ సమాచారం దోహదపడే చాన్సుంది..