Poultry Farming Tips: వర్షాకాలంలో కోళ్లు, బాతులను వెంటాడుతున్న వ్యాధులు..! ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

|

Jul 10, 2024 | 9:30 PM

నీటిని మరిగించి చలార్చి ఇచ్చినా కూ డా మంచిది. వాటి ఆహారం విషయంలో ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండండి. అవసరమైతే పశువైద్యుడిని సంప్రదించండి. ముఖ్యంగా బాతులు, కోళ్లను వ్యాపారం కోసం పెంచుకునే వారు ఈ చిన్నచిన్న అంశాలను విస్మరిస్తే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది.

Poultry Farming Tips: వర్షాకాలంలో కోళ్లు, బాతులను వెంటాడుతున్న వ్యాధులు..! ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
Poultry Farming
Follow us on

వర్షాకాలం ఇప్పుడే మొదలైంది. ఈ సీజన్‌లో బాతులు, కోళ్లతో సహా పక్షులకు అనేక వ్యాధులు పెరుగుతున్నాయి. అందుకే ఈ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ ప్రత్యేకించి ఎక్కువ సంఖ్యలో బాతులు, కోళ్లు లేదా పక్షులను పెంచుకునే వారు జాగ్రత్తగా ఉండాలంటున్నారు పశువైద్యులు. ఈ సమయంలో బాతులు, కోళ్లకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్‌ ఎక్కువగా వ్యాపించే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. బాతులు, కోళ్లను వ్యాధుల బారి నుంచి రక్షించేందుకు ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అవి వర్షం నీటిలో ఎక్కువగా తడవకుండా చూసుకోవాలి.

తొలకడి వర్షం మనుషులకు సుఖంగా ఉంటుంది. కానీ బాతులు, కోళ్లకు కాదు. అందుకే బాతులు, కోళ్లను వర్షంలో తడవకుండా చూసుకోవాలి. చాలా ఎక్కువ సంఖ్యలో బాతులు, కోళ్లను ఒకే చోట ఉంచవద్దు. బాతులు, కోళ్లకు ఆహారం ఇవ్వడానికి మంచినీరు అంటే శుద్ధి చేసిన నీరు ఇవ్వాలి. నీటిని మరిగించి చలార్చి ఇచ్చినా కూ డా మంచిది. వాటి ఆహారం విషయంలో ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండండి. అవసరమైతే పశువైద్యుడిని సంప్రదించండి. ముఖ్యంగా బాతులు, కోళ్లను వ్యాపారం కోసం పెంచుకునే వారు ఈ చిన్నచిన్న అంశాలను విస్మరిస్తే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది.

వర్షాకాలంలో చల్లటి వాతావరణం ఏర్పడినప్పుడు కోళ్లు, బాతులు వంటివి తమ ఆహారపు అలవాట్లను మార్చుకుంటాయి. ఎందుకంటే, వాటి శారీరక కార్యకలాపాలు కూడా తక్కువగా ఉంటాయి. అవి తమను తాము వెచ్చగా ఉంచుకోవడానికి తమ శరీరంలో వేడిని ఉత్పత్తి చేయడానికి కలిసి ఉంటాయి. అలాంటప్పుడు కోళ్లకు అధిక శక్తి కలిగిన ఆహారం అందించడం చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు. వర్షాకాలంలో తడి నేల కారణంగా కోళ్ల పాదాలలో తరచూ ఇన్ఫెక్షన్‌ వచ్చే అవకాశం ఉంటుంది. పరిష్కారంగా, పౌల్ట్రీ ఫ్లోర్‌ను ఎప్పటికప్పుడు శుభ్రంగా, పొడిగా ఉండేలా చూసుకోవాలి. వాటి పడక, ఆహారంపై ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా చేస్తే వర్షాకాలంలో వ్యాధుల వ్యాప్తి తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..