Check Wheat Flour: మీరు తినే గోధుమ పిండి అసలైనదేనా? నకిలీనా? ఇలా చెక్ చేసుకోండి..
How To Check Wheat Flour: కాదేదీ కల్తీకనర్హం అన్నట్లుగా.. కేటుగాళ్లు ప్రతీది కల్తీ చేసేస్తున్నారు. పిల్లలు తాగే పాలు మొదలు ప్రతీది కల్తీమయం చేస్తేస్తున్నారు. ఇలాంటి కల్తీ పదార్థాల వల్ల ప్రజల ఆరోగ్యాలు క్షీణించి..
కాదేదీ కల్తీకనర్హం అన్నట్లుగా.. కేటుగాళ్లు ప్రతీది కల్తీ చేసేస్తున్నారు. పిల్లలు తాగే పాలు మొదలు ప్రతీది కల్తీమయం చేస్తేస్తున్నారు. ఇలాంటి కల్తీ పదార్థాల వల్ల ప్రజల ఆరోగ్యాలు క్షీణించి.. అనారోగ్యం బారిన పడుతున్నారు. ఫలితంగా ఆస్పత్రుల్లో వేలకొద్ది డబ్బులు వదులుకోవాల్సి వస్తుంది. కల్తీకి గురయ్యే పదార్థాలలో గోధుమ పిండి కూడా ఒకటి. చాలా మంది ఆరోగ్యం కోసం.. ఒక పూట అన్నం తినడం మానేసి.. గోధుమ పిండితో చేసిన చపాతీలను తింటుంటారు. అయితే, దీన్ని కూడా కల్తీ చేస్తున్నారు కేటుగాల్లు. అది గుర్తించలేక ప్రజలు చాలా మంది అలాగే తినేస్తున్నారు. అనారోగ్యాన్ని కొనితెచ్చుకుంటున్నారు. మరి ఈ గోధుమ పిండిలో కల్తీని ఎలా గుర్తించాలి? మీరు తినే గోధుమ పిండి నిజమైనదేనా? అందులో ఏమైనా కల్తీ జరిగిందా? ఎలా తెలుసుకునేది? అంటే ఇందుకు కూడా కొన్ని మార్గాలు ఉన్నాయి. అసలైన గోధుమ పిండి, నకిలీ గోధుమ పిండికి మధ్య తేడాని కనిపెట్టడం ఎలాగో ఇవాళ మనం తెలుసుకుందాం..
గోధుమ పిండి కల్తీని ఇలా గుర్తించండి..
⇒ నీటిలో కూడా గోధుమ పిండి కల్తీని కనిపెట్టేయొచ్చు. ఇందుకోసం ముందుగా ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి. అందులో అర చెంచా పిండిని వేయాలి. ఆ తరువాత దానిని బాగా కలపాలి. 10 సెకన్ల పాటు వేచి ఉండాలి. కాసేపు ఆ పిండిని బాగా గమనించాలి. పిండి నీటిలో తేలుతూ కనిపిస్తే.. ఆ పిండి కల్తీ చేసిందని అర్థం చేసుకోవచ్చు. పిండి అడుగున చేరి ఉంటే.. అది స్వచ్ఛమైనదని అర్థం చేసుకోవచ్చు.
⇒ చపాతీని తయారు చేసేటప్పుడు కూడా గోధుమ పిండి స్వచ్ఛతను చెక్ చేయొచ్చు. సాధారణంగా గోధుమ పిండిని కలపడానికి తక్కువ నీరు అవసరం పడుతుంది. అలాగే అది చాలా మెత్తగా ఉంటుంది. స్వచ్ఛమైన పండితో చేసిన రోటీలు ఈజీగా సాగుతాయి. ఇలాంటి లక్షణాలున్న పిండిని స్వచ్ఛమైనదిగా భావించొచ్చు. అదే కల్తీ పిండి అయితే దానిని కలిపేటప్పుడు ఎక్కువ నీరు అవసరం పడుతుంది. పిండి గట్టిగా ఉంటుంది. రోటీలు కూడా చాలా చిన్నవిగా వస్తాయి.
మరిన్ని హ్యూమన్‌ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..