పిల్లలను ఒత్తిడి లేకుండా పెంచడం ఎలా అని ఆలోచిస్తున్నారా..? అయితే ఇది మీకోసమే..!
ప్రస్తుత బిజీ లైఫ్, టెక్నాలజీ, చదువుల ఒత్తిడి పిల్లలకూ భారంగా మారుతోంది. చిన్న వయసు లోనే వారు టెన్షన్ కు గురవుతున్నారు. ఇలాంటి సమయంలో తల్లిదండ్రులు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విషయం పై పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

బిజీ లైఫ్, టెక్నాలజీ, చదువుల ఒత్తిడి ఇవన్నీ పెద్దలకే కాదు, చిన్నపిల్లలకూ టెన్షన్ పెంచుతున్నాయి. పిల్లలు ఒత్తిడికి గురైనప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలి..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
వారి మాట వినండి
మీ పిల్లలు చెప్పేది శ్రద్ధగా వినండి. మీరు వారికి అండగా ఉన్నారని నమ్మకం కలిగించండి. అలా చేస్తే.. వారు భయం లేకుండా తమ మనసులో ఉన్న విషయాలను మీతో పంచుకుంటారు.
పోలికలు వద్దు
చాలా మంది పిల్లలను పక్క పిల్లలతో పోలుస్తారు. వాళ్ళు అలా చదువుతున్నారు. నువ్వు ఇలా ఉన్నావ్ అని అంటారు. ఇలా పోల్చడం వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. ప్రతి ఒక్కరికీ ఒక ప్రత్యేకమైన ప్రతిభ ఉంటుంది. దాన్ని గుర్తించి ప్రోత్సహించండి.
భావాలను పంచుకోవడం నేర్పండి
మనసులో ఉన్న బాధలు బయటపెట్టకపోతే ఒత్తిడి పెరుగుతుంది. పిల్లలకు రాయడం, బొమ్మలు వేయడం లేదా మీతో పంచుకోవడం అలవాటు చేయండి. దీని వల్ల వారి మనసు తేలిక అవుతుంది.
చదువు, ఆట
పిల్లల రోజు మొత్తం చదువుతోనే నిండిపోకూడదు. చదువుతో పాటు.. ఆడుకోవడానికి వారికి ఇష్టమైన పనులకు కూడా సమయం ఇవ్వండి. ఇలా సమతుల్యంగా ఉంటేనే వారు సంతోషంగా ఉంటారు.
సానుకూల దృక్పథం
ఏ సమస్య వచ్చినా.. దానికి పరిష్కారం ఉంటుందని వారికి నేర్పండి. చిన్న విజయాలను కూడా మెచ్చుకోండి. ఒకవేళ విఫలమైనా మళ్ళీ ప్రయత్నించమని ప్రోత్సహించండి. ఈ విధంగా వారు కష్టపడితే మంచి ఫలితం ఉంటుందనే నమ్మకాన్ని పెంచుకుంటారు.
మీరే రోల్ మోడల్ అవ్వండి
పిల్లలు తమ తల్లిదండ్రులను చూసి చాలా విషయాలు నేర్చుకుంటారు. మీరు ఒత్తిడిని, సమస్యలను ఎలా ఎదుర్కొంటున్నారో వారికి ఒక పాఠం అవుతుంది. మీ ప్రవర్తన వారికి ఆదర్శంగా ఉండాలి.
ఈ చిట్కాలను పాటిస్తే మీ పిల్లలు మరింత సంతోషంగా, ధైర్యంగా, తెలివిగా ఎదుగుతారు. అలాగే భవిష్యత్తులో ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో వారే నేర్చుకుంటారు.




