Awesome: సబ్బును కనిపెట్టక ముందు ప్రజలు బట్టలు ఎలా ఉతికేవారో తెలుసా? ఒక్క వాష్‌లోనే జిగేల్‌మనేవి..!

వేసుకున్న దుస్తులు మురికి కావడం సహజం. అలా మురికి అయిన దుస్తులను మళ్లీ వేసుకోవాలంటే మాత్రం తప్పనిసరిగా ఉతకాల్సిందే. మరి ఇప్పుడంటే ఆ మురికినంతటినీ తొలగించేందుకు..

Awesome: సబ్బును కనిపెట్టక ముందు ప్రజలు బట్టలు ఎలా ఉతికేవారో తెలుసా? ఒక్క వాష్‌లోనే జిగేల్‌మనేవి..!

Updated on: Feb 06, 2023 | 6:06 AM

వేసుకున్న దుస్తులు మురికి కావడం సహజం. అలా మురికి అయిన దుస్తులను మళ్లీ వేసుకోవాలంటే మాత్రం తప్పనిసరిగా ఉతకాల్సిందే. మరి ఇప్పుడంటే ఆ మురికినంతటినీ తొలగించేందుకు, దస్తులు శుభ్రం చేసేందుకు అనేక రకాల డిటర్జెంట్ ఫౌడర్స్, సబ్బులు మార్కెట్‌లో ఉన్నాయి. వాటితో దుస్తులు ఉతకడానికి ఎక్కవ శ్రమ కూడా అవసరం లేదు. అయితే, ఇప్పుడంటే సబ్బులు, సర్ఫ్‌లు అందుబాటులో ఉన్నాయి కానీ, అంతకు ముందు ప్రజలు తమ దుస్తులను ఎలా ఉతికేవారు? అని ఎప్పుడైనా ఆలోచించారా? సుమారు 130 సంవత్సరాల క్రితం డిటర్జెంట్ భారతదేశంలోకి తొలిసారి వచ్చింది. బ్రిటిష్ కంపెనీ లీబర్ బ్రదర్స్ ఇంగ్లండ్.. భారత మార్కెట్‌లో ఈ సబ్బును విడుదల చేసింది. మరి సబ్బు, సర్ఫ్ అందుబాటులోకి రాకముందు బట్టలు ఎలా పిండేవారో ఇప్పుడు తెలుసుకుందాం..

భారతదేశంలో 1897 సంవత్సరంలో మొదటిసారిగా మీరట్‌లో స్నానం చేయడానికి, బట్టలు ఉతకడానికి అవసరమైన సబ్బు, సర్ఫ్ ను ఉత్పత్తి చేసేందుకు ఒక ఫ్యాక్టరీని స్థాపించారు. కానీ సబ్బు రాకముందు.. భారతీయులు తమ దుస్తులను సేంద్రీయ వస్తువులతో శుభ్రం చేసుకునేవారు. ఎక్కువగా కుంకుడుకాయలను ఉపయోగించేవారు. రాజుల రాజభవనాల తోటలలో కుంకుడుకాయ చెట్లు నాటేవారు. దాని పీల్స్ నుండి వచ్చే నురుగుతో మురికి బట్టలను శుభ్రం చేసేవారు. అది దుస్తులను మెరిసేలా చేస్తుంది. నేటికీ, ఖరీదైన, పట్టు వస్త్రాలను శుభ్రం చేయడానికి కుంకుడుకాయలను ఉపయోగిస్తారు. ఇక ఇది జుట్టు కడగడానికి కూడా ఉపయోగిస్తారు. ఒకవేళ కుంకుడుకాయలు అందుబాటులో లేని వారు మాత్రం.. బట్టలను వేడినీళ్లలో నానబెట్టేవారు. ఆ తరువాత రాళ్లపై కొడుతూ మురికిని పొగెట్టేవారు. ధోబీఘాట్‌లో నేటికీ సబ్బు, సర్ఫ్ లేకుండా పాత పద్ధతిలోనే బట్టలు ఉతుకుతున్నారు.

అప్పట్లో ఖరీదైన, మృదువైన బట్టలను ఉతకానికి కుంకుడుకాయలను ఉపయోగించేవారు. అయితే, దానికంటే ముందు.. కుంకుడు కాయలను వేడి నీటిలో వేసి బాగా నానబెట్టేవారు. తద్వారా నురుగు వస్తుంది. ఆ నురుగు తీసి దుస్తులపై వేసి రాయి గానీ, చెక్కపై గానీ రుద్ది పిండేవారు. దీనివల్ల బట్టల మురికి మొత్తం పోతుంది. ఇంకా కుంకుడుకాయ సేంద్రీయమైనది కాబట్టి, శరీరంపై అది ఎలాంటి ప్రతికూలతను చూపదు.

ఇవి కూడా చదవండి

ఇసుకతో కూడా..

పాత కాలంలో బట్టలు ఉతకడానికి ఇసుకను కూడా ఉపయోగించేవారు. రెహ్ అనేది ఒక రకమైన ఖనిజాన్ని బట్టలు ఉతికేందుకు వాడేవారు. ఇందులో సోడియం సల్ఫేట్, మెగ్నీషియం సల్ఫేట్, కాల్షియం సల్ఫేట్ ఉంటాయి. తెల్లటి రంగులో ఉండే ఈ పొడిని నీళ్లలో కలిపి అందులో బట్టలు నానబెట్టి, కాసేపటి తర్వాత బట్టలను రుద్దడం లేదా కొట్టడం ద్వారా మురికిని శుభ్రం చేసేవారు.

మరిన్ని హ్యూమన్‌ఇంట్రస్టింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..