Bizarre: అబ్బరబిడ్డ.. రోజుకు 146 లీటర్ల పాలు ఇస్తున్న ఆవు.. ఎక్కడో తెలుసా?
జంతువులపై చైనా వింత ప్రయోగాలు చేస్తూనే ఉంది. తాజాగా క్లోనింగ్ ద్వారా 3 'సూపర్ ఆవులను' తయారు చేసినట్లు చైనా శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ 'సూపర్ ఆవు' రోజుకు 140 లీటర్ల పాలు ఇవ్వగలదని..
జంతువులపై చైనా వింత ప్రయోగాలు చేస్తూనే ఉంది. తాజాగా క్లోనింగ్ ద్వారా 3 ‘సూపర్ ఆవులను’ తయారు చేసినట్లు చైనా శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ ‘సూపర్ ఆవు’ రోజుకు 140 లీటర్ల పాలు ఇవ్వగలదని వారు చెబుతున్నారు. ‘తాము తయారు చేస్తున్న ఆవు జాతి (సూపర్ కౌ) తన జీవితాంతం 100 టన్నులు అంటే 2 లక్షల 83 వేల లీటర్ల పాలను ఇవ్వగలదు’ అని చైనా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. చైనా మీడియా నివేదికల ప్రకారం.. చైనా శాస్త్రవేత్తలు తమ ‘సూపర్ కౌ’ను నార్త్‌వెస్ట్ విశ్వవిద్యాలయంలో పెంచారు. ఈ ఆవు అధికంగా పాల ఉత్పత్తిని ఇస్తుందంటున్నారు. అయితే, ప్రస్తుతానికి 3 ఆవులు ఉండగా, వచ్చే 2 ఏళ్లలో ఇలాంటి 1,000 అవును సృష్టించే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు.
చైనీస్ ‘సూపర్ కౌ’ గురించిన ఒక నివేదికలో, ఇవి నెదర్లాండ్స్‌కు చెందిన హోల్‌స్టెయిన్ ఫ్రైసియన్ ఆవు నుంచి క్లోనింగ్ చేయబడిందని పేర్కొన్నారు. చైనా ఇప్పటికే 2017లో క్లోనింగ్ ద్వారా ఆవులను ఉత్పత్తి చేసింది. తాజాగా, నార్త్‌వెస్ట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కొత్త రకాల ఆవుల పెంపకం చేపట్టారు.
ఆర్కిటిక్ తోడేలు..
చైనా ఒక ఆవును మాత్రమే కాదు.. ఇతర జంతువులను కూడా క్లోనింగ్ చేస్తోంది. గత సంవత్సరం, చైనా శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే మొట్టమొదటి క్లోనింగ్ తోడేలుకు జన్మనిచ్చారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..