AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Spy Balloon War: అమెరికా, చైనా మధ్య బెలూన్‌ వార్‌.. స్పై బెలూన్‌ను పేల్చివేయడంపై డ్రాగన్ కంట్రీ ఆగ్రహం

అగ్రరాజ్యం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించింది. అంతర్జాతీయ వ్యవహారాల విషయంలో ఇది తీవ్ర ఉల్లంఘనేనంటూ చైనా విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. జనవరి 28 నుంచి అమెరికాలో స్పై బెలూన్‌ దుమారం చెలరేగింది.

Spy Balloon War: అమెరికా, చైనా మధ్య బెలూన్‌ వార్‌.. స్పై బెలూన్‌ను పేల్చివేయడంపై డ్రాగన్ కంట్రీ ఆగ్రహం
China Claims On Spy Balloon
Sanjay Kasula
|

Updated on: Feb 05, 2023 | 1:00 PM

Share

అమెరికా వర్సెస్‌ చైనా..బెలూన్‌ వార్‌..ఈ రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇప్పుడు తారాస్థాయికి చేరాయి. చైనా బెలూన్‌ను అమెరికా కూల్చివేయడంతో ఘాటుగా స్పందించింది డ్రాగన్‌. అగ్రరాజ్యం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించింది. అంతర్జాతీయ వ్యవహారాల విషయంలో ఇది తీవ్ర ఉల్లంఘనేనంటూ చైనా విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. జనవరి 28 నుంచి అమెరికాలో స్పై బెలూన్‌ దుమారం చెలరేగింది. మోంటానాలో స్పై బెలూన్‌ను గుర్తించిన పెంటగాన్‌..తమ రక్షణ స్థావరాలపై చైనా నిఘా పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అధ్యక్షుడు బైడెన్‌ ఆదేశాలతో F-22 ఫైటర్‌ జెట్‌తో ఆ బెలూన్‌ను పేల్చేసింది. నార్త్‌ కరోలినా సముద్రంలో బెలూన్‌ శకలాలు పడ్డాయి. తూర్పు తీరానికి 6 నాటికల్‌ మైళ్ల దూరంలో క్షిపణిని ప్రయోగించామని..సముద్రంలో పడిన శిథిలాలను వెలికితీసే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు అధికారులు.

ఐతే లాటిన్ అమెరికాలో మరో స్పై బెలూన్‌ కలకలం సృష్టిస్తోంది. లాటిన్‌ అమెరికా గగనతలంలో ఓ బెలూన్‌ ఎగురుతున్నట్లు సమాచారం అందింది. అది చైనాకు చెందిన నిఘా బెలూన్‌గా అంచనా వేస్తున్నామని తెలిపింది పెంటగాన్‌. డ్రాగన్‌ పంపిన బెలూన్స్‌ అమెరికాలో గుబులు పుట్టిస్తున్నాయి. అవి స్పై బెలూన్స్‌ అయివుండవచ్చని భావిస్తోంది అమెరికా.

తమ రక్షణరంగ రహస్యాలను తెలుసుకోవడానికే చైనా ఈ పనిచేసిందని అనుమానిస్తోంది. అయితే భయపడాల్సిన అవసరం లేదని వాతావరణ మార్పులపై పరిశోధించేందుకు ప్రయోగించిన బెలూన్‌..దిశ తప్పి అక్కడికి వెళ్లిందని చైనా వివరణ ఇస్తోంది. కానీ చైనా ఇస్తున్న వివరణను అమెరికా నమ్మడం లేదు.

మరోవైపు తమ బెలూన్‌ను అమెరికా పేల్చివేయడంపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే ఇప్పుడు అమెరికా-చైనాల మధ్య ఉద్రిక్తతలకు కారణమైంది. ఐతే ఈ స్పై బెలూన్‌ ఘటనను ప్రశాంతంగా డీల్‌ చేయాలని..పరిస్థితి అదుపు తప్పకముందే ఇరు దేశాలు శాంతంగా మాట్లాడుకోవాలని సూచిస్తున్నాయి ప్రపంచ దేశాలు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం

కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌