AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మాయిపై అత్యాచారం చేశారు.. ఎవరికీ చెప్పొద్దంటూ రూ. 1000 ఇచ్చారు.. కట్ చేస్తే బిగ్ ట్విస్ట్..

పాకిస్తాన్‌లో ఓ వైపు ఆకలి కేకలు వినిపిస్తుంటే.. మరోవైపు మానవ మృగాల చేతిలో బలైపోతున్న అమ్మాయిల ఆర్తనాదాలు వినిపస్తున్నాయి. తాజాగా పాకిస్తాన్‌లోని..

అమ్మాయిపై అత్యాచారం చేశారు.. ఎవరికీ చెప్పొద్దంటూ రూ. 1000 ఇచ్చారు.. కట్ చేస్తే బిగ్ ట్విస్ట్..
Islamabad Rape Case
Shiva Prajapati
|

Updated on: Feb 06, 2023 | 6:03 AM

Share

పాకిస్తాన్‌లో ఓ వైపు ఆకలి కేకలు వినిపిస్తుంటే.. మరోవైపు మానవ మృగాల చేతిలో బలైపోతున్న అమ్మాయిల ఆర్తనాదాలు వినిపస్తున్నాయి. తాజాగా పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లోని ఓ పార్కులో ఆయుధాలు కలిగి ఉన్న ఇద్దరు వ్యక్తులు ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. పాయింట్‌బ్లాంక్‌లో గన్ పెట్టి బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం, ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దంటూ అమ్మాయి చేతిలో వెయ్యి రూపాయలు పెట్టి వెళ్లిపోయారు దుండగులు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఇస్లామాబాద్‌లోని ఎఫ్-9 ప్రాంతంలో బాధిత యువతి, తన స్నేహితుడితో కలిసి పార్కులో నడుచుకుంటూ వెళుతోంది. ఇంతలో ఇద్దరు వ్యక్తులు ఆయుధాలతో వారిని అడ్డగించారు. అమ్మాయిని బలవంతంగా పొదల్లోకి తీసుకెళ్లారు. ఆమె స్నేహితుడిని బెదిరించి అక్కడి నుంచి పంపించేశారు. అనంతరం ఆమెపై అత్యాచారం చేశారు. అయితే, యువతి కేకలు వేయగా.. తీవ్రంగా కొట్టారు. అరిస్తే.. మరో 10 మందితో అత్యాచారం చేయిస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఆ తరువాత ఇద్దరు దుండగులు అమ్మాయిపై అత్యాచారం చేశారు. అనంతరం పార్కులో ఇంకెప్పుడూ తిరుగొద్దని వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు.. ఈ విషయాన్ని బయట ఎవరికీ చెప్పొద్దని, రూ. 1,000 బాధితురాలికి ఇచ్చారు. ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు.

అయితే, తనకు జరిగిన ఘోరాన్ని తలుచుకుని, నిందితులపై కోపంతో రగిలిపోయిన యువతి.. వారి హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోలేదు. నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమెను వైద్య పరీక్షల కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ పరీక్షలో అమ్మాయిపై అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ కావడంతో.. పోలీసులు బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం కేసు నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి

వెతుకులాట..

ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. సమీపంలోని సీసీ కెమెరాలు, ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌ల ఆధారంగా వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ప్రకటించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈలింక్ క్లిక్ చేయండి..