మీ ఇంట్లోని ట్యాప్‌, షవర్‌ నుండి నీళ్లు తక్కువగా వస్తున్నాయా..? ఈ సింపుల్‌ ట్రిక్స్‌తో సమస్యకు చెక్‌ పెట్టండి..

|

May 17, 2024 | 6:58 PM

ఇది మీ రోజువారీ పనిలో ఇబ్బందిని కలిగిస్తుంది. అలాంటి పరిస్థితిలో డబ్బు ఖర్చు లేకుండా మీ ఇంట్లో మీరే సమస్యను పరిష్కరించుకోవచ్చు. మీ ఇంటి కుళాయి లేదా షవర్ నుండి తక్కువ నీరు వస్తున్నట్లయితే ఇక్కడ కొన్ని సులభమైన మార్గాలు ఉన్నాయి. ఈ చిట్కాలు పాటించి మీ ఇంట్లో జామ్‌ అయిన కుళాయి, షవర్‌ని క్లీయర్‌ చేసుకోవచ్చు.

మీ ఇంట్లోని ట్యాప్‌, షవర్‌ నుండి నీళ్లు తక్కువగా వస్తున్నాయా..? ఈ సింపుల్‌ ట్రిక్స్‌తో సమస్యకు చెక్‌ పెట్టండి..
Low Water Pressure
Follow us on

చాలా సార్లు ఇంట్లో కుళాయి లేదా షవర్ నుండి నీరు నెమ్మదిగా వస్తుంటాయి. ఇది మీ రోజువారీ పనిలో ఇబ్బందిని కలిగిస్తుంది. అలాంటి పరిస్థితిలో డబ్బు ఖర్చు లేకుండా మీ ఇంట్లో మీరే సమస్యను పరిష్కరించుకోవచ్చు. మీ ఇంటి కుళాయి లేదా షవర్ నుండి తక్కువ నీరు వస్తున్నట్లయితే ఇక్కడ కొన్ని సులభమైన మార్గాలు ఉన్నాయి. ఈ చిట్కాలు పాటించి మీ ఇంట్లో జామ్‌ అయిన కుళాయి, షవర్‌ని క్లీయర్‌ చేసుకోవచ్చు.

ఫిల్టర్‌ను శుభ్రం చేయండి: ట్యాప్‌లోంచి నీళ్లు బయిటికి రావడానికి ఉన్న చిన్న గొట్టానికి షవర్‌లో ఒక చిన్న మెష్ ఉంటుంది. దీనిని ఎరేటర్ అంటారు. ఇది వాడే క్రమంలో మురికితో నిండిపోతుంది. దీని కారణంగా తక్కువ నీరు వస్తుంది. ట్యాప్ నుండి ఎరేటర్‌ను తీసివేసి దానిని పూర్తిగా శుభ్రం చేయండి.

పైపులలో సున్నం నిక్షేపాలు: చాలా సార్లు నీటిలో ఉండే సున్నపు రేణువులు పైపులలో జమ అవుతాయి. దానిని శుభ్రం చేయడానికి వెనిగర్ ఉపయోగించండి. ఒక సంచిలో వెనిగర్ నింపి ట్యాప్ తలపై కట్టాలి. కొన్ని గంటలపాటు అలాగే ఉంచి తర్వాత కడగాలి.

ఇవి కూడా చదవండి

ప్రెజర్‌ చెక్‌ చేయండి: పైన పేర్కొన్న రెండు పద్ధతులు పని చేయకపోతే, ఇంటి మెయిన్‌ సప్లై వాల్వ్‌ను చెక్‌ చేయండి. బహుశా ప్రెజర్‌ తగ్గిఉంటుంది.. దీన్ని సరిగ్గా సర్దుబాటు చేయండి లేదా ప్లంబర్ సహాయం తీసుకోండి.
అలాగే, షవర్ హెడ్‌ని ఓపెన్‌ చేసి అందులో ఏదైనా మురికి కూరుకుపోయిందేమో చెక్‌ చేయండి. షవర్ హెడ్‌లో మురికి ఉంటే, దానిని క్లీన్‌ చేయండి.

పైపులను చెక్‌ చేయండి: కొన్నిసార్లు పైపులలో మురికి, రస్ట్‌ అడ్డుపడటం కారణంగా వాటర్‌ సప్లై తగ్గిపోవచ్చు. అటువంటి పరిస్థితిలో పైపులను పూర్తిగా చెక్‌ చేయాల్సి ఉంటుంది.

కుళాయిని వేడి నీటితో సరిచేయవచ్చు: అయితే దీని కోసం మీరు కొన్ని చిట్కాలను పాటించాలి. దీని కోసం ముందుగా ఒక పాత్రలో నీటిని బాగా వేడి చేయండి. ఆ తరువాత ట్యాప్ దగ్గరకు వేడి నీటి పాత్రను తీసుకెళ్లండి. ఇప్పుడు కుళాయిని వేడి నీటిలో ముంచి 3 నుండి 4 నిమిషాలు అలాగే జాగ్రత్తగా మీద పడేసుకోకుండా పట్టుకోండి. కుళాయిలో ఇరుక్కున్న వ్యర్థాలు వేడి నీటికి కరిగి నీటిలోకి రావడం మీరు చూస్తారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..