Shivling in Dream: కలలో కైలాసనాథుడు కనిపిస్తే దేనికి సంకేతమో తెలుసా..? అదృష్టం కలిసొస్తుందా లేక..

|

Jul 27, 2024 | 3:41 PM

శ్రావణ మాసం సమయంలో కలలో శివుడు, శివలింగం, దేవాలయం, పాము మొదలైన వాటిని చూడటం అనేది దేనికి సంకేతమో తెలుసా..? స్వప్న శాస్త్రం ప్రకారం, ప్రతి కల మానవ జీవితంతో లోతైన సంబంధం కలిగి ఉంటుంది. అందువల్ల, గ్రంథాలలో కలలకు సంబంధించి మంచి, చెడు సంకేతాలు ఎక్కువగా ప్రస్తావించబడ్డాయి. కలలో శివలింగాన్ని ఎప్పుడు చూస్తే శుభం, ఎప్పుడు చూస్తే అశుభమో ఇక్కడ తెలుసుకుందాం.

Shivling in Dream: కలలో కైలాసనాథుడు కనిపిస్తే దేనికి సంకేతమో తెలుసా..? అదృష్టం కలిసొస్తుందా లేక..
Shivling In Dream
Follow us on

కలలు కనడం మనిషి సాధారణ లక్షణం. ప్రతి ఒక్కరూ నిద్రపోతూ అనేక రకాలైన కలలు చూస్తారు. కలల శాస్త్రం ప్రకారం ప్రతి కల జీవితంలోని శుభ, అశుభ సంఘటనలతో ముడిపడి ఉంటుందని చెబుతారు. మనిషిని హెచ్చరించడానికి అలాంటి కల వచ్చిందని నమ్ముతారు. కొన్ని కలలు శుభ సమయాలను సూచిస్తాయి. కొందరు కొన్ని ప్రధాన సంఘటనల గురించి ఆ వ్యక్తికి అవగాహన కల్పిస్తారు. ఏదైనా పవిత్రమైన తేదీ, ఉపవాసం లేదా పండుగ సమయంలో కలలో దేవతలు, దేవుళ్ల కొన్ని రూపాలను చూడటం శుభప్రదంగా భావిస్తారు. శ్రావణ మాసం సమయంలో కలలో శివుడు, శివలింగం, దేవాలయం, పాము మొదలైన వాటిని చూడటం అనేది దేనికి సంకేతమో తెలుసా..? స్వప్న శాస్త్రం ప్రకారం, ప్రతి కల మానవ జీవితంతో లోతైన సంబంధం కలిగి ఉంటుంది. అందువల్ల, గ్రంథాలలో కలలకు సంబంధించి మంచి, చెడు సంకేతాలు ఎక్కువగా ప్రస్తావించబడ్డాయి. కలలో శివలింగాన్ని ఎప్పుడు చూస్తే శుభం, ఎప్పుడు చూస్తే అశుభమో ఇక్కడ తెలుసుకుందాం.

శివలింగ స్వరూపం:

శ్రావణ మాసం సమయంలో కలలో శివలింగాన్ని చూడటం చాలా శుభ్రప్రదంగా చెబుతున్నారు.. పరమశివుడు నీ పూజను అంగీకరించి నీ పట్ల సంతోషంగా ఉన్నాడు అనడానికి ఇది సంకేతం అంటున్నారు జ్యోతిశాస్త్ర నిపుణులు. త్వరలో మీరు కోరుకున్న ఆనందం మీ జీవితంలోకి వస్తుందని, మీ కోరికలు ఏవైనా కూడా నెరవేరుతాయని విశ్వసిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

విరిగిన శివలింగం దర్శనం:

స్వప్న శాస్త్రం ప్రకారం, పవిత్రమైన శ్రావణ మాసంలో కలలో ఛిన్నాభిన్నమైన, విరిగిన శివలింగాన్ని చూడటం అశుభం. ఇలాంటి కల మీ జీవితంలో అవాంఛనీయ సంఘటనలు జరగవచ్చని అర్థాన్నిస్తుంది.. మీరు ఆర్థికంగా కూడా నష్టపోవచ్చు. కాబట్టి, ఈ సమయంలో తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు.

శివుని దర్శనం కూడా అశుభం:

మీ కలలో శంకరుని ఉగ్ర రూపమైన రుద్రుడిని చూస్తే, అది శివుడు మీపై కోపంగా ఉన్నాడని స్వప్నశాస్త్రంలో చెప్పబడింది. దీంతో మీరు వివిధ సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. శారీరక, మానసిక,యు ఆర్థిక కష్టాలు వెంటాడే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అందువల్ల, ఈ సమయంలో ఏ చిన్న నిర్ణయాన్ని కూడా ఆలోచించి తీసుకోండి.

కలలో చనిపోయిన పామును చూడటం:

మహాదేవుని మెడలో పాముని ఆభరణంగా భావిస్తారు. అందుకే శ్రావణ మాసంలో కలలో సజీవ పాము కనిపించడం శుభప్రదం. మీ కలలో గాయపడిన లేదా చనిపోయిన పాము కనిపిస్తే, అది అశుభంగా పరిగణిస్తారు. ఈ కల అంటే రాబోయే రోజుల్లో మీరు సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

ఇలాంటి కలలు కూడా శుభప్రదమే:

స్వప్న శాస్త్రం ప్రకారం, మీరు శ్రావణ మాసంలో మీ కలలో ధ్యాన భంగిమలో ఉన్న శంకరుడు, శివాలయం, నందీశ్వరుడు కనిపిస్తే అది చాలా శుభకరమైనదిగా పరిగణిస్తారు. మీకు దేవతలకు దేవుడైన మహాదేవుని ప్రత్యేక ఆశీస్సులు ఉన్నాయని అర్థం. మీ కోరికలు త్వరలోనే నెరవేరుతాయని చెబుతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు