భారతదేశానికి పొంచి ఉన్న మరో ముప్పు.. నీటి కోసం పోరాటం తప్పదా..?

| Edited By: Ravi Kiran

Dec 24, 2021 | 6:56 AM

Himalayan: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు హిమానీనదాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇవి వేగంగా కరిగిపోయే పరిస్థితి నెలకొంది.

భారతదేశానికి పొంచి ఉన్న మరో ముప్పు.. నీటి కోసం పోరాటం తప్పదా..?
Himalayan Glaciers
Follow us on

Himalayan: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు హిమానీనదాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇవి వేగంగా కరిగిపోయే పరిస్థితి నెలకొంది. మరో ఇరవై ముప్పై ఏళ్లలో గంగోత్రి లాంటి పెద్ద హిమానీనదాలు అంతరించిపోవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ భయాలు ఒక్కోసారి సినిమా కథలా అనిపించినా నూటికి నూరుపాళ్లు నిజం. గంగా-బ్రహ్మపుత్ర-సింధు నదులు ఎండిపోతాయా? భారతదేశంలోని కోట్లాది మంది ప్రజలు చుక్క నీటి కోసం అలమటిస్తారా..? అంటే నిజమే కావచ్చని అంటున్నారు శాస్త్రజ్ఞులు. దీని వెనుక చాలా బలమైన కారణాలు కూడా ఉన్నాయి.

రాబోయే సంవత్సరాల్లో హిమాలయాల్లో ఉన్న హిమానీనదాలు కరిగిపోతే విపత్తు వస్తుందని భయపడుతున్నారు. పర్యావరణ సంక్షోభం తీవ్ర రూపం దాల్చుతుంది. చాలా పెద్ద పెద్ద నదులు ఎండిపోతాయి. ఒక్క భారతదేశమే కాదు మన పొరుగు దేశాలు కూడా చుక్క నీటి కోసం అలమటిస్తాయి. ఈ హిమానీనదాల ద్రవీభవన రేటు చాలా ఎక్కువగా ఉంది. భారతదేశం, నేపాల్, చైనా, బంగ్లాదేశ్, భూటాన్, పాకిస్తాన్‌తో సహా అనేక దేశాలు దీని బారిన పడతాయి. ఈ దేశాలు కొన్ని సంవత్సరాలలో భయంకరమైన నీటి కొరతను ఎదుర్కొంటాయి.

ఈ ఆందోళనకరమైన విషయం తాజా అధ్యయనంలో వెల్లడైంది. హిమాలయ హిమానీనదాలు 10 రెట్లు వేగంగా కరుగుతున్నాయని లీడ్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. 2000 సంవత్సరం తర్వాత ఈ వేగం పెరిగిందని అధ్యయనంలో స్పష్టంగా తేలింది. హిమాలయ హిమానీనదాలు ప్రపంచంలోని ఇతర హిమానీనదాల కంటే కొంచెం వేగంగా కరుగుతున్నాయని ఈ అధ్యయనం పేర్కొంది. శాస్త్రవేత్తలు 14,798 హిమానీనదాలపై అధ్యయనం చేశారు. ఇందులో హిమానీనదాలు 40 శాతం కోల్పోయాయి. 28 వేల చదరపు కిలోమీటర్ల నుంచి 19,600 చదరపు కిలోమీటర్లకు తగ్గాయి. 590 క్యూబిక్ కిలోమీటర్ల మంచు కరిగిపోయింది. అయితే నేపాల్‌లో హిమాలయ హిమానీనదాలు చాలా వరకు వేగంగా కరిగిపోతున్నాయి. తూర్పు నేపాల్, భూటాన్ ప్రాంతంలో వాటి ద్రవీభవన రేటు అత్యధికంగా ఉంది.

PM Modi: వినియోగదారులకు శుభవార్త.. సహకార డెయిరీ, పాల ఉత్పత్తుల కోసం ప్రత్యేక పోర్టల్..

‘రైతు అంటే పేదవాడు’ అనే భావన విడనాడాలి.. ఎందుకో కారణం చెప్పిన కేంద్ర మంత్రి

RBI: జనవరి 1 నుంచి ఆర్‌బీఐ కొత్త రూల్స్‌ అమలు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..