AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pensioners: ఆ పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. గడువు పెంపు.. 34 వేల మందికి బెనిఫిట్‌..!

Pensioners: రక్షణ శాఖకు చెందిన పెన్షనర్లకు కేంద్ర సర్కార్ గుడ్‌న్యూస్‌ తెలిపింది. తమ వార్షిక జీవన ప్రమాణ పత్రాన్ని సమర్పించే గడవును మరో నెల పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది..

Pensioners: ఆ పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. గడువు పెంపు.. 34 వేల మందికి బెనిఫిట్‌..!
Subhash Goud
|

Updated on: May 28, 2022 | 9:45 AM

Share

Pensioners: రక్షణ శాఖకు చెందిన పెన్షనర్లకు కేంద్ర సర్కార్ గుడ్‌న్యూస్‌ తెలిపింది. తమ వార్షిక జీవన ప్రమాణ పత్రాన్ని సమర్పించే గడవును మరో నెల పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ప్రస్తుతం పొడిగించిన గడువుతో జూన్‌ 25 వరకు పెన్షనర్లు తమ వార్షిక ధ్రువీకరణ, జీవన ప్రమాణ పత్రాన్ని సమర్పించవచ్చు. అంతకుముందు ఈ గడువు ఈ నెల 25 వరకే ఉండేది. స్పర్ష్‌లోకి మారిన 34,636 మంది పెన్షనర్లు ఇంకా తమ వార్షిక ధ్రువీకరణను చేపట్టలేదు. మే 17 వరకు 2021 నుంచి పత్రాలు పెండింగ్‌లో ఉన్న పెన్షనర్ల సంఖ్య 43,774 ఉంది. ఆన్‌లైన్‌లో గానీ, సంబంధిత బ్యాంకుల ద్వారా గానీ ఈ ప్రక్రియను పూర్తి చేయలేదని రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ పెన్షనర్లకు మరో రోజుల పాటు గడువును పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

పెన్షన్‌ పొందాలంటే వార్షిక ధృవీకరణ తప్పనిసరి:

పెన్షనర్లు ప్రతి నెల పెన్షన్‌ పొందాలంటే ఈ వార్షిక ధృవీకరణ తప్పనిసరి. స్పర్ష్ సిస్టమ్ ద్వారా ఎలాంటి ఎక్స్‌టర్నల్ ఇంటర్‌మీడియరీ అవసరం లేకుండా రక్షణ శాఖలో పనిచేసిన మాజీ ఉద్యోగుల అకౌంట్లలోకి నేరుగా పెన్షన్‌ను క్రెడిట్ చేస్తోంది ప్రభుత్వం. ప్రస్తుతం రక్షణ శాఖు చెందిన 33 లక్షల మందికి పైగా పెన్షనర్లు ఉంటే.. వారిలో 5 లక్షల మంది ఈ కొత్త విధానంలోకి మారారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఈ మైగ్రేషన్ ప్రక్రియ పూర్తి కానుంది.

ఇవి కూడా చదవండి

దరఖాస్తు ఫామ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోండిలా..

పెన్షనర్ల జీవన ప్రమాణ పత్రాన్ని మీ కంప్యూటర్‌ లేదా మొబైల్‌లో జీవన ప్రమాణ్‌ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవడం ద్వారా పూర్తి చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. దీనికోసం https://jeevanpramaan.gov.in portal నుంచి దరఖాస్తు ఫామ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పెన్షనర్లు https://jeevanpramaan.gov.in/ppouser/login వెళ్లి కూడా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

కామన్‌ సర్వీస్‌ సెంటర్‌ వెళ్లి కూడా..

పెన్షనర్లు జీవన ప్రమాణ పత్రాన్ని సమర్పించేందుకు కామన్‌ సర్వీసు సెంటర్లకు వెళ్లి కూడా వార్షిక ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. మీ దగ్గరలోని డీపీడీఓకు వెళ్లి కూడా ఈ పని పూర్తి చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
రోజూ ఒక నారింజ తింటే ఇన్ని లాభాలా..? ఏయే రోగాలను నయం చేస్తుందంటే
రోజూ ఒక నారింజ తింటే ఇన్ని లాభాలా..? ఏయే రోగాలను నయం చేస్తుందంటే
IND vs WI మ్యాచ్ కాదు భయ్యో.. 10 ఏళ్ల నాటి పగ..!
IND vs WI మ్యాచ్ కాదు భయ్యో.. 10 ఏళ్ల నాటి పగ..!
వీరిని పెళ్ళి చేసుకుంటే రోజూ గొడవలు జరుగుతాయి.. ఏయే రాశులంటే?
వీరిని పెళ్ళి చేసుకుంటే రోజూ గొడవలు జరుగుతాయి.. ఏయే రాశులంటే?
రెండు పీపీఎఫ్ అకౌంట్లు తెరవొచ్చా..? కేంద్రం కొత్త రూల్ ఇదే..
రెండు పీపీఎఫ్ అకౌంట్లు తెరవొచ్చా..? కేంద్రం కొత్త రూల్ ఇదే..
జింబాబ్వేపై విజయం.. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో అరుదైన సీన్..
జింబాబ్వేపై విజయం.. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో అరుదైన సీన్..
స్వర్గం నిజంగా ఉందా.. ఏకంగా అడ్రస్ చెబుతున్న సైంటిస్ట్..
స్వర్గం నిజంగా ఉందా.. ఏకంగా అడ్రస్ చెబుతున్న సైంటిస్ట్..
రాత్రి పడుకునేముందు ఈ నేచురల్‌ మిల్క్ ఫేస్ ప్యాక్స్ ట్రై చేశారంటే
రాత్రి పడుకునేముందు ఈ నేచురల్‌ మిల్క్ ఫేస్ ప్యాక్స్ ట్రై చేశారంటే
శ్రీ విష్ణు మరోసారి నవ్వించాడా లేదా..?
శ్రీ విష్ణు మరోసారి నవ్వించాడా లేదా..?
మీ చెవుల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు
మీ చెవుల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు
వీరికి మామిడి డేంజర్.. తింటే హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిందే
వీరికి మామిడి డేంజర్.. తింటే హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిందే