AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Google Doodle: ‘వసంత ఋతువు’కు ప్రత్యకంగా స్వాగతం పలికిన గూగుల్.. అందమైన యానిమేటెడ్ వీడియోతో డూడుల్..

spring season 2021: వసంత ఋతువుకు గూగుల్ ప్రత్యేకంగా స్వాగతం పలికింది. ఇందుకోసం బ్లూ, గ్రీన్, రెడ్, ఆరెంజ్, ఎల్లో, పింక్ వంటి కలర్స్‏తో అందమైన పువ్వులు,

Google Doodle: 'వసంత ఋతువు'కు ప్రత్యకంగా స్వాగతం పలికిన గూగుల్.. అందమైన యానిమేటెడ్ వీడియోతో డూడుల్..
Google Doodle
Rajitha Chanti
|

Updated on: Mar 20, 2021 | 10:47 AM

Share

spring season 2021: వసంత ఋతువుకు గూగుల్ ప్రత్యేకంగా స్వాగతం పలికింది. ఇందుకోసం బ్లూ, గ్రీన్, రెడ్, ఆరెంజ్, ఎల్లో, పింక్ వంటి కలర్స్‏తో అందమైన పువ్వులు, అందమైన పువ్వులు, చెట్లతో ముళ్ల పందిని లాంటి జంతువును క్రియేట్ చేసి… ఈ వసంత ఋతువుకు స్వాగతం పలికింది. ఈ ఋతువులో చెట్లు చిగురిస్తాయి. ఇది మార్చి 20 నుంచి ఉత్తరార్థగోళంలో మొదలై జూన్ 21తో ముగుస్తుంది. ఈరోజు వసంత ఋతువు మొదటి రోజు. దీనినే స్పింగ్ ఈక్వినాక్స్ అంటారు. అంటే పగలు, రాత్రి వ్యవధి సమయం సమానంగా ఉంటుంది. ఈక్వినాక్స్ అనే పదం లాటిన్ బాష నుంచి వచ్చింది. ఈరోజు యావత్ ప్రపంచంలో రాత్రి సమయం, పగలు సమయం రెండు 12 గంటలు ఉంటాయి.

ఈరోజు ఉష్టోగ్రత, కాంతి సమతుల్యత రాత్రుల కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ ఈక్వానాక్స్ అనేది శీతకాలపు ముగింపును సూచిస్తుంది. అలాగే వేసవి కాలం రాకను తెలియజేస్తుంది. ఈరోజున సూర్యుడు నేరుగా తూర్పున ఉదయించి పశ్చిమాన అస్తమిస్తాడు. సంవత్సరంలోని ఇతర రోజులలో చూస్తే.. ఆఫ్ సెంటర్‏లో సూర్యుడు కనిపిస్తాడు. అలాగే ప్రతి సంవత్సరం మార్చి, సెప్టెంబర్ నెలలో రెండు విఘవత్తులు వస్తాయి. అవి మార్చి విఘవత్తు సూర్యుడు భూమధ్య రేఖను దాటిని క్షణం కాగా.. భూమధ్యరేఖకు పైన ఆకాశంలో ఉన్న ఉహత్మక రేఖ – దక్షిణం నుంచి ఉత్తరం వరకు, సెప్టెంబరులో దీనికి విరుద్ధంగా ఉంటుంది. కొన్ని సంస్కృతులు వసంత ఋతువు విషువత్తును “మధ్య-వసంత ఋతువు”గా భావిస్తాయి, మరికొన్ని ఎక్కువ ఉష్ణోగ్రత మందగింపుతో వసంత ఋతువు ప్రారంభంగా భావిస్తాయి.  చెట్లపై పసుపు, నారింజ ఎరుపు ఆకులతో వసంత ఋతువు దృశ్యం నేలమీద పడిపోతుంది. రోమన్ శకం తరువాత, ఈ పదాన్ని పాత ఫ్రెంచ్ పదం తరువాత దీనిని అసలు లాటిన్‌కు సాధారణీకరించారు. మధ్యయుగ కాలంలో, 12 వ శతాబ్దం నాటికి దాని వాడకానికి అరుదైన ఉదాహరణలు ఉన్నాయి, కానీ 16 వ శతాబ్దం నాటికి ఇది సాధారణ వాడుకలో ఉంది. భారతీయ పురాణాలలో, వసంత ఋతువు సరస్వతి నేర్చుకునే దేవతకి ఇష్టపడే కాలంగా పరిగణించబడుతుంది, దీనిని “వసంత ఋతువు దేవత” (శారద) అని కూడా పిలుస్తారు.

ఈ ఏడాది గూగుల్ డూడుల్ 2021ను యానిమేటెడ్ ప్రకృతి పుష్పాలు, జంతువులతో సూచించింది. పుష్పాలు, మొక్కలు, ముళ్ళపందిని మనం క్షుణ్ణంగా గమనిస్తే.. అవి గూగుల్ పదాన్ని సూచిస్తున్నాయి.

Also Read:

Telangana MLC Election Results 2021 LIVE: తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నాలుగో రోజు ఓట్ల లెక్కింపు

సినిమా విడుదలను వాయిదా వేస్తున్నాం… అధికారికంగా ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ.. కారణమేంటంటే..