International Happiness Day 2021: ఒత్తిడిని జయించడానికి సంతోషమే పరమౌషధం.. సంతోషంగా ఉంటే సగం రోగాలు దరిచేరవు..
మనిషి జీవితంలో ఆనందం అనేది చాలా ముఖ్యం. ఎన్ని ఒత్తుడులు, సమస్యలు ఉన్నా.. వాటిని మరిచి ఆనందంగా జీవించాలి అంటుంటారు. సంతోషం వలన మనకు చాలా లాభాలున్నాయి.
మనిషి జీవితంలో ఆనందం అనేది చాలా ముఖ్యం. ఎన్ని ఒత్తుడులు, సమస్యలు ఉన్నా.. వాటిని మరిచి ఆనందంగా జీవించాలి అంటుంటారు. సంతోషం వలన మనకు చాలా లాభాలున్నాయి. ఆరోగ్యంగా ఉండేందుకు మెడిసిన్ కంటే నవ్వుతూ.. హ్యాపీగా ఉంటే ఎలాంటి వ్యాధినైనా నివారించవచ్చు అంటారు. అందుకే సంతోషానికి సగం బలం అంటారు. అలాగే నువ్వు ఆనందించే క్షణాలను లెక్కవేసేంత కాకుండా.. లెక్కలేనంతగా గడపాలి. ఆనందంగా ఉన్నప్పుడు మీ శరీరం ఎంతో ఉత్సహంగా ఉంటుంది. అలాగే మీరు చేయాల్సిన పనులపై శ్రద్ధ చూపేలా ఉంటుంది. మీలో ఉన్న అపనమ్మకాలన్ని తోలగి.. మీమై మీకే నమ్మకం కలిగేంతగా మీ మెదడు చురుకుగా చేస్తుంది. అలాగే మీ అందానికి మరింత రూపు తెచ్చేది నవ్వు. మనస్పుర్తిగా నవ్వితే.. ఎంతటి బాధలైన తట్టుకోగలమే దైర్యం వస్తుంది. ప్రస్తుతం జీవగ గమనంలో మనిషి.. ఆనందించే క్షణాలు చాలా తక్కువ. ఉద్యోగాల ఒత్తిడులు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యల కారణంగా సంతోషమనే గడియా లేకుండా.. ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా.. కాలంతో పరుగులు తీస్తున్నాడు. అందుకే మనిషి మరిచిపోతున్న ఆనందాన్ని.. దానివలన ఉండే ప్రయోజనాలను తెలియజేసేందుకే ఈ సంతోష దినోత్సవాన్ని జరుపుకుంటారు.
International Happiness Day 2021: 2013 నుంచి ఐక్యరాజ్య సమితి ఆనందం ప్రాముఖ్యతను యావత్ ప్రపంచానికి తెలియజేస్తూ… ప్రతి సంవత్సరం మార్చి 20న అంతర్జాతీయ సంతోష దినోత్సవంగా జరుపుకుంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అతి పెద్ద సమస్యలు.. ఆకలి, నిరక్షరాస్యత, అవగాహన లేకపోవడం, మానవ హక్కుల ఉల్లంఘన వంటివి అంతం చేయడానికి ప్రతి ఏటా ఈ సంతోష దినోత్సవాన్ని జరుపుకుంటారు. అందుకు 2012 జూలై 12న ఈ తీర్మానాన్ని ఆమోదించింది. ముందుగా ఈ తీర్మానాన్ని భూటాన్ ప్రతిపాదించింది. 1970 ప్రారంభం నుంచి జాతీయ ఆదాయంపై జాతీయ ఆనందాల ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది. అనంతరం స్థూల జాతీయ ఉత్పత్తిపై స్తూల జాతీయ ఆనందాన్ని స్వీకరించడం జరిగింది.
ప్రస్తుతం ప్రపంచమంత కోవిడ్ పట్ల తీవ్ర భయాందోళనలతో కుటుంబ సభ్యులు, బందుమిత్రుల మధ్య ప్రేమ ఆప్యాయలు తగ్గిపోయాయి. ఈ మహామ్మారి ఎన్నో కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని నింపింది. పిల్లలకు తల్లిదండ్రులను.. తల్లిదండ్రులకు పిల్లలను.. తోబుట్టువులను.. యువత లక్ష్యాలను… చదువులను అన్నింటిని ఒక సంవత్సరం కాలంలో కనుమరుగయ్యేలా చేసింది. అలాగే దేశ ఆర్థిక వ్యవస్థను కూడా చిన్నభిన్నాం చేసింది. కానీ వాటన్నింటిని ఎదుర్కోంటూ మనిషి ఉప్పుడిప్పుడే తిరిగి జీవన ప్రయాణాన్ని కొనసాగించడం ఆరంభించాడు. లాక్డౌన్ అనంతరం కరోనా భయం మనసులో ఉన్నా.. జీవన పోరాటానికి సిద్ధమయ్యాడు. మహమ్మారి తన చెంతకు రాకుండా ఉండటానికి అవసరమైన పద్ధతులను పాటిస్తూ.. జీవిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితులలో కూడా ఆనందాన్ని మరచిపోకూడదు. మీకున్న కాలాన్ని వ్యర్థం చేసుకోకుండా.. ప్రతి క్షణాన్ని ఆనందమయం చేసుకునేందుకు ప్రయత్నించాలి. మీతో పాటు మీ చుట్టూ పక్కల వారు కూడా ఆనందంగా ఉండేలా ప్రేరెపించాలి. ఈరోజు అంతర్జాతీయ సంతోషం దినోత్సవం.. మీ సన్నిహితులకు కొన్ని సద్గురు చెప్పిన సూక్తులు..
* మీరు నిజంగా ఆనందంగా ఉంటే, సంతృప్తి కోసం వెతకరు. * జీవితానికి కొంత వేగం ఉంది. మీరు ఆనందంగా తొందరపడాలి కానీ, అసహనంగా ఎప్పుడూ ఉండకూడదు. * మీకు ప్రపంచం పట్ల ఏ మాత్రం శ్రద్ధ ఉన్నా, మీరు చేయవలసిన మొదటి పని మిమ్మల్ని మీరు ఆనందమయులుగా చేసుకోవడం. * మనుషులకు ఆనందంగా ఉండడం ఎలాగో తెలియకపోవడానికి ఒకే కారణం, దానికి కావలసిన పరిఙ్ఞానం వారి వద్ద లేకపోవడమే. * అంతరంగంలోకి చూడడం మాత్రమే పరమానందమని ఈ ప్రపంచం తెలుసుకోవాలన్నది నా ఆకాంక్ష. దానితో పోలిస్తే, మరే ఇతర భోగమైనా తిరోగమన చర్యే.
Also Read:
Google Doodle: ‘వసంత ఋతువు’కు ప్రత్యకంగా స్వాగతం పలికిన గూగుల్.. అందమైన యానిమేటెడ్ వీడియోతో డూడుల్..