AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mushrooms: అయ్య బాబోయ్.. పుట్టగొడుగులు మాట్లాడుకుంటాయా? అంతుచిక్కని రహస్యం వీడింది..!

ప్రపంచంలో మనుషులు, జంతువులే కాదు, మనకు తెలియని ఎన్నో జీవులు వింత మార్గాల్లో కమ్యూనికేట్ చేసుకుంటాయి. అయితే, తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ పరిశోధన అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. నేల లోపల నిశ్శబ్దంగా కనిపించే పుట్టగొడుగులు కూడా ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయని అవి 50 పదాల వరకూ "భాష"ను కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ అద్భుతమైన ఆవిష్కరణ, ప్రకృతిలోని సంభాషణల గురించి మనకున్న అవగాహనను పూర్తిగా మార్చేస్తోంది. మరి, ఈ అంతుచిక్కని ఫంగస్ ప్రపంచంలో అసలేం జరుగుతోంది?

Mushrooms: అయ్య బాబోయ్.. పుట్టగొడుగులు మాట్లాడుకుంటాయా? అంతుచిక్కని రహస్యం వీడింది..!
Mushrooms Secret Language To Communication
Bhavani
|

Updated on: May 29, 2025 | 5:40 PM

Share

పుట్టగొడుగులు కేవలం కూరగాయలు మాత్రమే కాదు, అవి ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయని, వాటికి దాదాపు 50 పదాల భాష ఉందని తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు! ఈ సంచలన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. పక్షులు, జంతువులు సంభాషించుకోవడం గురించి విన్నాం, కానీ మట్టిలోపల నిశ్శబ్దంగా ఉండే పుట్టగొడుగులు కూడా సమాచారాన్ని పంచుకుంటాయని కొత్త అధ్యయనాలు చెబుతున్నాయి.

మైసీలియం నెట్‌వర్క్ ద్వారా సంభాషణ

యూనివర్శిటీ ఆఫ్ ది వెస్ట్ ఆఫ్ ఇంగ్లాండ్‌కు చెందిన ప్రొఫెసర్ ఆండ్రూ ఆడమట్స్కీ ఈ వినూత్న పరిశోధన చేశారు. పుట్టగొడుగుల దారాలతో కూడిన మైసీలియం అనే భూగర్భ నెట్‌వర్క్‌ల ద్వారా అవి విద్యుత్ సంకేతాలను పంపుకుంటాయని ఆయన గుర్తించారు. ఈ సంకేతాలు మన మనుషుల భాషలోని పదాల లాగే ఒక క్రమ పద్ధతిలో ఉంటాయని ఆయన పరిశోధనలో తేలింది.

ఈ అధ్యయనం ప్రకారం, పుట్టగొడుగులు 50 రకాల “పదాలను” ఉపయోగించి ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయని, ఈ ఫలితాలు ‘రాయల్ సొసైటీ ఓపెన్ సైన్స్’ పత్రికలో ప్రచురితమయ్యాయి.

పరిశోధనలో ఏం తెలిసింది?

డా. ఆడమట్స్కీ బృందం కొన్ని రకాల పుట్టగొడుగులపై లోతైన పరిశోధనలు చేశారు. మైసీలియంలోకి చిన్న మైక్రోఎలక్ట్రోడ్‌లను అమర్చి వాటి విద్యుత్ కార్యకలాపాలను నమోదు చేసుకున్నారు. వాటిని విశ్లేషించగా, పుట్టగొడుగులు పంపిన సంకేతాలు మన భాషలోని పదాలను పోలి ఉన్నాయని తేలింది.

పుట్టగొడుగులు దాదాపు 50 వేర్వేరు “పదాలను” ఉత్పత్తి చేశాయి.

ఈ పదాల సగటు పొడవు 5.97 అక్షరాలుగా ఉంది.

పుట్టగొడుగులకు ఆహారం దొరికినప్పుడు లేదా అవి దెబ్బతిన్నప్పుడు ఈ విద్యుత్ సంకేతాలు పెరిగాయి. అంటే, అవి ఆహారం గురించి లేదా ప్రమాదం గురించి ఒకదానికొకటి చెప్పుకుంటాయని అర్థం.

ఇంకా పరిశోధనలు కావాలి

ప్రొఫెసర్ ఆడమట్స్కీ, పుట్టగొడుగులు మనలాగే మాట్లాడుతాయని ఖచ్చితంగా చెప్పలేనని, కానీ సమాచారాన్ని పంచుకునే విధానంలో చాలా పోలికలు ఉన్నాయని అంటున్నారు. ఈ అధ్యయనం ప్రకృతిలోని జీవుల మధ్య మేధస్సు, కమ్యూనికేషన్ గురించి మన అవగాహనను పూర్తిగా మార్చగలదని నిపుణులు భావిస్తున్నారు. భవిష్యత్‌లో ఈ పుట్టగొడుగుల “భాష” గురించి మరింత లోతైన పరిశోధనలు జరగాల్సి ఉంది.