Optical illusion: మీరు జీనియస్ అయితే ఈ చిత్రంలో సింహం ఎక్కడ ఉందో చెప్పండి చూద్దాం..!
ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు మన కళ్లను మోసగించడమే కాకుండా మన మెదడును కూడా ఆటపట్టిస్తాయి. ఈ చిత్రాలు కొన్నిసార్లు స్పష్టంగా కనిపించినా అసలు విషయం కనిపించకుండా దాచిపెడతాయి. ఇవి ప్రత్యేకంగా మన పరిశీలనా శక్తిని పరీక్షించడానికి రూపొందించబడ్డాయి. ఈ తరహా చిత్రాల్లో కొన్ని జంతువులు మనకు ఊహించని కోణంలో మన దృష్టిని తప్పించేలా దాగి ఉంటాయి.

ఆప్టికల్ ఇల్యూషన్ అంటే కళ్లకు కనిపించే దృశ్యం మన మెదడు అర్థం చేసుకోవడంలో జరిగే అపార్థం అని చెప్పొచ్చు. ఒకే చిత్రం వేర్వేరు వ్యక్తులకు వేర్వేరు రీతిలో కనిపించొచ్చు. ఇది పూర్తిగా మన దృష్టి కోణం, మన మెదడు ఎలా పని చేస్తుందో అనేదానిపై ఆధారపడి ఉంటుంది. ఇలాంటి చిత్రాలను ఆసక్తిగా గమనించడమే కాదు మన పరిశీలనా నైపుణ్యాన్ని మెరుగుపరచడానికీ ఉపయోగపడతాయి.
ఈరోజు మీ కోసం ఓ ఆసక్తికరమైన ఆప్టికల్ ఇల్యూషన్ ఉంది. మీరు చూస్తున్న ఈ చిత్రంలో సింహం దాగి ఉంది. మీరు 2 సెకన్లలో దాన్ని గుర్తించగలరా..? ఈ చిత్రం మీ దృష్టిని పరీక్షించడానికి అద్భుతంగా రూపుదిద్దుకుంది. చాలా మంది చూస్తూ సింహం ఎక్కడుందో కనబడటం లేదని అంటున్నారు. కానీ కొందరు మాత్రం క్షణాల్లో కనిపెట్టేస్తారు. ఇంతకీ మీరు సింహాన్ని గుర్తించగలిగారా..? మీరు తక్కువ సమయంలో గుర్తించగలిగితే మీ పరిశీలనా శక్తి అద్భుతంగా ఉందని అర్థం.

ఈ తరహా ఇల్యూషన్ చిత్రాలు నెటిజన్లను ఎంతో ఆకర్షిస్తున్నాయి. మళ్ళీ మళ్ళీ చూసినా ఏదో ఒక కొత్త విషయం కనిపించేలా ఈ చిత్రాలు రూపొందుతాయి. ఇలాంటి పజిల్ ఛాలెంజ్‌లు ఎందుకు ఇంత ఆసక్తిగా ఉంటాయంటే, మన మెదడును అవి పూర్తిగా తికమక పెట్టేస్తాయి. కొన్ని చిత్రాల్లో సింహం, పులి, చిరుత, ఎలుగుబంటి లాంటి జంతువులు మనం ఊహించని స్థానాల్లో దాగి ఉంటాయి. ఇవి మనలో దృష్టి నైపుణ్యాన్ని మెరుగుపరచడమే కాదు. మన సహజ పరిణామాన్ని కూడా వృద్ధి చేయడానికి ఉపయోగపడతాయి.
మీరు చూస్తున్న ఈ చిత్రాన్ని లక్షల మంది చూసి సింహం ఎక్కడుందో కనపడటం లేదు అంటూ తికమకపడుతున్నారు. మరికొందరు మాత్రం అరే ఇది చాలా సులభం అంటూ గర్వంగా చెప్పుకుంటున్నారు. మీరు సింహాన్ని గుర్తించారా..? అయితే మీ పరిశీలనా శక్తికి హాట్సాఫ్. ఇల్యూషన్ చిత్రాలు ఆన్‌లైన్ వినోదం కోసం మాత్రమే కాదు. మెదడును పదును పెట్టే సాధనంగా కూడా పని చేస్తాయి. ఇవి మన దృష్టిని మెరుగుపరచడానికి, ఫోకస్ పెంచడానికి, లోతుగా పరిశీలించే నైపుణ్యాన్ని పెంచడానికి ఉపయోగపడతాయి.
ఇంకా కనిపెట్టనివారు మరొకసారి బాగా ఫోకస్ చేసి చూడండి. కొంచెం ఓపికతో పరిశీలించండి. అప్పుడు మీరు సింహాన్ని ఖచ్చితంగా గుర్తించగలుగుతారు. ఇంకా కనుగొనలేకపోతే ఆందోళన చెందకండి. మీ కోసం సింహం ఎక్కడుందో నేను వెతికాను. మీరు చూడండి చిత్రంలో రౌండ్ చేసి ఉంది. చూసి జాగ్రత్త పడండి. సింహాన్ని తీసుకెళ్లే సాహసం మాత్రం చేయకండి. ఈ తరహా పజిల్స్ మన మెదడును చురుకుగా ఉంచుతాయి. వాటిని చూడటం, అర్థం చేసుకోవడం ఓ మానసిక వ్యాయామంలా పని చేస్తుంది. అందుకే ఇలాంటి ఆసక్తికరమైన ఛాలెంజ్‌లను తరచూ ప్రయత్నిస్తూ ఉండండి.

