False Police Case: మీపై ఎవరైనా తప్పుడు పోలీసు కేసు వేశారా..? ఇలా చేయండి.. పోలీసులు మిమ్మల్ని అరెస్టు చేయలేరు

|

Aug 22, 2022 | 4:51 PM

False Police Case: మన రక్షణ కోసమే చట్టాలు రూపొందించబడ్డాయి. అయితే కొందరు చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. కుట్ర, ఏదో శత్రుత్వంతోనో, దురుద్దేశంతోనో కొందరు ..

False Police Case: మీపై ఎవరైనా తప్పుడు పోలీసు కేసు వేశారా..? ఇలా చేయండి.. పోలీసులు మిమ్మల్ని అరెస్టు చేయలేరు
False Police Case
Follow us on

False Police Case: మన రక్షణ కోసమే చట్టాలు రూపొందించబడ్డాయి. అయితే కొందరు చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. కుట్ర, ఏదో శత్రుత్వంతోనో, దురుద్దేశంతోనో కొందరు ఒకరిపై తప్పుడు పోలీసు కేసు వేస్తున్నారు. తప్పుడు ఆరోపణలు చేస్తూ అమాయకులను ఇరికించి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇది ఎవరికైనా జరగవచ్చు. అటువంటి పరిస్థితిలో రక్షించబడటానికి ఏదైనా చట్టపరమైన మార్గం ఉందా? అంటే ఉన్నాయంటున్నారు న్యాయనిపుణులు. రక్షించడానికి చట్టపరమైన మార్గం ఉంది. ఎవరైనా మీపై తప్పుడు ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తే దానిని రక్షించడానికి IPC (ఇండియన్ పీనల్ కోడ్‌)లో నిబంధనలు ఉన్నాయి. ఐపిసి సెక్షన్ 482 ప్రకారం తప్పుడు ఎఫ్‌ఐఆర్‌ను సవాలు చేయవచ్చని ఢిల్లీలోని కర్కర్‌దూమా కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది శుభం భారతి తెలిపారు.

మీపై లేదా మీకు తెలిసిన వారిపై తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయబడితే, సెక్షన్ 482 ప్రకారం అతను హైకోర్టు నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ సందర్భంలో మీపై ఎటువంటి చర్య తీసుకోరు. పోలీసులు తీసుకునే చర్యలు నిలిపివేయవలసి ఉంటుంది. అయితే ఎఫ్‌ఐఆర్ తప్పు అని రుజువు చేయడానికి మీ వద్ద తగిన ఆధారాలు ఉండాలి.

ఈ సెక్షన్ కింద మీ న్యాయవాది మీ కోసం హైకోర్టులో దరఖాస్తు చేసుకోవచ్చు. దీని ద్వారా మీరు మీ నిర్దోషిత్వానికి రుజువు ఇవ్వవలసి ఉంటుంది. సాక్ష్యం సిద్ధం చేయడానికి మీరు న్యాయవాది సహాయంతో సాక్ష్యాలను సిద్ధంగా ఉంచుకోవచ్చు. అలాగే మీకు అనుకూలంగా సాక్షులను సిద్ధంగా ఉంచుకోవచ్చు. మీ దరఖాస్తులో వాటిని పేర్కొనడం అవసరం.

ఇవి కూడా చదవండి

ఈ విషయం కోర్టుకు వచ్చినప్పుడు మీకు అనుకూలంగా సమర్పించిన సాక్ష్యాలు, సాక్షులు సరిపోతారని కోర్టు భావించినప్పుడు, పోలీసులు వెంటనే చర్యను నిలిపివేయవలసి ఉంటుంది. ఏదైనా కేసులో మిమ్మల్ని కుట్రపూరితంగా ఇరికించినట్లయితే మీరు హైకోర్టులో అప్పీలు చేసుకోవచ్చు. హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా పోలీసులు మీపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేరు.

మీపై అరెస్ట్ వారెంట్ జారీ చేసినా, పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేయలేరు. అంటే తప్పుడు ఎఫ్‌ఐఆర్‌ ఉంటే నేరుగా న్యాయవాది ద్వారా హైకోర్టుకు వెళ్లవచ్చు. న్యాయస్థానం న్యాయమూర్తి అది అవసరమని భావిస్తే అతను దర్యాప్తు అధికారికి దర్యాప్తుకు సంబంధించి ఆదేశాలు, సూచనలను కూడా ఇవ్వవచ్చు. కానీ మీపై తప్పు ఉన్నట్లయితే కోర్టులో ఉపశమనం లభించదని గుర్తించుకోవాలి. మీరు ఎలాంటి తప్పు చేయలేదని భావించినప్పుడే ఆ రకంగా ముందుకు వెళ్లాలి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి