New Year: నూతన సంవత్సరానికి సరికొత్తగా స్వాగతం.. జీవితాన్ని మెరుగుపరుచుకునేందుకు టాప్ 5 రెసల్యూషన్స్ ఇవే..

|

Dec 31, 2022 | 10:48 AM

కొత్త సంవత్సరానికి సమయం ఆసన్నమైంది. మరికొద్ది గంటల్లో నూతన సంవత్సరం ప్రారంభం కానుంది. ఎన్నో ఆశలు, మరెన్నో జ్ఞాపకాలతో న్యూ ఇయర్ అడుగు పెట్టబోతున్నాం. అయితే.. మనలో చాలా మందికి కొత్త...

New Year: నూతన సంవత్సరానికి సరికొత్తగా స్వాగతం.. జీవితాన్ని మెరుగుపరుచుకునేందుకు టాప్ 5 రెసల్యూషన్స్ ఇవే..
New Year
Follow us on

కొత్త సంవత్సరానికి సమయం ఆసన్నమైంది. మరికొద్ది గంటల్లో నూతన సంవత్సరం ప్రారంభం కానుంది. ఎన్నో ఆశలు, మరెన్నో జ్ఞాపకాలతో న్యూ ఇయర్ అడుగు పెట్టబోతున్నాం. అయితే.. మనలో చాలా మందికి కొత్త సంవత్సరం సందర్భంగా రెసల్యూషన్ తీసుకోవడం అలవాటు. అంటే.. రాబోయే ఏడాదిలో తాము ఏం చేయకూడదనే విషయం పట్ల అవగాహన కలిగి ఉండటం. బరువు తగ్గడం, ఆల్కహాల్‌ తగ్గించడం వంటి సాధారణ విషయాలే కాకుండా.. కాస్త వెరైటీగా ఉండే వాటిని చేర్చుకోవాలని అంటున్నారు నిపుణలు..

1.అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వండి: దీర్ఘకాలంలో మీకు కావలసిన పెద్ద ఖర్చుల కోసం పొదుపు చేయడానికి అనవసరమైన స్వల్పకాలిక ఖర్చులను తగ్గించండి. తప్పదు అనుకున్న వాటిని మాత్రమే కొనుగోలు చేయాలి. ఇలా చేయడం ద్వారా వాటిమీద పెట్టే అదనపు ఖర్చు అంతా మిగలుతుంది. ఫలితంగా భవిష్యత్ లో ఏదైనా ఆర్థిక ఇబ్బందులు తలెత్తితే.. పొదుపు చేసుకున్న సొమ్ము చక్కగా ఉపయోగపడుతుంది. తగినంతగా ఆదా చేసిన తర్వాత వచ్చే మార్పు మానసిక ప్రశాంతతను ఇస్తుంది.

2. ప్రకృతిలో సమయం గడపండి: ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, టీవీలు, ఫోన్‌లు వంటి గాడ్జెట్స్ కు అతుక్కుపోయాం. వాటి నుంచి వచ్చే బ్లూ లైట్‌.. కంటి సమస్యలను కలిగిస్తుంది. అంతే కాకుండా ఇది మానసిక స్థితిపై కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి నెలలో ఒకసారైనా ప్రకృతితో కలిసి ఉండేందుకు ప్రయత్నించండి. రోజూ 20-30 నిమిషాలు ప్రకృతిలో గడపడం ఒక పాయింట్‌గా చేసుకోండి. ఎందుకంటే ఇది ప్రతికూల భావోద్వేగాలను తగ్గిస్తుంది. మానసిక స్థితిని చాలా వరకు సానుకూలంగా ప్రభావితం చేస్తుంది.

ఇవి కూడా చదవండి

3. భౌతికంగా ఏదైనా చేయండి: ఏదైనా సృష్టించడం అనేది అత్యంత సంతృప్తికరమైన కార్యకలాపాలలో ఒకటి. డిజిటల్‌గా చేయడం కంటే ఎక్కువ సంతృప్తినిస్తుంది. బేకింగ్, గార్డెనింగ్, పెయింటింగ్ వంటి అభిరుచిని ఎంచుకోండి. మీరు దీన్ని క్రమం తప్పకుండా చేసినప్పుడు.. కొత్త నైపుణ్యం కలిగి ఉండే అవకాశం ఉంటుంది.

4. దయతో ఉండండి: ఇతరులు ఏమి చేస్తున్నారో ఎప్పటికీ తెలియదు కాబట్టి.. ప్రయత్నం చేసే ముందు ఒక సెకను ఆగి ఆలోచించాలి. దయ అనేది సరిహద్దులు, భూభాగాలు, దేశాలలో అర్థం చేసుకునే భాష. దయ ఇవ్వడానికి ఎక్కువ శ్రమ అవసరం లేదు. కానీ దాని విలువ ఏమిటో తీసుకునే వారికి మాత్రమే తెలుస్తుంది.

5. అనవసరమైన వాటిని తిరస్కరించండి: అవసరం లేని వాటిని విరాళంగా ఇవ్వడం లేదా విక్రయించడం వంటివి చేయవచ్చు. ఇలా చేయడం ద్వారా దుస్తులు, అలంకరణ లేదా పాత్రల నుంచి స్థలాన్ని క్లియర్ చేయాలి. ఇది మీ నివాస ప్రాంతాన్ని రీఫ్రెష్ చేయడమే కాకుండా.. తాజా ఆలోచనలు, కొత్త ఆలోచనలను కూడా అనుమతిస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి