Tattoos: టాటూ వేయించుకుంటున్నారా..? ఈ విషయాలు గుర్తుంచుకోండి..! కొన్ని టాటూస్ వల్ల..
పచ్చబొట్లు అనేది ఒక విభిన్నమైన కళ. ప్రస్తుతం టాటూలను ఎక్కువగా అమెరికా, ఐరోపాల్లో యువతరం పిచ్చిగా వేయించుకుంటున్నారు. శాశ్వతమైన మేకప్ లాగా కొంతమంది పచ్చ బొట్లు వాడుతున్నారు.
పచ్చబొట్లు చర్మం మీద వేయించుకొనే ఒకరకమైన చిహ్నాలు. దీనిలో వివిధ వర్ణపదార్ధాలను సన్నని సూదుల ద్వారా గుచ్చి వేస్తారు. మనుషులలో ఇవి వారివారి అభిరుచులను బట్టి వేయించుకొనే గుర్తులు. ఈ పచ్చబొట్టు ఈ ఆధునిక కాలంలో టా టూస్‌గా దర్శనమిస్తోంది. అయితే, టా టూస్ వేసుకోవడంపై డౌట్స్‌ను మనం తెలుసుకుందాం..పచ్చబొట్లు అనేది ఒక విభిన్నమైన కళ. ప్రస్తుతం టాటూలను ఎక్కువగా అమెరికా, ఐరోపాల్లో యువతరం పిచ్చిగా వేయించుకుంటున్నారు. శాశ్వతమైన మేకప్ లాగా కొంతమంది పచ్చ బొట్లు వాడుతున్నారు. టాటూస్ వచ్చాక పచ్చబొట్టు ప్రభ తగ్గిపోయింది. నగరాలు పట్టణాల్లో టాటూలు వేసే వారు ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నారు. రకరకాల టా టూస్ వేసుకునేందుకు యువత మొగ్గుచూపుతుందంటున్నారు టా టూస్ అర్టిస్టులు..ఆధునిక అలంకరణలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన ఫ్యాషన్. బ్రాండెడ్ దుస్తులు, గాగుల్స్, పలురకాల హెయిర్ స్టయిల్స్, చెవిపోగులు, బ్రాస్‌లెట్…ఈ వరుసలో యువకుల అలంకరణలో టాటూలు వచ్చి చేరాయి. ఇక అమ్మాయిలు నడుము, చేతులు, ఛాతీ ఇలా శరీరంలోని వివిధ భాగాలమీద టాటూలు వేయించుకుని తమ ప్రత్యేకతను, అభిరుచిని చాటుకుంటున్నారు. అయితే పర్మినెంట్ టా టూస్ వేసుకోవడం వల్ల నొప్పి ఉందంటున్నారు నిపుణులు.తెల్లని మెరిసే చర్మం మీద రంగురంగుల టాటూ చూడటానికి చాలా అందంగా కనబడుతుంది. ఇందు కోసం ఎంతైనా ఖర్చు చేయడానికి యువత ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. కొన్ని టా టూస్ వెంటనే వేసేవిగా ఉంటే.. శరీరం మొత్తంగా వేయాలంటే సమయం పడుతుంది. ఇందుకు ఖర్చ కూడా ఎక్కువగానే ఉంటుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos