English Alphabets: ఇంగ్లీష్ అక్షరమాలో 27 అక్షరాలు కాస్తా 26 గా మార్పు.. మరి ఈ ఛేంజ్ ఎలా జరిగిందో తెలుసా?

English Alphabets: మీకు ఇంగ్లీష్ లుసా? మీరు ఆంగ్లంలో మాట్లాడగలరా? మీ గురించి ఇంగ్లీషులో చెప్పండి? మన చుట్టూ ఉన్నవారు తరచుగా వినే కొన్ని వాక్యాలు ఇవి. ఆఫీసులో, ఇంట్లో లేదా ఎవరైనా ఇంగ్లీష్‌లో మాట్లాడినప్పుడు.. ఇంగ్లీషు నేర్చుకోవాలనే ఆలోచన కలుగుతుంది. అది మంచి విషయమే. ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ భాషల పరిజ్ఞానం ఉండాలి. ఇది అతనికి విజయానికి కొత్త మార్గాలను అందించవచ్చు. అయితే, ఇంగ్లీష్ నేర్చుకునే ముందు.. ఆంగ్ల అక్షరమాలలో ఎన్ని అక్షరాలు ఉన్నాయంటే ఏం చెబుతారు? ఎవరైనా 26 అక్షరాలు ఉన్నాయని టకీమని సమాధానం చెబుతారు.

English Alphabets: ఇంగ్లీష్ అక్షరమాలో 27 అక్షరాలు కాస్తా 26 గా మార్పు.. మరి ఈ ఛేంజ్ ఎలా జరిగిందో తెలుసా?
English Letters

Updated on: Sep 16, 2023 | 8:54 AM

English Alphabets: మీకు ఇంగ్లీష్ లుసా? మీరు ఆంగ్లంలో మాట్లాడగలరా? మీ గురించి ఇంగ్లీషులో చెప్పండి? మన చుట్టూ ఉన్నవారు తరచుగా వినే కొన్ని వాక్యాలు ఇవి. ఆఫీసులో, ఇంట్లో లేదా ఎవరైనా ఇంగ్లీష్‌లో మాట్లాడినప్పుడు.. ఇంగ్లీషు నేర్చుకోవాలనే ఆలోచన కలుగుతుంది. అది మంచి విషయమే. ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ భాషల పరిజ్ఞానం ఉండాలి. ఇది అతనికి విజయానికి కొత్త మార్గాలను అందించవచ్చు. అయితే, ఇంగ్లీష్ నేర్చుకునే ముందు.. ఆంగ్ల అక్షరమాలలో ఎన్ని అక్షరాలు ఉన్నాయంటే ఏం చెబుతారు? ఎవరైనా 26 అక్షరాలు ఉన్నాయని టకీమని సమాధానం చెబుతారు. మరి ఈ 26 అక్షఱాలు మొదటి నుండి ఉన్నవేనా? మధ్యలో ఏమైనా మార్పులు జరిగాయా? అంటే.. జరిగాయనే చెప్పాలి. ఇంగ్లీష్ అక్షరమాలలో స్వల్ప మార్పు జరిగింది. ఆ మార్పు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఇంగ్లీష్ లెటర్స్ 26 లేదా 27?

ఇప్పటి వరకు, చిన్నప్పటి నుండి మీరు ఆంగ్లంలో A నుండి Z వరకు దాదాపు 26 అక్షరాలను చదివి ఉంటారు. అయితే ఇంతకు ముందు మొత్తం 27 అక్షరాలు ఉండేవి. 1835 వరకు, ‘&’ అక్షరాన్ని 27వ అక్షరంగా లెక్కించారు. వీటిని కలపడం ద్వారానే ఆంగ్ల అక్షరమాల సిద్ధమైంది. కానీ 1835లో ఆంగ్ల అక్షరమాలను మార్చి ‘&’ అనే అక్షరాన్ని తొలగించారు. దాంతో ఆంగ్లంలో 26 అక్షరాలను శాశ్వతంగా మార్చారు. అప్పటి నుంచి 26 అక్షరాలు కంటిన్యూ అవుతోంది. నేటికీ పాఠశాలలు, కళాశాలల్లో ఈ విషయాన్ని బోధిస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఈ ప్రశ్న అడిగినప్పుడు.. మొదటి నుండి ఆంగ్లంలో 27 అక్షరాలు ఉండేవి అని చెప్పండి. ఆ తరువాత 26 అని చెప్పండి.

ఈ రెండు అక్షరాలలో ఓ ప్రత్యేకత ఉంది..

ఆంగ్ల వర్ణమాల రాయడానికి రెండు మార్గాలు ఉన్నాయి. మొదటిది పెద్ద అక్షరం, రెండవది చిన్న అక్షరం. చిన్న అక్షరాల గురించి చూసుకున్నట్లయితే.. ఈ అక్షరాలన్నీ వ్రాయడానికి పెన్ను ఎత్తాల్సిన అవసరం లేని విధంగా రూపొందిచడం జరిగింది. కానీ వాటిలో, i (i), j (j) అక్షరాలు వ్రాయడం కాస్త డిపరెంట్‌గా ఉంటుంది. దీని కోసం కచ్చితంగా పెన్ను ఎత్తాల్సి ఉంటుంది. i, j రాసేటప్పుడు వాటి పైన ఉన్న చుక్కను గుర్తించడానికి పెన్ను ఎత్తవలసి ఉంటుంది. అయితే, లాటిన్ భాష నుండి ఈ చుక్క కనుగొనడం జరిగిందట. లాటిన్‌లో ఈ శీర్షిక అంటే డాట్‌ని ‘టైటులస్’ అంటారు. సబ్జెక్ట్‌ను లాటిన్ మాన్యుస్క్రిప్ట్‌లో వ్రాస్తున్నప్పుడు.. చుట్టుపక్కల పదాలను i, j నుండి వేరు చేయడానికి వాటిపై చుక్క పెట్టారట.

మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..