Vastu Tips: ఈ వస్తువులు అస్సలు చేజారొద్దు.. ఏం జరుగుతుందో తెలుసా?
వాస్తు అంటే కేవలం ఇంటి నిర్మాణం, ఇంట్లో ఏర్పాటు చేసుకునే వస్తువులు మాత్రమే కాదని నిపుణులు చెబుతున్నారు. అయితే వస్తువుల వినియోగం విషయంలో చేసే కొన్ని తప్పులు కూడా ప్రతికూల ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల వస్తువులు చేతిలో నుంచి ఎట్టి పరిస్థితుల్లో కింద పడకూడదని వాస్తు పండితులు చెబుతున్నారు...
వాస్తు అంటే కేవలం ఇంటి నిర్మాణం, ఇంట్లో ఏర్పాటు చేసుకునే వస్తువులు మాత్రమే కాదని నిపుణులు చెబుతున్నారు. అయితే వస్తువుల వినియోగం విషయంలో చేసే కొన్ని తప్పులు కూడా ప్రతికూల ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల వస్తువులు చేతిలో నుంచి ఎట్టి పరిస్థితుల్లో కింద పడకూడదని వాస్తు పండితులు చెబుతున్నారు. కొన్ని రకాల వస్తువులు కింద పడడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుందని పండితులు అంటున్నారు. ఇతకీ చేతి నుంచి చేజారకుండా ఉండాల్సిన ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* కోటి విద్యలు కూటి కొరకే అని చెబుతుంటారు. అందుకే ఆహారాన్ని దైవంతో భావిస్తుంటాం. అలాంటి బియ్యం నేలపై పడకూదని వాస్తు పండితులు చెబుతుంటారు. బియ్యాన్ని నేలపాటు చేయడం వల్ల పేదరికం వస్తుందని నమ్ముతారు. బియ్యం చేతిలో నుంచి జారితే పేదరికం వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. అందుకే బియ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని చెబుతున్నారు.
* మతపరమైన పవిత్ర గ్రంథాలు చేతి నుంచి జారిపోకుండా చూసుకోవాలని పండితులు చెబుతున్నారు. ఇవి చేతి నుంచి జారిపోవడం మంచిది కాదని అంటున్నారు. అందుకే మత గ్రంథాలను జాగ్రత్తగా మంచి ప్రదేశంలో భద్రపరచాలి.
* ఎట్టి పరిస్థితుల్లో చేతుల్లో నుంచి నాణెలు పడిపోకుండా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. డబ్బు లక్ష్మీ దేవికి ప్రతిరూపంగా చెబుతుంటారు. కాబట్టి నాణేలు చేతిలో నుంచి జారిపడడం వల్ల ఆర్థిక పరమైన ఇబ్బందులకు దారి తీస్తుందని అంటున్నారు.
* దీపాలు కింద పడడం కూడా మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వెలిగించిన దీపాలు కింద పడితే ఆర్థిక ఇబ్బందులు, ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని అంటున్నారు. మానసిక సంక్షోభం, గందరగోళం వంటి సమస్యలకు దారి తీస్తాయని అంటున్నారు.
* కత్తెరను నేలపై పడేయకూడదు. పొరపాటున కూడా చేతిలో నుంచి జారిపోకుండా చూసుకోవాలి. కత్తెర చేతిలో నుంచి పడిపోతే అది సంబంధాలను దెబ్బ తీస్తుందని నిపుణులు అంటున్నారు. ఇది పురోగతికి ఆటంకం కలిగిస్తుందని చెబుతున్నారు.
* ఉప్పును కింద పడేయం అనేది అశుభకరమని వాస్తు పండితులు చెబుతున్నారు. దీనివల్ల ఆర్థిక నష్టం, కుటుంబ సభ్యుల్లో గందరగోళం, ఆరోగ్య సమస్యలు వంటి వాటికి దారి తీస్తుందని చెబుతున్నారు.
* పాలు కూడా చేయి జారకుండా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పాలు స్వచ్ఛతకు, శ్రేయస్సుకు సూచికగా చెబుతుంటారు. ఇలాంటి పాలు నేలజారితో కుటుంబ కలహాలు, ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం పలువురు పండితుల అభిప్రాయం మేరకు అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..