Vastu: బెడ్‌ రూమ్‌లో ఈ వస్తువులు ఉన్నాయా.? వెంటనే తీసేయండి..

వాస్తు విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని వాస్తు పండితులు చెబుతుంటారు. ముఖ్యంగా బెడ్‌ రూమ్‌ విషయంలో కచ్చితంగా కొన్ని తప్పులు చేయకూడదని అంటున్నారు. సహజంగా బెడ్‌ రూమ్‌ విషయంలో చేసే మిస్టేక్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం...

Vastu: బెడ్‌ రూమ్‌లో ఈ వస్తువులు ఉన్నాయా.? వెంటనే తీసేయండి..
Bedroom Vastu
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 29, 2024 | 6:56 PM

వాస్తును భారతీయులు ఎంతలా విశ్వసిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే వాస్తు అనేది కేవలం ఇంటి నిర్మాణానికి మాత్రమే పరిమతం కాదని, ఇంట్లో ఏర్పాటు చేసుకునే వస్తువులు మొదలు గోడలకు వేసే రంగుల వరకు వాస్తు నియమాలు పాటించాలని నిపుణులు చెబుతుంటారు. మరీ ముఖ్యంగా బెడ్ రూమ్‌ వాస్తు విషయంలో కొన్ని తప్పులు చేయకూడదని చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం పడకగదిలో కొన్ని రకాల వస్తువులు ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదని చెబుతున్నారు. ఇంతకీ ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* బెడ్‌రూమ్‌లో ఎట్టి పరిస్థితుల్లో చనిపోయిన పూర్వీకుల ఫొటోలు ఉండకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇది నెగిటివ్‌ ఎనర్జీకి దారి తీస్తుందని అంటున్నారు. అలాగే బెడ్‌ రూమ్‌లో దేవుడి చిత్ర పటాలు కూడా లేకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.

* బెడ్‌ రూమ్‌లో డ్రెస్సింగ్ టేబుల్‌ ఏర్పాటు చేసుకోవడం సర్వసాధారణమైన విషయం. అయితే డ్రెస్సింగ్ టేబుల్‌ అద్దంలో ఎట్టి పరిస్థితుల్లో మంచం పడకూడదని నిపుణులు చెబుతున్నారు. అద్దంలో బెడ్ ప్రతిబింబం పడితే దంపదుల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు.

* చాలా మందికి బెడ్‌ కింద చీపురు పెట్టుకునే అలవాటు ఉంటుంది. అయితే ఇది మంచిది కాదని నిపుణులు అంటున్నారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగిటివ్‌ ఎనర్జీ పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు.

* ఇక బెడ్‌ కింద దేవుడి ఫొటోలను, చనిపోయిన పూర్వీకుల ఫొటోలు కూడా ఉండకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగిటివ్‌ ఎనర్జీ పెరిగే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. అందుకే ఈ తప్పు చేయకూడదని నిపుణులు అంటున్నారు.

* బెడ్‌ రూమ్‌లో ఉండే వాచ్‌ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బెడ్‌రూమ్‌లో ఆగిపోయిన వాచ్‌ను ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదని సూచిస్తున్నారు. దీనివల్ల పనులు వాయిదా పడే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.

* పడకగదిలో జీవిత భాగస్వాముల ఫొటోలను ఏర్పాటు చేసుకుంటే ఆ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. నైరుతి దిశలో ఆలుమగల ఫొటో ఫ్రేమ్‌ను ఏర్పాటు చేసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.

* బెడ్‌రూమ్‌లో ఎట్టి పరిస్థితుల్లో చెప్పులను పెట్టకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇలా ఉంచడం వల్ల నెగిటివ్‌ ఎనర్జీ పెరిగి నిద్రలేమి వంటి సమస్యలకు దారి తీసే అవకాశం ఉంటుందని అంటున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం పలువురు వాస్తు పండితులు, వాస్తు శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇషా అంబానీ బంగ్లాను కొన్న హాలీవుడ్ స్టార్ కపుల్.. ఎన్ని కోట్లంటే?
ఇషా అంబానీ బంగ్లాను కొన్న హాలీవుడ్ స్టార్ కపుల్.. ఎన్ని కోట్లంటే?
ఈ సీఎం సాబ్ గారి భార్య బాలీవుడ్‌లో స్టార్ సింగర్ అని తెలుసా?
ఈ సీఎం సాబ్ గారి భార్య బాలీవుడ్‌లో స్టార్ సింగర్ అని తెలుసా?
రైఫిల్ గురిపెట్టిన సీఎం రేవంత్.. టార్గెట్ అస్సలు మిస్ అవ్వదు!
రైఫిల్ గురిపెట్టిన సీఎం రేవంత్.. టార్గెట్ అస్సలు మిస్ అవ్వదు!
సూర్యునిపై యూరప్ తాజా అధ్యయనం.. ఇస్రో ప్రయోగానికి తేడా ఇదే..
సూర్యునిపై యూరప్ తాజా అధ్యయనం.. ఇస్రో ప్రయోగానికి తేడా ఇదే..
ఆధార్ కార్డులో సాహా బ్యూటీ శ్రద్ధా కపూర్ ఎలా ఉందో చూశారా? వీడియో
ఆధార్ కార్డులో సాహా బ్యూటీ శ్రద్ధా కపూర్ ఎలా ఉందో చూశారా? వీడియో
రేవతి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటా: అల్లు అర్జున్
రేవతి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటా: అల్లు అర్జున్
‘భారతీయ వాయుయాన్‌ విధేయక్‌’ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం..
‘భారతీయ వాయుయాన్‌ విధేయక్‌’ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం..
అయ్యో చిట్టి తల్లి!.. పిల్లర్ల మధ్యలో ఇరుక్కున్న తల.. 
అయ్యో చిట్టి తల్లి!.. పిల్లర్ల మధ్యలో ఇరుక్కున్న తల.. 
అతడి యాక్టింగ్ చూస్తే దిమ్మతిరిగిపోద్ది..
అతడి యాక్టింగ్ చూస్తే దిమ్మతిరిగిపోద్ది..
చలికాలంలో పిల్లలకు అరటిపండు ఇవ్వడం సరైనదా.. కాదా?
చలికాలంలో పిల్లలకు అరటిపండు ఇవ్వడం సరైనదా.. కాదా?