Petrol Myths: ఉదయం పెట్రోల్ కొట్టిస్తే మైలేజ్ పెరుగుతుందా? నిపుణులు ఏం చెబుతున్నారో? తెలిస్తే షాకవుతారు
ప్రస్తుతం టెక్నాలజీ పెరిగినా చాలా సింపుల్ పుకార్లు జనబాహుల్యంలోకి చాలా విపరీతంగా వెళ్తున్నాయి. కొంతమందైతే ఆ పుకార్లు నిజమనుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఉదయమే పెట్రోల్ కొట్టించుకుంటే మైలేజ్ పెరుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారని ఓ వార్త హల్‌చల్ చేస్తోంది.
ప్రపంచంలో సోషల్ మీడియా వినియోగం పెరిగాక పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గతంలో కమ్యూనికేషన్ లేకపోవడం వివిధ పుకార్ల వల్ల ప్రజలు చాలా నష్టపోయేవారు. అయితే ప్రస్తుతం టెక్నాలజీ పెరిగినా చాలా సింపుల్ పుకార్లు జనబాహుల్యంలోకి చాలా విపరీతంగా వెళ్తున్నాయి. కొంతమందైతే ఆ పుకార్లు నిజమనుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఉదయమే పెట్రోల్ కొట్టించుకుంటే మైలేజ్ పెరుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారని ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. దీంతో ఉదయం సమయంలో పెట్రోల్ కొట్టించుకునే వారి సంఖ్య పెరుగుతుంది. అయితే నిజంగా ఉదయం పెట్రోల్ కొట్టించుకుంటే మైలేజ్ పెరుగుతుందా? ఈ విషయంపై నిపుణులు ఏమంటున్నారో? ఓ సారి తెలుసుకుందాం.
వాహనంలో పెట్రోల్ నింపే విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో కార్లు, బైక్‌లను రీఫిల్ చేయడానికి ఉదయం లేదా సాయంత్రం ఏ సమయాన్ని ఎంచుకోవాలో ప్రజలు అయోమయంలో ఉన్నారు. ఈ వైరల్ ట్రెండ్ ప్రకారం సాయంత్రం కాకుండా ఉదయం మీ వాహనంలో పెట్రోల్ నింపుకుంటే అద్భుతమైన మైలేజీని పొందవచ్చని చాలా మంది ప్రజలు భావిస్తున్నారు. ఉదయంతో పాటు రాత్రి సమయంలో మీరు మీ వాహనాన్ని రీఫిల్ చేస్తే ఇంధనం సాంద్రత పెరుగుతుందని కొందరు చెబుతున్నారు.
అయితే ఇది పుకారు మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు. మీరు ఏ సమయంలోనైనా నిరభ్యంతరంగా మీ వాహనంలో పెట్రోల్ నింపుకోవచ్చని తెలుపుతున్నారు. ఒకవేళ మీరు ఇంధన సాంద్రతలో ఏదైనా వ్యత్యాసాన్ని లేదా అనుమానాన్ని కనుగొంఏ అది కచ్చితంగా పెట్రోల్ పంపులో చేసిన మోసం మాత్రమేనని గుర్తించాలని చెబుతున్నారు. కాబట్టి ఏ సమయంలోనైనా పెట్రోల్ కొట్టించుకోవచ్చని ఇంధన సాంద్రతలో ఏ మాత్రం తేడాలు ఉండవని పేర్కొంటున్నారు.