మనమంతా కనీసం ఒక సారైనా రైలు ప్రయాణం చేసే ఉంటాం. రైలు ప్రయాణికులు ఏవరైనా సాధారణంగా తక్కువ దూరం అయితే జనరల్ కోచ్‌లలో, సుదూర ప్రయాణాలైతే రిజర్వేషన్ కోచ్‌లలో ప్రయాణిస్తారు. జనరల్ కోచ్‌లలో ప్రయాణించేందుకు ముందుగా రిజర్వేషన్ చేసుకునే అవసరం లేదు. అయితే రిజర్వేషన్ కోచ్‌లలో ప్రయాణించాలంటే తప్పనిసరిగా రిజర్వేషన్ చేసుకోవాలి. కానీ కొన్ని కారణాల వల్ల కొందరు ముందుగా టికెట్లు బుక్ చేసుకోకపోవడంతో జనరల్ కోచ్‌లలో ప్రయాణిస్తుంటారు కొందరు. ఇక ఈ రిజర్వేషన్ కోచ్‌లు రైలు మధ్యలో ఉంటే.. జనరల్ భోగీలు రైలు ముందు లేదా వెనుక లేదా రెండు వైపులా ఉంటాయి. కానీ ఇండియన్ రైల్వేస్‌లలో అవి చివరలలోనే ఎందుకు ఉంటాయి..? ఎప్పుడైనా ఆలోచించారా..? అలా ఉండడానికి గల కారణమేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
రైల్వే అధికారుల ప్రకారం.. మిగతా కోచ్‌లలో కంటే జనరల్ బోగీలలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ప్రతి స్టేషన్ నుంచి పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఇందులో ఎక్కుతారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ కోచ్‌లను రైలు మధ్యలో పెడితే మొత్తం వ్యవస్థనే కుప్పకూలుతుంది. మిగిలిన కోచ్‌లలోని ప్రయాణికులు హాయిగా దిగలేరు లేదా రైలు ఎక్కలేరు. అంతేకాదు జనరల్ బోగీలలో స్థలం లభించకపోతే ఆ ప్రయాణికులు ఇతర కోచ్‌లలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తారు. ఇది పరిస్థితిని మరింత దిగజారుస్తుంది. అందుకే జనరల్ కోచ్‌లను సాధారణంగా రైలు ప్రారంభంలో లేదా చివరిలో ఉంచుతారు.
రైలు ప్రారంభంలో లేదా చివరిలో జనరల్ కోచ్‌ని ఉంచడానికి మరొక కారణం ఏంటంటే ప్రమాదం జరిగినప్పుడు అది రెస్క్యూ-రిలీఫ్ ఆపరేషన్‌లలో సహాయపడుతుంది. రైలు మధ్యలో జనరల్ కోచ్‌ను ఉంచినట్లయితే రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల రెస్క్యూ ఆపరేషన్ చేయడం కష్టమవుతుంది. దీనివల్ల రైలు ప్రారంభంలో లేదా చివరిలో జనరల్ కోచ్‌లను ఏర్పాటు చేస్తారు.
మరిన్ని హ్యూమన్ ఇంటరెస్టింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..