Dream: బిల్డింగ్‌ పై నుంచి పడినట్లు కల వచ్చిందా.? అర్థం ఏంటంటే..

|

Jul 07, 2024 | 9:18 PM

మన ప్రమేయం లేకుండా వచ్చే కలలు మన భవిష్యత్తును నిర్ణయిస్తాయని స్వప్న శాస్త్రంలో కూడా ప్రస్తావించారు. ప్రతీ ఒక్క కలకు ఒక అర్థం ఉంటుందని పండితులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో బిల్డింగ్‌ పై నుంచి కింద పడినట్లు కల వస్తుంటుంది. ఇంతకి ఈ కల అర్థం ఏంటి.? దీంతో పాటు కలలో కనిపించే కొన్ని అంశాలు వాటి అర్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Dream: బిల్డింగ్‌ పై నుంచి పడినట్లు కల వచ్చిందా.? అర్థం ఏంటంటే..
Dream
Follow us on

రాత్రి పడుకున్న తర్వాత కలలు రావడం అత్యంత సాధారణమైన విషయం. మనలో ప్రతీ ఒక్కరికీ రాత్రి కచ్చితంగా కల వస్తుంది. అయితే ఈ కవల ఆధారంగా మనం ఏం ఆలోస్తున్నాం. భవిష్యత్తులో ఏం జరగబోతోంది.? లాంటి విషయాలను అంచనా వేయొచ్చని పండితులు చెబుతున్నారు. కేవలం పండితులు మాత్రమే కాకుండా మానసిక నిపుణులు సైతం ఇదే విషయాన్ని చెబుతుంటారు.

మన ప్రమేయం లేకుండా వచ్చే కలలు మన భవిష్యత్తును నిర్ణయిస్తాయని స్వప్న శాస్త్రంలో కూడా ప్రస్తావించారు. ప్రతీ ఒక్క కలకు ఒక అర్థం ఉంటుందని పండితులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో బిల్డింగ్‌ పై నుంచి కింద పడినట్లు కల వస్తుంటుంది. ఇంతకి ఈ కల అర్థం ఏంటి.? దీంతో పాటు కలలో కనిపించే కొన్ని అంశాలు వాటి అర్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* ఎత్తయిన కొండ లేదా బిల్డింగ్‌పై నుంచి కింద పడుతున్నట్లు కల వస్తే చెడు సంకేతంగా భావించాలని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి కల వస్తే అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. అయితే ఒకవేళ కింద పడ్డా ఎలాంటి గాయాలు కాకపోతే ఎదురవ్వబోయే ఆటంకాలను విజయవంతంగా దాటేస్తారని అర్థం చేసుకోవాలి.

* ఇక ఏదైన ఒక విషయం గురించి దీర్ఘంగా ఆలోచిస్తున్నా ఇలా కింద పడుతున్నట్లు కలలు వస్తాయని పండితులు చెబుతున్నారు. ఒత్తిడికి ఎక్కువగా గురైనా, శరీరం ఎక్కువ సేపు శ్రమించినా ఇలాంటి కలలు వస్తాయని స్వప్నశాస్త్రంలో వివరించారు.

* ఒకవేళ గ్లాసులో పాలు పోసుకొని తాగుతున్నట్లు కల వస్తే త్వరలోనే మంచి జరగబోతున్నట్లు అర్థం చేసుకోవాలి. ఆర్థికంగా ఊహించని లాభం వచ్చే అవకాశం ఉంటుదని చెబుతున్నారు.

* కలలో చేప కనిపిస్తే ఏదో శుభకార్యం జరగబోతున్నట్లు అర్థం చేసుకోవాలి. అయితే మాంసం తింటున్నట్లు కల వస్తే మాత్రం మీకు గాయాలయ్యే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.

* దెబ్బలు తింటున్నట్లు కలలో కనిపిస్తే.. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి.

* నెమలి మంచి చిహ్నమైనా కలలో కనిపిస్తే మాత్రం అశుభంగా భావించాలని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంటుందని అర్థం చేసుకోవాలి.

* ఇక ఒకవేళ కుక్క మిమ్మల్ని కరిచినట్లు కనిపిస్తే త్వరలో కష్టాలు ప్రారంభయ్యే అవకాశాలు ఉంటాయని అర్థం.

* సాధారణంగా పెళ్లి అనేది శుభకార్యమని తెలిసిందే. అయితే కలలో పెళ్లి జరిగినట్లు కల వస్తే మాత్రం మంచిది కాదని పండితులు చెబుతున్నారు. పెళ్లి జరిగినట్లు కలలో కనిపిస్తే.. కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉందని అర్థం చేసుకోవాలి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు పలువురు పండితులు, శాస్త్రాల్లో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..