Dream: కలలో కుక్క కనిపించిందా.? దాని అర్థం ఏంటో తెలుసా.?

|

Jun 25, 2024 | 9:40 PM

పడుకున్న సమయంలో కలలు రావడం సర్వసాధారణమైన విషయం. మనలో ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక సమయంలో కలలు వస్తూనే ఉంటాయి. అయితే కలలో కనిపించే అంశాలు మన వాస్తవిక జీవితంపై ప్రభావం చూపుతాయని పండితులు చెబుతున్నారు. దీనికి శాస్త్రంతో పాటు మానసిక నిపుణులు సైతం పలు కారణాలు చెబుతున్నారు. స్వప్నశాస్త్రంలో వీటికి సంబంధించి పలు విషయాలను తెలిపారు...

Dream: కలలో కుక్క కనిపించిందా.? దాని అర్థం ఏంటో తెలుసా.?
Dog In Dream
Follow us on

పడుకున్న సమయంలో కలలు రావడం సర్వసాధారణమైన విషయం. మనలో ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక సమయంలో కలలు వస్తూనే ఉంటాయి. అయితే కలలో కనిపించే అంశాలు మన వాస్తవిక జీవితంపై ప్రభావం చూపుతాయని పండితులు చెబుతున్నారు. దీనికి శాస్త్రంతో పాటు మానసిక నిపుణులు సైతం పలు కారణాలు చెబుతున్నారు. స్వప్నశాస్త్రంలో వీటికి సంబంధించి పలు విషయాలను తెలిపారు. మరి రాత్రుళ్లు కలలో కుక్కలు కనిపిస్తే దేని సంకేతమో ఇప్పుడు తెలుసుకుందాం..

* ఒకవేళ మీకు కలలో తెల్ల రంగు కుక్క కనిపిస్తే మంచికి సంకేతంగా భావించాలి. మీరు జీవితంలో ఎదగడానికి సంకేతంగా భావించాలి. కొత్తగా ఏదో వ్యాపారం ప్రారంభించే ఆలోచనలో ఉన్నారని అర్థం.

* కలలో కుక్క మీపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తే.. సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సంకేతం. స్నేహితులు లేదా సన్నిహితులు మీకు ద్రోహం తలపెట్టనున్నారని అర్థం చేసుకోవాలి. మీకు దగ్గరివారే మీకు నష్టం తలపెట్టే అవకాశం ఉన్నట్లు స్నప్న శాస్త్రం చెబతోంది.

* ఇక గోధుమ రంగులో ఉన్న శునకం కనిపిస్తే చెడు సంకేతంగా భావించాలని పండితులు చెబుతున్నారు. ఇలా కనిపిస్తే తీసుకునే నిర్ణయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని పండితులు హెచ్చరిస్తున్నారు. ఎంపిక విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.

* నల్ల కుక్క కనిపిస్తే.. ప్రతికూల ప్రభావాలు ఎదుర్కోక తప్పదని అర్థం చేసుకోవాలి. సన్నిహితులు ఎవరైనా మీకు నమ్మకద్రోహం చేసే అవకాశాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. ఇతరులతో జాగ్రత్తగా ఉండాలనే హెచ్చరిక ఇది అందిస్తుంది.

* ఇక ఒకవేళ కలలో కుక్క వెంబడిస్తున్నట్లు కల వస్తే జాగ్రత్తగా వ్యవహరించాలని అర్థం. కలలో కోపంగా ఉన్న కుక్క వెంబడించడం భయానకంగా అనిపించినప్పటికీ, ఇది మీ జీవితంలో ఒత్తిడిని, నియంత్రణతో ఉండాల్సిన సమయం అని చెబుతుంది. కాబట్టి ఇలాంటి కల వేస్తే ఏదో నష్టం జరిగే అవకాశం ఉన్నట్లు భావించాలి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం పలువురు పండితులు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..