హెలికాప్టర్ పేరెంటింగ్ అంటే ఏంటి.? మీరు కూడా పిల్లల్ని అలాగే పెంచుతున్నారా.?
ఈ మధ్య కాలంలో ఈ హెలికాప్టర్ పేరెంటింగ్ ధోరణి భాగా పెరుగుతోంది. తమ పిల్లల జీవితాల్లో తల్లిదండ్రులు అతిగా జోక్యం చేసుకోవడానికి హెలికాప్టర్ పేరెంటింగ్ అంటారు. ఈ రకమైన పేరెంటింగ్‌లో చిన్నారుల జీవితంలోని ప్రతీ నిర్ణయాన్ని పేరెంట్స్ తీసుకుంటారు. దీంతో చిన్నారులు పూర్తిగా తల్లిదండ్రులపైనే ఆధారపడే పరిస్థితి వస్తుంది. ఈ హెలికాప్టర్ పేరెంటింగ్ అన్న పదాన్ని తొలిసారిగా డాక్టర్ హైమ్ గినోట్..
తమకంటే తమ పిల్లలు మంచి పొజిషన్‌లో ఉండాలని ప్రతీ పేరెంట్ కోరుకుంటారు. తాము పడ్డ కష్టం తమ పిల్లలు పడకూడదనే తపనతో ఉంటారు. మంచి జీవితాన్ని పొందాలని ఆశిస్తుంటారు. అందుకోసమే ప్రతీ క్షణం కృషి చేస్తుంటారు. ఉన్నత చదువులు చదివించాలని, మంచి ఉద్యోగం చేయాలనుకుంటారు. ఈ క్రమంలోనే పేరెటింగ్ విషయంలో కొన్ని తప్పులు చేస్తుంటారు. ఇలాంటి తప్పుల్లో హెలికాప్టర్ పేరెంటింగ్ ఒకటి. ఇంతకీ హెలికాప్టర్ పేరెంటింగ్ అంటే ఏంటీ.? దీనివల్ల ఉన్న లాభ, నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ మధ్య కాలంలో ఈ హెలికాప్టర్ పేరెంటింగ్ ధోరణి భాగా పెరుగుతోంది. తమ పిల్లల జీవితాల్లో తల్లిదండ్రులు అతిగా జోక్యం చేసుకోవడానికి హెలికాప్టర్ పేరెంటింగ్ అంటారు. ఈ రకమైన పేరెంటింగ్‌లో చిన్నారుల జీవితంలోని ప్రతీ నిర్ణయాన్ని పేరెంట్స్ తీసుకుంటారు. దీంతో చిన్నారులు పూర్తిగా తల్లిదండ్రులపైనే ఆధారపడే పరిస్థితి వస్తుంది. ఈ హెలికాప్టర్ పేరెంటింగ్ అన్న పదాన్ని తొలిసారిగా డాక్టర్ హైమ్ గినోట్.. బిట్వీన్ పేరెంట్ అండ్ టీనేజర్ అనే పుస్తకంలో ప్రస్తావించారు.
హెలికాప్టర్ పేరెంటింగ్ వల్ల చిన్నారుల్లో ఆత్మవిశ్వాసం తగ్గే అవకాశం ఉంటుంది. ప్రతీ చిన్న విషయానికి పేరెంట్స్‌పై ఆధారపడే పరిస్థితి వస్తుంది. దీంతో తమపై తాము నమ్మకాన్ని కోల్పోతారు. కొత్తగా ఏ పనిచేయాలన్నా భయపడుతుంటారు. ఒక అధ్యయనం ప్రకారం.. హెలికాప్టర్ పేరెంటింగ్ వల్ల చిన్నారులు ఆందోళన, నిరాశకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తేలింది. అలాగే ఇలాంటి పేరెంటింగ్‌లో ఉండే చిన్నారులు అంతర్ముఖులుగా ఉంటారని మానసిక నిపుణులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే హెలికాప్టర్ పేరెంటింగ్ వల్ల నష్టాలే తప్ప లాభాలు లేవా అంటే.. కొన్ని ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అల్లరి చేసే పిల్లలకు హెలికాప్టర్ పేరెంట్ ఉపయోగపడుతుందని చెబుతున్నారు. అయితే చాలా సందర్భాల్లో హెలికాప్టర్ పేరెంటింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు కేవలం తల్లిదండ్రులకే పరిమితం అని చెబుతున్నారు. పిల్లల జీవితాల్లో అతిగా జోక్యం చేసుకోకుండా ఉంటూనే వారి జీవితాన్ని దిశా నిర్దేశం చేసే దిశగా అడుగులు వేయాలని మానసిక నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..