Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: బాజా భజంత్రీల మధ్య వధువు మెడలో తాళి కట్టేందుకు లేచిన వరుడు.. కట్ చేస్తే

ఈరోజుల్లో ముహూర్త సమయానికి పెళ్లిళ్లు క్యాన్సిల్ అవుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. మండపంలో అన్ని రకాల ఏర్పాట్లు చేసి లక్షల రూపాయలు వెచ్చించేవరకు సైలెంట్‌గా ఉంటున్న కొందరు చివరి నిమిషంలో పెళ్లికి నిరాకరిస్తున్నారు. అలాంటి ఘటనే చిత్రదుర్గలో చోటుచేసుకుంది. వరుడు తాళి కట్టేందుకు వధువు నిరాకరించింది.

Viral Video: బాజా భజంత్రీల మధ్య వధువు మెడలో తాళి కట్టేందుకు లేచిన వరుడు.. కట్ చేస్తే
Wedding
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 08, 2023 | 1:47 PM

పెళ్లి మండపంలో బంధుమిత్రుల కోలాహలం..  లక్షల రూపాయలు వెచ్చించి చేయించిన మండపం.. వావ్ అనేలా భోజనాలు.. మాట రాకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ చివరకు పెళ్లి కూతురు ఇచ్చిన ట్విస్ట్‌కు అందరి మైండ్ బ్లాంక్ అయ్యింది. సరిగ్గా మూడు ముళ్లు వేసే సమయంలో తనకు ఈ పెళ్లి వద్దని.. తాళి కట్టించుకునేందుకు నిరాకరించింది. దీంతో పెళ్లి పెటాకులయ్యింది. ఈ ఘటన చిత్రద్రుగ జిల్లా హోసదుర్గ తాలూకా చిక్కబ్యాలడకెరె గ్రామంలో చోటుచేసుకుంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

చిత్రదుర్గ జిల్లా హోసదుర్గ తాలూకా చిక్కబ్యాలడకెరె గ్రామంలో మంజునాథ్, ఐశ్వర్యల వివాహం నిశ్చయమైంది. దీంతో గ్రామంలోని భైరవేశ్వర కల్యాణ మండపంలో కల్యాణానికి అన్ని ఏర్పాట్లు చేశారు. పెళ్లికొడుకు తాళి కడితే వివాహం అయిపోయినట్టే. అయితే పెళ్లికూతురు ఐశ్వర్య చివరి క్షణంలో పెళ్లికి నిరాకరించింది. తాళి కట్టేందుకు లేచిన వరుడు.. పెళ్లి కూతురు ప్రవర్తనతో బిత్తరపోయాడు. ఐశ్వర్యను ఒప్పించేందుకు బంధువులు ఎంతో ప్రయత్నించారు. కానీ యువతి ససేమేర అంది. పెళ్లి కూతురు చేసిన పని పెళ్లి కొడుకు బంధువులకు ఆగ్రహం తెప్పించింది. దీంతో ఇరు వారి కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగి చివరకు పెళ్లి రద్దు అయింది. 

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ధ్యావుడా.. ఓర్రీ మేనేజర్ టాలీవుడ్ స్టార్ హీరోయినా.. ?
ధ్యావుడా.. ఓర్రీ మేనేజర్ టాలీవుడ్ స్టార్ హీరోయినా.. ?
ఔరంగజేబు ఆక్రమణదారుడే! టీవీ9 సమ్మిట్‌లో RSS నేత సునీల్‌ అంబేకర్‌
ఔరంగజేబు ఆక్రమణదారుడే! టీవీ9 సమ్మిట్‌లో RSS నేత సునీల్‌ అంబేకర్‌
వేసవిలో స్టైలిష్‌గా కనిపించడానికి బూట్లు ధరిస్తున్నారా.. జాగ్రత్త
వేసవిలో స్టైలిష్‌గా కనిపించడానికి బూట్లు ధరిస్తున్నారా.. జాగ్రత్త
రూ.వంద కింద పడేసి.. లక్షన్నర ఎత్తుకెళ్లిన దొంగల ముఠా! వీడియో
రూ.వంద కింద పడేసి.. లక్షన్నర ఎత్తుకెళ్లిన దొంగల ముఠా! వీడియో
మహిరాట్ హగ్ వైరల్! ధోని, కోహ్లీ స్పెషల్ మూమెంట్ హైలైట్!
మహిరాట్ హగ్ వైరల్! ధోని, కోహ్లీ స్పెషల్ మూమెంట్ హైలైట్!
భారతదేశం వెలుపల ఉన్న ప్రసిద్ధ శివాలయాలు.. ఎక్కడంటే..
భారతదేశం వెలుపల ఉన్న ప్రసిద్ధ శివాలయాలు.. ఎక్కడంటే..
దౌత్య సంబంధాలతో విదేశీ జైళ్లలో మగ్గుతున్న భారతీయులకు విముక్తి!
దౌత్య సంబంధాలతో విదేశీ జైళ్లలో మగ్గుతున్న భారతీయులకు విముక్తి!
స్టార్ హీరో సినిమాకు షాక్.. విడుదలైన గంటల్లోనే HD ప్రింట్ లీక్..
స్టార్ హీరో సినిమాకు షాక్.. విడుదలైన గంటల్లోనే HD ప్రింట్ లీక్..
ఓరి దేవుడా.. మయన్మార్‌లో మళ్లీ భూకంపం! వరుసగా మూడోసారి.. వీడియో
ఓరి దేవుడా.. మయన్మార్‌లో మళ్లీ భూకంపం! వరుసగా మూడోసారి.. వీడియో
తిరుమల శ్రీవారికి కాసుల వర్షం.. పది రోజుల్లో కోట్ల రూపాయల విరాళం
తిరుమల శ్రీవారికి కాసుల వర్షం.. పది రోజుల్లో కోట్ల రూపాయల విరాళం