Dimples On Cheeks: బుగ్గలపై డింపుల్స్ ఉన్న అమ్మాయిలు చాలా అదృష్టవంతులట.! మనసుకు నచ్చిన వ్యక్తులతో..
Dimples On Cheeks: చెంపలపై డింపుల్స్ వచ్చే అమ్మాయిలు ఎంతో అందంగా కనిపిస్తారు. వారికి రంగుతో సంబంధం లేకుండా..మరింత అందంగా..
Dimples On Cheeks: చెంపలపై డింపుల్స్ వచ్చే అమ్మాయిలు ఎంతో అందంగా కనిపిస్తారు. వారికి రంగుతో సంబంధం లేకుండా..మరింత అందంగా.. అట్రాక్ట్ గా కనిపిస్తుంటారు. ముఖంలో కళ్లు… పెదాలు… కనుబొమ్మలు.. జుట్టు ఇలా అమ్మాయికి అందానికి ప్రతిబింబమే. అయితే చెంపలపై డింపూల్స్ వచ్చే అమ్మాయిల స్వభావం గురించి రకారకాలుగా చెబుతుంటారు. మనం చాలా మంది అమ్మాయిలను చూస్తుంటాం.. సోట్టబుగ్గల హీరోయిన్స్ ఎక్కువగానే ఉన్నారు. ప్రీతిజింటా, దీపికా పదుకునే, అలియా భట్ వంటి హీరోయిన్స్ కు చెంపలపై డింపూల్స్ వస్తుంటాయి. అయితే సోట్ట బుగ్గలు ఉండే అమ్మాయిల మనస్తత్వం గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
సాధారణంగా అమ్మాయిలు ఎక్కువగా నవ్వితే వారి చెంపలపై డింపూల్స్ వస్తుంటాయి. అయితే అలా రావడం చాలా అదృష్టం అంటా. వీరు సున్నితమైన మనస్సు కలవారు. అంతేకాకుండా.. కళా రంగంలో ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఇవే కాకుండా.. ఇతరులకు సహాయం చేయడం.. ఎక్కవగా సమాజ సేవ చేస్తుంటారు. అయితే బుగ్గలపై సోట్టలు వచ్చే అమ్మాయిలు వివాహం తర్వాత ఎంతో సంతోషంగా ఉంటారు. వారి రాబోయే జీవితం ఎంతో ఆనందంగా,… విలాసంతవంతంగా ఉంటుంది. ఇలా సోట్ట బుగ్గులు ఉండే అమ్మాయిలకు ఎంతో మంచి వ్యక్తిత్వం ఉన్న అబ్బాయిలు జీవిత భాగస్వామిగా దొరుకుతారట. కానీ వారి అత్తగారి నుంచి వీరికి సమస్యలు ఉంటాయని చెబుతుంటారు.
అయితే ఈ డింపూల్స్ అందరూ అమ్మాయిలకు రావు. కేవలం కొద్ది మందికి మాత్రమే చెంపలపై డింపూల్స్ వస్తుంటాయి. సాదారణంగా ముఖంలో చూడగానే ఈ డింపూల్స్ కనిపించడం చాలా అరుదు. కానీ వారు నవ్వగానే డింపూల్స్ కనిపిస్తుంటాయి. కొంతమందికి ఒక చెంపపై మాత్రమే డింపూల్ కనిపిస్తుంటుంది. అయితే ఇది ఒక సమస్య అని చెబుతుంటారు. డింపూల్స్ సాధారణంగా జన్యువుగా పరిగణిస్తారు. అంటే వారి తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వస్తాయి. మరికొందరికి కండరాలలో మార్పుల వలన ఇవి వస్తాయి. చెంప కండరాలు మిగత వాటి కంటే చిన్నవిగా ఉన్నవారికి ఈ డింపూల్స్ వస్తుంటాయి. డింపుల్‌కు కారణమైన చెంప కండరాన్ని జైగోమాటికస్ అంటారు.
Kareena Kapoor: సీత పాత్ర కోసం భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న బాలీవుడ్ బ్యూటీ..