Indian Railways: రైల్లో ఏ కోచ్‌లో చైన్‌ లాగారో ఎలా తెలుస్తుంది.? చైన్‌ అసలు ఉపయోగం ఏంటి.?

అయితే ఏ కోచ్‌లో చైన్‌ను లాగారో రైల్వే పోలీసులకు అసలు ఎలా తెలుస్తుంది.? ఇంతకీ ఏయే సమయాల్లో చైన్‌ను లాగే వెసులుబాటు ఉంటుంది లాంటి విషయాలు తెలియాంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే... సాధారణంగా చైన్‌ను లాగిన వెంటనే బోగీలో ఏర్పాటు చేసిన వాల్వ్‌ తిరుగుతుంది. ఇది సదరు బోగీలో చైన్‌ లాగినట్లు ప్రధాన నియంత్రణ వ్యవస్థకు తెలియజేస్తుంది. అంతేకాకుండా చైన్‌ లాగిన కోచ్‌లో...

Indian Railways: రైల్లో ఏ కోచ్‌లో చైన్‌ లాగారో ఎలా తెలుస్తుంది.? చైన్‌ అసలు ఉపయోగం ఏంటి.?
Indian Railway

Updated on: Sep 26, 2023 | 3:57 PM

భారతీయ రైల్వే ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌ అనే విషయం తెలిసిందే. భారత్‌లో వేలాది మందికి ప్రయాణ అవసరాలను ఇండియన్‌ రైల్వే తీర్చుతోంది. కేవలం ప్రయాణికులకు మాత్రమే కాకుండా సరకు రవాణాలోనూ ఇండియన్‌ రైల్వేస్ కీలకపాత్ర పోషిస్తోంది. ఇక ఇండియన్‌ రైల్వేకు సంబంధించి ఎన్నో ఆసక్తికర విషయాలు ఉంటాయి. వీటిలో ఒకటి రైళ్లలో ఉండే చైన్స్‌. ప్రతీ ఒక్క ట్రైన్‌లో చెన్‌ను గమనించే ఉంటాం. అత్యవసర పరిస్థితుల్లో చైన్‌ను లాగితే రైలు ఆగిపోతుందనే విషయం తెలిసిందే.

అయితే ఏ కోచ్‌లో చైన్‌ను లాగారో రైల్వే పోలీసులకు అసలు ఎలా తెలుస్తుంది.? ఇంతకీ ఏయే సమయాల్లో చైన్‌ను లాగే వెసులుబాటు ఉంటుంది లాంటి విషయాలు తెలియాంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే… సాధారణంగా చైన్‌ను లాగిన వెంటనే బోగీలో ఏర్పాటు చేసిన వాల్వ్‌ తిరుగుతుంది. ఇది సదరు బోగీలో చైన్‌ లాగినట్లు ప్రధాన నియంత్రణ వ్యవస్థకు తెలియజేస్తుంది. అంతేకాకుండా చైన్‌ లాగిన కోచ్‌లో నుంచి ఒక్కసారిగా గాలి లీకైనట్లు భారీ శబ్ధం వస్తుంది. దీంతో రైల్వే పోలీసులు నేరుగా సదరు కోచ్‌లోకి వెళ్లి, చైన్ ఎందుకు లాగారన్న కారణాన్ని తెలుసుకుంటారు.

చైన్‌ను ఎప్పుడు లాగొచ్చు..

రైలులో ప్రయాణించే ప్రతీ ప్రయాణికుడికి చైన్‌ను లాగే హక్కు ఉంటుంది. ఇది చట్ట విరుద్ధం కాదు. అయితే ఇది కేవలం కొన్ని సందర్భాలకు మాత్రమే పరిమితమనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో చైన్‌ను లాగడంలో ఎలాంటి తప్పు ఉండదు. కుటుంబ సభ్యులు ఎవరైనా ప్లాట్‌ఫామ్‌పైనే ఉండిపోవడం, ఎవరికైనా అత్యవసర అనారోగ్య సమస్య తలెత్తడం, అగ్ని ప్రమాదం జరగడంలాంటివి ఏవైనా జరిగినప్పుడు చైన్‌ను లాగొచ్చు.

అయితే కొందరు ప్రయాణికులు మాత్రం దీనిని దుర్వినియోగం చేస్తున్నారు. కొందరు సరదా కోసం కూడా చైన్‌ లాగిన సందర్భాలు ఉన్నాయి. కొంత మంది అయితే ఏకంగా తమ ఇంటికి సమీపంలో చైన్‌ను లాగి రైలు ఆగడంతో దిగి వెళ్లి పోయిన సందర్భంగా సైతం ఉన్నాయని రైల్వే అధికారులు చెబుతున్నారు. అలాగే కొంత మంది దొంగలు చైన్‌ పుల్లింగ్ చేసి దోచుకున్న నగదుతో పారిపోయిన అనుభవాలు కూడా ఉన్నాయి. కాబట్టి కేవలం అత్యవసర పరిస్థితుల్లో మినహాయిస్తే ఇతర సందర్భాల్లో చైన్‌ను లాగితే చట్ట పరంగా జరిమానా కట్టాల్సి ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని ఆసక్తికర కథనాల కోసం క్లిక్ చేయండి..