
సాధారణంగా పాములంటే అందరికీ భయం..ఎందుకంటే.. పాములు చాలా విషపూరితమైనవి. విషపూరిత పాము కాటు వల్ల చాలా మంది ప్రాణాలు కొల్పోయిన సంఘటనలు అనేకం ఉన్నాయి. పాములు ఎక్కువగా వాటికి కావాల్సిన ఆహారం, ఆవాసం కోసం వెచ్చని ప్రదేశాలను వెత్తుక్కుంటూ వస్తుంటాయి. దట్టమైన చెట్లు, చెత్త, పరిశుభ్రత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎలుకలు ఎక్కువగా కనిపిస్తాయి. ఆ ఎలుకలను తినడానికి పాములు అక్కడికి వస్తాయి.
పంట పొలాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాలలో కూడా పాములు కనిపిస్తాయి. పాములు కొన్ని వస్తువులు లేదా మొక్కలకు ఆకర్షితులవుతాయి. అందుకే వాటిని ఇళ్లలో ఉంచకూడదని అంటున్నారు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో పాములు సువాసన వెదజల్లే మొక్కలను ఇష్టపడతాయి. చాలా మంది తమ ఇళ్లలో మల్లె, జాజి, పారిజాత మొక్కలను పెంచుతారు. ఇవి పాములను బాగా ఆకర్షిస్తాయి. దీని కారణంగా పాములు వాటి కింద నివసిస్తాయి. కొన్ని సార్లు అక్కడ గూడు కట్టుకుంటాయి. అందుకే పాములను దూరంగా ఉంచడానికి ఇళ్ల చుట్టూ, వరండాలలో అలాంటి చెట్లను పెంచకూడదని అంటారు. ఇంకా, చెట్లను పెంచినప్పటికీ, చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు అక్కడ శుభ్రంగా ఉంచుకోవాలని చెబుతున్నారు.
అలాగే, ఇళ్లల్లో ధాన్యం ఎక్కువగా నిల్వ ఉంచినప్పుడు కూడా పాములు చేరే అవకాశం ఉంటుంది.. ఎలాగంటే.. ఆ ధాన్యం కోసం ఎలుకలు వస్తుంటాయి. వాటి కోసం పాములు కూడా వస్తుంటాయి. అలాగే, మొగలి చెట్టును ఇంట్లో పెంచకూడదని అంటారు. ఎందుకంటే.. పాములు ఎక్కువగా మొగలి చెట్టు కింద నివసిస్తాయి. అది వెదజల్లుతున్న వాసనలు పాములను మీ ఇంటికి ఆకర్షిస్తాయి. అందుకే అది మీ ఇంట్లోకి ఎప్పుడూ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. అలాగే, ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకుంటే, పాము కాటును నివారించవచ్చు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం క్లిక్ చేయండి..