ఎప్పటి నుంచో ఇంటిపని అనేది గృహిణులే చేయవలసిన పని అనే భావన కుటుంబంలోనూ, సమాజంలోనూ పాతుకుపోయింది. అయితే భార్యాభర్తలిద్దరూ బయట పనిచేసి వచ్చి కుటుంబాన్ని నడుపుకోవాల్సిన అవసరం నేటి కాలంలో ఎక్కువగా ఉంది. అలాగే చిన్న కుటుంబాలే ఉన్నందున భార్యాభర్తలు ఇంటి పనుల్లో ఒకరికొకరు సహకరించుకుంటేనే దాంపత్యంలో ప్రేమ చిగురిస్తుంది.. జీవితం ముందుకు సాగుతుంది. నేటి రోజుల్లో వివాహ బంధం సంతోషకరంగా ఉండడం కోసం, పరస్పర నమ్మకంతో పాటు ఇంటి నిర్వహణలో పాలు పంచుకోవడం అత్యవసరం. భార్య ఏదైనా పని చేస్తుంటే భర్త తప్పక వెళ్లి తోచినంత సాయం చేయాలి. కనీస సహాయం చేస్తేనే పని భారం తమపైనే పడిందని భావనకు వారు లోనవరు. ఈ పని ఆడవారే చేయాలి.. ఇది మగవారు చేయకూడదని ఎక్కడా లేదా ఎవరూ చెప్పలేదు. ఇంకా సొంత పనులను చేసుకునే సమయంలో, విషయంలో మొహమాటం ఉండకపోవడమే మేలు. భార్య పనిలో భర్త, భర్త పనిలో భార్య.. ఇలా ఒకరికొకరు పరస్పరం చేదోడువాదోడుగా సహకరించుకుని ముందుకు సాగాలి.
ఇంటి పనిలో సహాయం చేయడానికి ఎందుకు అయిష్టత..?
భర్త పనికి వెళ్లి.. భార్య ఇంటి బాధ్యతలను భుజానికెత్తుకుంటే, భర్త ఇంటి పనిలో ఆమెకు సహాయం చేయడంలో తప్పు ఏమిటి..? ఇంటిపనులు చేస్తే ఇతరులు ఏమనుకుంటారో అనే భావన చాలా మంది భర్తలకు ఉంటుంది. చాలా మంది టీవీ ముందు కూర్చోవడానికి లేదా భార్య అదే పని చేస్తున్నట్టుగా మొబైల్ ఫోన్ పట్టుకోవడానికి కారణం ఇదే. కానీ, మీ ఈ ప్రవర్తన భార్య మనసుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా..? ఆమె మీపై కోపం తెచ్చుకోవచ్చు ఇంకా మీరు ఆమెను పట్టించుకోవడం లేదని భావించవచ్చు. అలాంటి భావాలు వివాహం బంధంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి.
భర్త తన భార్యకు ఇంటి పనులలో సహాయం చేస్తేనే వారి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. అలా సహాయం చేసుకోవడం వల్ల రిలేషన్ షిప్ లో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా..?
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..