Defrosting the Fridge: ఫ్రిజ్‌ను డీఫ్రాస్ట్ చేస్తున్నారా? జాగ్రత్తగా ఉండండి.. లేదంటే ఫ్రిజ్ పాడైపోతుంది..
ఫ్రీజర్‌లో మంచు అనవసరంగా పేరుకుపోవడాన్ని మీరు చాలాసార్లు గమనించి ఉంటారు. అది కరగడానికి డీఫ్రాస్ట్ చేయాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితిలో చాలా సార్లు ఫ్రిజ్ చాలా సమయం ఆఫ్ చేయాల్సి ఉంటుంది. ఫ్రిజ్‌లో ఉంచిన వస్తువులు పాడైపోతాయి. ఈ విషయంలో వినియోగదారులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్రీజర్‌ను ఆఫ్ చేస్తే ఆ మంచు కరగడానికి చాలా సమయం పడుతుందని భావించి చాలా మంది రిఫ్రిజిరేటర్‌ను డీఫ్రాస్ట్ చేయరు. అయితే, ఇలా చేయడం వల్ల వారు భారీగా నష్టపోవాల్సి వస్తుంది.

ప్రస్తుత కాలంలో ప్రతి ఇంట్లో రిఫ్రిజిరేటర్ కామన్ అయిపోయింది. ఇప్పుడు ఇది వంటగదిలో ముఖ్యమైన భాగంగా మారింది. ఆహారాలు, కూరగాయలు పాడవకుండా రిఫ్రిజిరేటర్‌లో పెట్టవచ్చు. ఫ్రిజ్‌లో ఆహారం పెట్టడం వలన చాలా సేపు తాజాగా ఉంటుంది. ముడి కూరగాయలు రిఫ్రిజిరేటర్‌లో వారాలపాటు సురక్షితంగా ఉంటాయి.
అయితే, ఫ్రీజర్‌లో మంచు అనవసరంగా పేరుకుపోవడాన్ని మీరు చాలాసార్లు గమనించి ఉంటారు. అది కరగడానికి డీఫ్రాస్ట్ చేయాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితిలో చాలా సార్లు ఫ్రిజ్ చాలా సమయం ఆఫ్ చేయాల్సి ఉంటుంది. ఫ్రిజ్‌లో ఉంచిన వస్తువులు పాడైపోతాయి. ఈ విషయంలో వినియోగదారులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్రీజర్‌ను ఆఫ్ చేస్తే ఆ మంచు కరగడానికి చాలా సమయం పడుతుందని భావించి చాలా మంది రిఫ్రిజిరేటర్‌ను డీఫ్రాస్ట్ చేయరు. అయితే, ఇలా చేయడం వల్ల వారు భారీగా నష్టపోవాల్సి వస్తుంది.
డీఫ్రాస్టింగ్ అవసరం..
మంచు ఏర్పడిన తర్వాత సింగిల్ డోర్ ఫ్రిజ్‌ను డీఫ్రాస్ట్ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది ఫ్రిజ్ పనితీరును మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఫ్రాస్ట్ చేరడం రిఫ్రిజిరేటర్ శీతలీకరణ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. దీని కారణంగా రిఫ్రిజిరేటర్ ఎక్కువ విద్యుత్తును వినియోగిస్తుంది. ఆహార పదార్థాలను సరిగ్గా చల్లగా అవవు.
డీఫ్రాస్ట్ చేసినప్పుడు రిఫ్రిజిరేటర్ ఆఫ్ చేయడం జరుగుతుంది..
డీఫ్రాస్ట్ చేస్తే, రిఫ్రిజిరేటర్ స్వయంచాలకంగా ఆఫ్ అవుతుంది. ఫ్రీజర్‌లో మంచు ఉన్నంత వరకు ఆన్ అవదు. ఇలాంటి పరిస్థితుల్లో ఫ్రిజ్‌లో ఉంచిన ఆహారం పాడైపోతుందనే భయం చాలా సార్లు ఉంటుంది. అయితే డీఫ్రాస్ట్ కంటే సులభమైన మార్గాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. దీని ద్వారా ఫ్రీజర్‌లో గడ్డకట్టిన మంచును త్వరగా కరిగించవచ్చు.
రిఫ్రిజిరేటర్‌కు విద్యుత్ సరఫరాను ఆపివేయండి..
ఫ్రీజర్‌లోని మంచు త్వరగా కరిగిపోవాలంటే.. మొదటగా రిఫ్రిజిరేటర్‌కు విద్యుత్ సరఫరాను ఆపివేయాలి. ఆ తర్వాత ఫ్రిజ్, ఫ్రీజర్ డోర్‌ను తెరిచి ఉంచాలి. ఫ్రీజర్‌లోని మంచు కరిగి ఒక గంటలోపే క్లీన్ అవుతుంది.
మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..




