
నిర్మాణ రంగంలో విరివిగా వాడే JCB యంత్రాల అసలు పేరు, వాటి పసుపు రంగు వెనుక ఉన్న భద్రతా కారణాలు ఎన్నో ఉన్నాయి. నిర్మాణ స్థలాల్లో తరచుగా కనిపించే JCB యంత్రంతో ప్రతి ఒక్కరికీ పరిచయమే. ఈ యంత్రాలు మట్టిని పైకి తీయడం, భారీ వస్తువులను పై అంతస్తులకు చేర్చడం, కట్టడాలను కూల్చడం వంటి అనేక పనులకు సాయపడతాయి.
‘JCB’ అనేది యంత్రం పేరు కాదు. ఇది తయారీ సంస్థ పేరు.
JCB పూర్తి రూపం: జోసెఫ్ సిరిల్ బామ్‌ఫోర్డ్ ఎక్స్‌కవేటర్స్ లిమిటెడ్ (Joseph Cyril Bamford Excavators Ltd).
దీనిని సంస్థాపకులు అయిన జోసెఫ్ సిరిల్ బామ్‌ఫోర్డ్ పేరు పెట్టారు.
ఆయన 1945లో యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఈ సంస్థను స్థాపించారు.
యంత్రం అసలు పేరు ‘బ్యాక్‌హో లోడర్’ (Backhoe Loader). కాలక్రమేణా, భారతదేశం, యుకె, ఐర్లాండ్ వంటి దేశాల్లో ఈ బ్రాండ్ పేరు ‘JCB’ సాధారణమైపోయింది.
JCB యంత్రాలు ప్రకాశవంతమైన పసుపు రంగులో ఉండటం వెనుక కారణం భద్రత.
ప్రారంభంలో ఈ యంత్రాలను ఎరుపు, తెలుపు రంగుల్లో తయారు చేశారు.
కానీ, ధూళి ఉన్న నిర్మాణ ప్రాంతాల్లో లేక తక్కువ కాంతి ఉన్న సమయాల్లో ఎరుపు, తెలుపు రంగు యంత్రాలను దూరం నుంచి గుర్తించడం కష్టంగా ఉండేది.
పసుపు అత్యంత ప్రకాశవంతమైన రంగు కాబట్టి, పగలు రాత్రి తేడా లేకుండా సులభంగా కనిపిస్తుంది.
ఈ అధిక దృశ్యమానత (Visibility) కారణంగా ప్రమాదాలు తగ్గుతాయి. ఈ భద్రతా అంశం దృష్ట్యా కంపెనీ క్రమంగా పసుపు రంగుకు మారింది.
1953లో తొలి బ్యాక్‌హో లోడర్‌ను ప్రవేశపెట్టినప్పుడు కూడా, భద్రతా అధ్యయనాలు, ఆచరణాత్మక పరిశీలనల తరువాత ఈ రంగును ప్రమాణంగా స్వీకరించారు.
డిమాండ్ పెరిగే కొద్దీ, తయారీదారులు పసుపు రంగునే కొనసాగించారు. ఇది ఇప్పుడు నిర్మాణ యంత్రాలకు ఒక ప్రమాణంగా మారిపోయింది.