
పిస్తాపప్పు ఒక ప్రసిద్ధ డ్రై ఫ్రూట్. చూడగానే నోరూరిపోతుంది! చటుక్కున రెండు పప్పులు తీసుకుని నోట్లో వేసుకోవాలనిపిస్తుంది. ఇది రుచిలో మాత్రమే కాదు..మంచి బలవర్ధకమైన ఆహారం కూడా. పిస్తా తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ప్రజలు దీనిని అనేక విధాలుగా ఉపయోగిస్తున్నారు. అయితే, సాధారణంగా అందరూ పిస్తా గింజలను తిన్న తర్వాత వాటి పెంకులను పారవేస్తారు. మీరు కూడా అలాగే చేస్తుంటారు కదా.? కానీ, ఇక నుంచి అలా చేయకండి.. ఎందుకంటే పిస్తా పెంకులు చెత్తలో వేయడానికి అర్హత లేనివి మాత్రమే కాదు.. అనేక అద్భుతమైన, ఉపయోగకరమైన ప్రయోజనాల కోసం కూడా ఉపయోగించవచ్చు. ఇవి పర్యావరణ అనుకూలమైనవి మాత్రమే కాకుండా మీ ఇంటిని, తోటను కూడా అందంగా తీర్చిదిద్దగలవు. ఈ తొక్కలను ఎలా ఉపయోగించవచ్చో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..
నేలలో తేమను నిలుపుకోవడంలో సహాయపడుతుంది. పిస్తాపప్పుల పెంకులను మొక్కల చుట్టూ రక్షక కవచంగా ఉపయోగించవచ్చు. ఇది నేల ఎండిపోకుండా నిరోధిస్తుంది. కలుపు మొక్కలను నియంత్రిస్తుంది.
కంపోస్ట్ లో భాగంగా.- ఇవి తోట వ్యర్థాలతో కలిపినప్పుడు కంపోస్ట్ తయారీకి సహాయపడతాయి. నేల సారాన్ని పెంచడానికి ఇది సహజ మార్గం.
డ్రైనేజీని మెరుగుపరచడానికి- మొక్కలు నాటేందుకు ముందుగా కుండీల అడుగున పిస్తా పెంకులను ఉంచండి. ఇవి అదనపు నీటిని బయటకు పంపి, మొక్కల వేర్లు కుళ్ళిపోకుండా కాపాడతాయి.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం క్లిక్ చేయండి..